.
రీసెంట్‌గా మనం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఆయన భార్య బ్రిజిట్ మీద ఓ కథనం చదువుకున్నాం గుర్తుందా..? వియత్నాం వెళ్తూ ఆమె ఆయన మొహం మీద చరవడం ప్రపంచమంతా చూసింది, నవ్వింది…
వాళ్ల లవ్ స్టోరీ కూడా చదివాం… ఆయనకు ఆమె టీచర్ గతంలో… ఆమెకు 39, ఆయనకు 15 … ఆమె పెద్ద కూతురు ఆయన క్లాస్ మేట్… ఆ టీనేజ్ అబ్బాయి ఏకంగా ఆ టీచర్‌తోనే లవ్… చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు…
Ads
సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే..? ఈ ఇద్దరూ కలిసి ఓ ఇన్‌ఫ్లుయెన్స్ ఓవెన్స్ మీద పరువునష్టం దావా వేశారు… అది చదువుతుంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ల తలనొప్పి మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా ఉందని అర్థమవుతోంది… ఏకంగా ప్రధానులను, అధ్యక్షులను, వాళ్ల కుటుంబాలను టార్గెట్ చేసి మరీ…
సదరు ఓవెన్స్ తన రాతలు, పాడ్‌కాస్ట్‌ల్లో ఏమని చెబుతాడంటే..? ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భార్య బ్రిజిట్ (ఇప్పుడు 72 ఏళ్ల వయస్సు) అసలు ఆడదే కాదట… తను పుట్టుకతో మగవాడట… పైగా మాక్రాన్‌కు దగ్గర రక్తసంబంధం అట, ఒకటే కుటుంబమట…
అంతేకాదు, మాక్రాన్ కూడా నిజానికి సహజమైన మానవ పుట్టుక కాదట… సీఐఏ ఏదో మానవ పుట్టుకకు సంబంధించి కృత్రిమ ప్రయోగాల్లో తయారైనవాడట… లేదా ఏదో ‘మైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్’ అట… ఇవేమీ వ్యంగ్యం కోసం రాసిన రాతలు కావట… సీరియస్ విమర్శలే…
దాంతో ఆ దంపతులు అమెరికాలోనే ఓ దావా వేశారు… అమెరికన్ స్టేట్ డెలావర్‌లో…
అవసరమైతే అమెరికాకు వచ్చి మరీ ఫైట్ చేస్తాం, కానీ వదిలేది లేదంటున్నారు… ‘‘ఓవెన్స్ తన పేరు కోసం, డబ్బు సంపాదించడం కోసం రాసిన రాతలు మా గౌరవాన్ని, మా ప్రతిష్టను మాత్రమే కాదు, మా బంధుమిత్రులు, మా సర్కిళ్లలో మమ్మల్ని అపఖ్యాతి పాలుచేయడం మాత్రమే కాదు, ఒక దేశ అత్యున్నత అధికార స్థానాల్ని అవమానించడం కూడా…’’ ఇదీ వాళ్లు ఫైల్ చేసిన 218 పేజీల దావాలోని సారాంశం…
Share this Article