.
మదరాసి… నిజానికి ఈ సినిమా మీద పెద్ద అంచనాలే ఉన్నాయి నిన్నటిదాాకా… గజిని తీసిన మురుగదాస్‌ను మరిచిపోలేం కదా… తరువాత 7 th సెన్స్, తుపాకీ పర్లేదు, కత్తి వోకే వోకే…
చాన్నాళ్లుగా మళ్లీ వెలుగులోకి రాలేదు ఆ ప్రతిభ… ఇప్పుడు ఈ మదరాసి సినిమాతో పునర్వైభవం వస్తుందా..? శివకార్తికేయన్ అమరన్ సినిమాతో తెలుగువాళ్లకు బాగా తెలిశాడు… ఈ మదరాసిలో తను హీరో… ఇక రుక్మిణి వసంత్… అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే తెలుగు సినిమాతో మనకు పరిచయమే… సప్తసాగర దాచే సినిమాతో పాపులర్…
Ads
సంప్రదాయబద్ధంగా కనిపించే నటి… ఈ ముగ్గురే కాదు, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు కూడా ఇది కీలకమే… తను కూడా ఈమధ్య మాంచి పాపులర్ ట్యూన్స్, బీజీఎం ఇవ్వక ఎన్నాళ్లయిందో… వీళ్లందరికీ కీలకమైన ఈ మదరాసి సినిమా ఎలా ఉంది.,.? ప్చ్, అందరి ఆశలనూ నీరుకార్చింది ఒకరకంగా…
మురుగదాస్ అప్పుడప్పుడూ ఏవో తిక్క వ్యాఖ్యానాలు చేస్తుంటాడు, అది వేరే సంగతి… మామూలుగా నార్త్ ఇండియన్స్ అందరూ సౌత్ ఇండియన్స్‌ను మదరాసీలు అంటుంటారు కదా… విలన్ కూడా ఇందులో హీరోను విలన్ మదరాసీ అంటుంటాడు.,. అదేనట ఈ టైటిల్‌కు జస్టిఫికేషన్… హేమిటో…
అఫ్‌కోర్స్, ఈమధ్య తమిళ పేర్లను యథాతథంగా తెలుగులో పెట్టేస్తున్నారు కదా, ఇది కాస్త నయమే… పూకి అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తుంది తెలుసు కదా… అంత దరిద్రం పట్టింది తెలుగులోకి వచ్చే డబ్బింగ్ సినిమాలకు… తెలుగులో కూడా సెన్సార్ బోర్డు ఉన్నట్టుంది ఫాఫం…
మురుగదాస్ అంటే యాక్షన్ మాత్రమే కాదు, భిన్నమైన కథను ఆశిస్తాం కదా మనం… కానీ ఇందులో ఓ రొటీన్ సగటు సౌత్ స్టార్ సినిమా బాపతు కథ మాత్రమే… కాకపోతే కాస్త వైవిధ్యంగా… హీరో తనది కాని పోరాటం చేస్తాడు…
శివ కార్తికేయన్ నటన సాఫీగా ఉంటుంది… పెద్దగా గొప్పగా ఏమీ ఉండదు… తీసిపారేసే టైపు కూడా కాదు.,. కాకపోతే రుక్మిణి వసంత్ తెర మీద ఉన్నంత సేపు ప్లజెంటుగా ఉంటుంది… ఈ సినిమాలో ఏమైనా కాస్త పాజిటివ్‌నెస్ ఉందీ అంటే ఆమె ప్రజెన్స్ మాత్రమే… ఎమోషనల్ బీట్స్‌లో ప్రభావం చూపింది…
ప్రెడిక్టబుల్ కథనం… హీరో ఎలివేషన్ ఓవర్‌డోస్… కొన్ని సన్నివేశాలు మరీ అతి… ప్రత్యేకించి వయోలెన్స్ ఈ రేంజ్ అవసరమా మురుగదాస్..? ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంత సౌకర్యంగా అనిపించకపోవచ్చు… ఫస్ట్ హాఫ్ బిల్డప్, సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్… ఏమాత్రం బాగోలేని పాటలు వరుసగా, అసందర్భంగా వచ్చి ఇబ్బంది పెడతాయి…
విలన్‌గా విద్యుత్ జమ్వాల్ నటన ఆకట్టుకుంది… ఏదో గజిని మార్క్ సినిమా ఆశించి థియేటర్‌కు వెళ్తారేమో, జాగ్రత్త… అంత సీన్ లేదు ఈ పాన్ ఇండియా మూవీకి…!
Share this Article