అపార్థం చేసుకోకండి… టీవీ9 చానెల్‌లో తిష్ట వేసిన ప్రముఖుల మీద ఎవరికీ పెద్ద సదభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పటికే వాట్సప్ గ్రూపుల్లో బోలెడు కథనాలు వచ్చాయి… వాటి గురించి కాసేపు పక్కన పెట్టేయండి…
ప్రస్తుతం తెలుగు న్యూస్ చానెళ్లలో టీవీ9 నంబర్ వన్… కాదు, దాన్ని కన్నెత్తి చూసే ప్రతిభ మిగతా ఏ చానెళ్లకూ లేకుండా పోయింది… అంటే, అది సూపర్ చానెల్ అనీ, మస్తు నాణ్యమైన వార్తా కథనాలు వస్తాయని భ్రమపడకండి… అదొక దిక్కుమాలిన చానెలే… సెన్సేషన్ తప్ప దానికేమీ పట్టదు… ఐనా సరే, ఈ నంబర్ వన్… కాదు ఎవరూ ఇప్పట్లో బ్రేక్ చేయని రేటింగ్స్ ఎలా వచ్చాయి..?
Ads
ఏమో… కొందరు మిత్రులు చెబుతున్నట్టు బార్క్ రేటింగ్ మీటర్లున్న ఇళ్లు అదనంగా దొరికాయో… ఎన్టీవీ అందులో ఫెయిల్ అయ్యిందో గానీ… టీడీపీ చెబుతున్నట్టు రెండూ వైసీపీ భజన చానెళ్లే… ఐనా సరే, ఏమిటింత తేడా..? వర్తమాన బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తే… ఒకప్పుడు టీవీ9 స్థానాన్ని ఆక్రమించి నంబర్ వన్‌గా నిలిచిన తాత్కాలిక విజేత ఎన్టీవీ రేటింగ్స్ టీవీ9 రేటింగ్స్‌లో దాదాపు సగం…
అంటే టీవీ9తో పోలిస్తే ఎన్టీవీ పాపులారిటీ సగానికి పడిపోయింది అని బార్క్ లెక్క… ఫాఫం… అంతకుముందు ఎన్టీవీ చూపించిన ప్రతిభ ఏమిటి..? ఇప్పుడు కొరగాకుండా చేసింది ఏమిటి…? సరే, వీటిని కాసేపు పక్కన పెడితే ఆమధ్య సాక్షి టీవీ కాస్త మెరుగుపడినట్టు అనిపించింది… మళ్లీ ఇప్పుడది ఏకంగా ఫాఫం ఎనిమిదో ప్లేసుకు జారిపోయింది… జగన్ 11 సీట్లు పాపులారిటీలాగే…
సరే, రెండు రాష్ట్రాల కంబైన్డ్ రేటింగ్స్ వదిలేస్తే… ఓసారి కీలకమైన హైదరాబాద్ రేటింగ్స్ చూద్దాం… మరీ దారుణం… టీవీ9 152 అయితే ఎన్టీవీ మరీ 63… అయిదో ప్లేసు..!! టెన్ టీవీని అసలు ఎవడూ దేకుతలేడని అర్థం, మరీ 3.9 రేటింగ్స్ హైదరాబాదులో… ఇంకా చెప్పదగిన విషయం ఏమిటంటే..? అసలు ఓ పాత్రికేయ విలువలు ఏమాత్రం కనిపించని మహాన్యూస్ చివరకు సాక్షి టీవీని అధిగమించడం… జగన్ తలవంచుకోవాల్సిన పతనం ఇది…
ఇక మిగతా చానెళ్లు, మిగతా కేటగిరీల చర్చ అనవసరం… ఎటొచ్చీ అద్భుతమైన సాధన సంపత్తి కలిగిన ఈటీవీ, సాక్షి వంటి చానెళ్లు నానాటికీ దిగదుడుపు… ఐనా సరే వాటికి ఆత్మసమీక్ష ఉంటుందా..? నెవ్వర్… అలాంటిది ఉంటే అవి తెలుగు న్యూస్ చానెళ్లే అనిపించుకోవు…!!
Share this Article