సంక్రాంతి రాకముందే దాని పేరిట టీవీలో ఓ స్పెషల్ షో చూసేయాలా…? చూసేయాల్సిందే… డబ్బులు ఇచ్చేవాడు ఎప్పుడు ప్రసారం చేయమని అడిగితే అప్పుడు వర్జ్యం, వారం ఏమీ చూడకుండా వేసేయాల్సిందే… మొన్నటి ఆదివారం వేళాపాళా లేకుండానే ‘పార్టీకి వేళాయెరా’ అని జీవాడు న్యూఇయర్ షో వేసేశాడు కదా… ఇప్పుడూ అంతే… సంక్రాంతి ఎప్పుడైనా రానీ… ఓ షో వేసేద్దాం అంటున్నాడు… వాడి అవసరం అది… ఇవేవీ చేయకపోతే వాడి నంబర్ వన్ స్థానం కాస్తా గల్లంతయ్యే ప్రమాదం ఉంది… కాస్త వివరంగా చెప్పుకుందాం…
ఈమె గుర్తుందా..? బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ తల్లి… హౌస్‌లోకి వెళ్లి కొట్టుకొండిరా అని సరదాగా హుషారెక్కించిన ఆమె… చివరి రోజు వేదిక మీద తన బిడ్డతోపాటు అఖిల్‌నూ ఆశీర్వదించండి అని చిరంజీవికి, నాగార్జునకు చెప్పింది… అమ్మ ఆమె… మస్తు మార్కులు కొట్టేసింది… ఇప్పుడు ఈమె ప్రస్తావన ఎందుకంటే..?
Ads
మామూలుగా తెలుగు టీవీలు ఏం చేస్తాయి..? ఏదో సందర్భం రాగానే తమ సీరియళ్లు, తమ రియాలిటీ షోల బాపతు కళాకారులను రంగంలోకి దింపేసి, అర్జెంటుగా ఏవో కార్యక్రమాల్ని ప్రసారం చేస్తాయి… రేటింగ్స్ ప్లస్ డబ్బులు… ఇన్నిరోజులూ మాటీవీ వాడికి ఈ ఇకమత్ తెలియదు… ఈటీవీ, జీటీవీ వాడు ఇలా చేసేవాళ్లు… ఇప్పుడు మాటీవీ వాడూ స్టార్ట్ చేశాడు… ఇదుగో అభిజిత్‌ను, తల్లితోసహా రప్పించాడు ఓ ప్రోగ్రాం కోసం… గంగవ్వ, అవినాష్, అరియానాలు మాత్రమే కాదు… లాస్యను మళ్లీ తన పాత రవితో కలిపాడు… తమ సీరియళ్ల యాక్టర్లను రంగంలోకి దింపాడు… ‘ది ఫ్యామిలీ పార్టీ’ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు… (జీవాడు పార్టీకి వేళాయెరా అంటూ గత ఆదివారం దెబ్బకొట్టాడు కదా, మాటీవీవాడు ‘ది ఫ్యామిలీ పార్టీ’ అంటూ వస్తున్నాడు…
మాటీవీ అర్జెంటుగా ఎందుకు కళ్లు తెరిచింది… ఎంతసేపూ సీరియళ్లు తప్ప ఇంకేమీ పట్టని టీవీ ఇలాంటి స్పెషల్ షోలు ఎందుకు వేస్తోంది..? అది అర్థం కావాలంటే ముందుగా దాని పొజిషన్ సంక్షిప్తంగా తెలుసుకోవాలి… విషయం ఏమిటంటే… దాని నంబర్ వన్ స్థానానికి ఎసరు వస్తోంది… అది జీటీవీ వాడి వల్ల వస్తోంది… ఎలాగంటే..?
చూశారు కదా… ఫిక్షన్ కేటగిరీలో జీ, మాటీవీలు సేమ్… దాదాపు ఎనిమిది జీటీవీ సీరియళ్లు మాటీవీ రేటింగుల మీద దాడి చేస్తున్నయ్… మాటీవీలో కార్తీకదీపం, గృహలక్ష్మి తప్ప పెద్దగా ధూంధాం చేస్తున్న సీరియళ్లేమీ లేవు… కార్తీకదీపం త్వరలో ముగించాల్సిందే… వదినమ్మ డౌన్ అయిపోయింది… మరోవైపు జీవాడి సీరియళ్లు ప్రతివారం రేటింగులు పెంచుకుంటున్నయ్… ఈ స్థితిలో మాటీవీని నెట్టుకొస్తున్నది నాన్-ఫిక్షన్… అంటే రియాలిటీ… కానీ బిగ్‌బాస్ అయిపోయింది…
డాన్స్ ప్లస్ అని భారీగా స్టార్ట్ చేశాడు గానీ, అది అంత క్లిక్కయ్యే చాన్సుల్లేవు… అలాంటి జానర్లలో ఈటీవీ టాప్… మరి ఏం చేయాలి..? ఇదుగో ఇలాంటి స్పెషల్ ప్రోగ్రాములు చకచకా ప్లాన్ చేసి, నాన్-ఫిక్షన్ కేటగిరీలో రేటింగులు పెంచుకునే ప్రయత్నంలో పడ్డాడు మాటీవీవాడు… నిజానికి బొమ్మ అదిరింది, సరిగమప మరీ ఇంతగా ఫ్లాప్ కాకపోతే జీతెలుగువాడు ఇప్పటికే మాటీవీని దాటేసేవాడు… మూవీస్ విభాగంలో జెమినివాడు, నాన్-ఫిక్షన్లో ఈటీవీవాడు టాప్… ఇక మిగిలింది ఫిక్షన్ అందులో జీవాడు తరుముకొస్తున్నాడు… అందుకే మాటీవీవాడికి తాజా కలవరం…
నాన్-ఫిక్షన్ కేటగిరీలో ఇంకా రేటింగ్స్ కొట్టాలనే తాపత్రయం… మాటీవీ అందులో వీక్ కాబట్టి, బిగ్‌బాస్ అయిపోయింది కాబట్టి, డాన్స్ ప్లస్ కూడా క్లిక్కు కాకపోతే మాటీవీ ఇంకా బలహీనపడుతుంది కాబట్టి, ఆ వీక్ పాయింటులోనే కొట్టాలనేది జీవాడి ప్లాన్… అందుకే అదిరింది, సరిగమ పోతేపోయింది అనుకుని… బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ మొదలుపెట్టాడు… ఇది క్లిక్కయితే మాటీవీ వాడికి మరో దెబ్బ తప్పదు… ఇదుగో రెండు చానెళ్ల మధ్య ఈ స్థాయిలో పోటీ నెలకొని ఉంది ఇప్పుడు…
రేటింగులపై మంచి అవగాహన ఉన్న ఓ మిత్రుడు క్రోడీకరించిన రేటింగుల చార్ట్ ఇది… ఈటీవీ బలం నాన్-ఫిక్షన్… ఓసారి చూడండి న్యూస్, ఆలీతో సరదాగా, వావ్, ఢీ, జబర్దస్త్, క్యాష్… ఇవి లేకపోతే ఈటీవీ మరింత ఢమాల్… జీ ప్రస్తుతం నాన్-ఫిక్షన్లో వీక్… పెంచుకోవాల్సిందే… అంటే మంచి రియాలిటీ షోలు పడాలి, స్పెషల్ ప్రోగ్రాములు పడాలి… అదీ తాపత్రయం… ఇక ఏ ఫిక్షన్లో మాటీవీ బలంగా ఉందో అందులోనూ వీక్ కాబోతోంది… కార్తీకదీపం, గృహలక్ష్మి తప్ప ఇంకేవీ ఊడబొడిచే స్థితిలో లేవు, పడిపోతున్నయ్… అందుకని నాన్-ఫిక్షన్ విభాగంలో కవర్ చేసుకోవాలని జీ, మా పోటాపోటీలు పడుతున్నయ్… బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ క్లిక్ కాకపోతే జీవాడికి మొహం వాచిపోవడం ఖాయం… డాన్స్ ప్లస్ క్లిక్ కాకపోతే మాటీవీ మొహం పగిలిపోవడం ఖాయం…!!
Share this Article