.
‘‘జామచెట్టుకు కాస్తాయి జామకాయలు, మామిడిచెట్టుకు కాస్తాయి మామిడికాయలు, మల్లెచెట్టుకు పూస్తాయి మల్లెపువ్వులు, బంతిచెట్టుకు పూస్తాయి బంతిపువ్వులు, జడలోన పెడతారు మల్లెచెండులు, మెడలోన వేస్తారు పూలదండలు
ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోజు పెంచుకుంటాయి ములక్కాయలు, ఏదేమైనా గానీ, ఎవరేమన్నా గానీ నా ముద్దుపేరు పెట్టుకున్నా డీడీడీ స్వాతిరెడ్డీ… నేను ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి…
Ads
నీకు నేమ్ ఉంటాది, నాకు ఫేమ్ ఉంటాది, నీకు ఫిగర్ ఉంటాది, మాకు పొగరు ఉంటాది…’’
ఎలా ఉంది పాట..? జుత్తు పీక్కోవాలని ఉందా..? సినిమా సాహిత్యం అంటేనే ఓ దిక్కుమాలిన రచన ప్రక్రియ అనే భావన ఉంది గానీ మరీ ఈ రేంజ్ నాసిరకం, చెత్త అవసరమా..? అసలు అదేం పాటరా బాబూ..? అవును, ఈ పాట తాజాగా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాలోనిది… ఆ స్వాతిరెడ్డి పాట ఇదీ… (వినాలనుకుంటే రిస్క్ మీదే)…
పచ్చ ఎండు గడ్డి అట… అది భగ్గుమన్నదట… తెలుగు ప్రేక్షకులు అంటే అంత లోకువ అయిపోయారు ఈ సినిమా టీమ్‌కు…
సరే, ఆ పెంట పాటను, అందులో నటించిన రెబ్బా జాన్‌ను… ఫాఫం ఈమధ్య కాస్త మంచి పేరు తెచ్చుకుంటున్న భీమ్స్‌ను కూడా ఓసారి జాలిగా చూసి కాస్త పక్కన పెడితే… నిర్మాతలు ముందే చెప్పారు, ఈ సినిమాలో కథాకాకరకాయ ఏమీ ఉండదని… హాయిగా నవ్వుకుని వెళ్లండి అని…
అదుగో అక్కడ వచ్చింది తిప్పలు… కథా తొక్కాతోలూ ఏదీ లేదు గానీ… దానికే కట్టుబడి ఉంటే సరిపోయేది… సినిమా అన్నాక పేరుకైనా ఓ కథ ఉండాలి కదా అనుకుని దర్శకుడు ఏదో ప్రయాసపడటంతో క్వాలిటీ దెబ్బతింది… జాతిరత్నాలు, ఎఫ్2, డీజే టిల్లు, సంక్రాంతికి వస్తున్నాం… పెద్ద కథేమీ ఉండదు… డ్రామా ఉండదు… వరుసగా జబర్దస్త్ తాలూకు సీన్లు, స్కిట్లు, పంచులు ఒక్కచోట కుట్టేయడమే..?
కానీ సీక్వెల్స్ అదే రేంజులో అలరించడం కష్టం… మ్యాడ్ ఫస్ట్ పార్ట్ సమయంలో వీళ్లెవరి మీద ఎవరికీ అంచనాలు లేవు… పైగా సరదాగా కొన్ని అల్లరి సీన్లు నడిపిస్తూ వెళ్లారు… ఏదో నడిచిపోయింది… కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ మీద అంచనాలున్నయ్… దానికి తగినట్టు లేదు… పైగా బలవంతంగా కామెడీ సీన్లు ఇరికించారు… సరే, ఏదో కథ నడుస్తున్నదిగా అనుకుంటే ఓ క్రైమ్ జత చేసి, దాని చుట్టూ కొన్ని సీన్లు పెట్టారు… కృతకంగా ఉన్నయ్…
మ్యాడ్ సినిమాలో ఓ సూపర్ హిట్ పాట… ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోటొస్తది అనే పాట ఉంది కదా… ఆ మెరుపులేమీ లేవు ఈ సీక్వెల్‌లో… నలుగురు స్నేహితుల్లో ఒకరైన లడ్డూ గాడి పెళ్లి ఎపిసోడ్ వరకూ కాస్త నవ్వులు వర్కవుట్ అయ్యాయి గానీ ఆ తరువాత సినిమా గాడి తప్పింది… బోర్ కొట్టింది…
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఎవరూ తక్కువ చేయలేదు… కాకపోతే కామెడీ సరిగ్గా పండలేదు… అది దర్శకుడి వైఫల్యమే… వీక్ క్లైమాక్స్ సరేసరి… ఎస్, స్వాతిరెడ్డి పాటలాగే ఉంది సినిమా…!!
Share this Article