అచ్చంగా మమత బెనర్జీ ఓ రౌడీ రాజ్యాన్ని నడిపిస్తోంది… అందుకే జనంలో విపరీతమైన వ్యతిరేకత వస్తోంది… జనం వీథుల్లోకి వస్తున్నారు, నినదిస్తున్నారు… తట్టుకోలేకపోతోంది… పీజీ జూనియర్ డాక్టర్ హత్యాచారం విషయంలో ఆధారాలు, సాక్ష్యాల నిర్మూలనకు, నిందితుల రక్షణకు మమత బెనర్జీ గ్యాంగ్ సాగించిన అరాచకం అంతా బయటపడుతోంది…
ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది తను..? జరగాల్సినంత చర్చ జరగడం లేదు… ఎలాగూ బెంగాల్ విషయంలో మొదటి నుంచీ మోడీ బలహీనుడే… చేష్టలు దక్కిన నిష్క్రియాపరత్వమే… ఒకవేళ బెంగాల్ అల్లర్లు ఆగకపోతే అస్సోం, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్ కూడా మండిపోతాయట… అంటే తన పార్టీయే విధ్వంసానికి, అల్లర్లకు పూనుకుంటుందని హెచ్చరిస్తోంది…
రౌడీ రాజ్యం తనది… తన పెడపోకడలతో అక్కడ ఎలాగూ ప్రజాస్వామిక వాతావరణం ఎప్పుడో మాయమైంది… హత్యాచారాన్ని మసిపూసి మారేడుకాయ చేసి, దాచిపెట్టడానికి విపల ప్రయత్నం చేసిన ఆమె… తనే వీథుల్లోకి వచ్చి న్యాయం జరగాలి అని ఊరేగింపు తీసింది… సీబీఐ ఏం చేస్తోంది అంటూ గాయి చేస్తుంది… కఠిన చర్యలు కావాలంటూ మోడీకి లేఖలు రాస్తుంది… అన్నీ డైవర్షన్ టాక్టిక్స్…
Ads
బెంగాల్ ఎలాగూ అనుభవిస్తోంది, ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా మంటలు పెడుతుందట… ఆమె ఇండి కూటమి సభ్యురాలు కాబట్టి ఆ కూటమి నేతలు ఒక్కడూ మాట్లాడడు… ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి, యూపీలో హత్రాస్ సంఘటన జరిగినప్పుడు దేశం నలుమూలల నుంచీ అరాచక శక్తులు అక్కడికి చేరి మంటలు ఎగదోయడానికి ఎలా ప్రయత్నించాయో… మరి ఇప్పుడు ఆ జూనియర్ డాక్టర్ మహిళ కాదా… సామూహిక అత్యాచారం, కాళ్లూచేతులూ విరిచేసి, దారుణంగా చంపేశారు కదా…
మరోవైపు మమత ఉన్మాదిలా అరుస్తోంది… ఆరోజు సంఘటన జరగ్గానే మమత చేతిలో ఉన్న హోంశాఖ ఏం చేసింది..? ఆత్మహత్య అని చెప్పి కేస్ క్లోజ్ చేయాలని త్వరపడింది… ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను వెంటనే వేరే కాలేజీకి మార్చారు..? ఎందుకా బాసట..? ఎందుకా ప్రేమ..? సీబీఐకి కేస్ అప్పగించేరోజున వేల మంది గూండాలు హాస్పిటల్ ధ్వంసం చేసి, ఆధారాల్ని నిర్మూలించారు..? ఎవరు వాళ్లు..?
ఒకవైపు రోహింగ్యాలను, బంగ్లా కాందిశీకులను రారమ్మని పిలుస్తుంది… వోటు బ్యాంకుగా చేసుకుంటుంది… ఆమె ఏం చేస్తే అది చెల్లుబాటవుతోంది… కానీ తన ధోరణి మీద చర్చ లేదు దేశంలో…! ఒకవైపు రాహుల్ గాంధీయేమో కిరోసిన్ చల్లి ఉంచాం అంటాడట, ఈమె ఇతర రాష్ట్రాలు తగులబడతాయి అని బెదిరిస్తుంది…? ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు..? ఏమిటీ అరాచకం..?
మీడియా, సోషల్ మీడియా కూడా అలాగే… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమైనా జరిగితే పెంట పెంట చేస్తున్నాయి… ఇదుగో ఇలా ఇండికూటమి రాష్ట్రాల్లో ఏం జరిగినా నోళ్లు, కళ్లు మూసుకుంటున్నాయి… సంఘటనను, అన్యాయాన్ని అలాగే చూడకుండా… బీజేపీ కోణంలో, మోడీ కోణంలో చూసి స్పందించడం లేదా నిశ్శబ్దంలోకి జారిపోవడం ఓ దారుణ ధోరణి… ఒరేయ్, చిత్రవధను అనుభవించి మరణించిందిరా ఆ అమ్మాయి… ఆ నరకయాతనను ఒక్కసారి ఊహించండి..!!
Share this Article