.
Subramanyam Dogiparthi ………. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు . హీరో కృష్ణంరాజు , జయప్రద జయసుధలు ఇద్దరు హీరోయిన్లు . 1982 సంక్రాంతి సీజనుకు విడుదలయిన మంచి సినిమా ఈ మధురస్వప్నం .
కృష్ణంరాజు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన కృష్ణంరాజు స్వంత సినిమా . యద్దనపూడి సులోచనారాణి నవలకు సినిమా రూపం . కొల్లేరు ప్రాంతంలోని గ్రామాలలో షూటింగ్ చేయబడిన సినిమా .
Ads
ఆదర్శవంతుడైన డాక్టరుగా కృష్ణంరాజు , అతన్ని ప్రేమించి పెళ్ళిచేసుకునే టీచరుగా జయసుధ , నాట్యమయూరిగా అందాల జయప్రద చాలా బాగా , పోటాపోటీగా నటించారు .
బిందెలు , కుండలు , ఫలపుష్పాలు , కాయలు వగైరా లేకుండా చక్కటి రెండు శాస్త్రీయ నృత్యాలను రాఘవేంద్రరావు చిత్రీకరించారు . జయప్రద రెండు నృత్యాలు చాలా బాగుంటాయి . నృత్య దర్శకుడు సలీంని తప్పక అభినందించవలసిందే .
జయప్రద తండ్రిగా సత్యనారాయణకు మంచి పాత్ర . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య రంగనాధ్ , నిర్మలమ్మ , ప్రభాకరరెడ్డి , అత్తిలి లక్ష్మి , చలపతిరావు , గిరిబాబు , సారధి , సాక్షి రంగారావు , రోహిణి ప్రభృతులు నటించారు .
సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా బాగుంటాయి . వేటూరి వ్రాసిన చంద్ర కళాధరా నటరాజా ఈజన్మకు ఇది నా తుది పూజ అనే జయప్రద మీది క్లైమాక్స్ సాంగ్ చాలా బాగుంటుంది . సాహిత్యం , నృత్యం , సుశీలమ్మ గాత్రం , చిత్రీకరణ అన్నీ బాగుంటాయి . మరొక బృంద నృత్య గీతం విరిసిన వయసులే సొగసులై కురిసెను ఆమని పూలజల్లుగా కూడా బాగుంటుంది .
మిగిలిన పాటలు ఎన్నో ఊహలు ఎన్నో తలుపులు ఎన్నో ఆశలు , గువ్వల జంటను చూడు నవ్వుల పంటను చూడు , గోపాలుని కోసం ఈ రాధ , గోరింట పండింది కోనేరు నిండింది డ్యూయెట్లు బాగుంటాయి . పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావుకు ఓ ప్రత్యేకత ఉంటుంది కదా !
సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమాయే . సరస్సు లాగానే అల్లరి లేకుండా , రణగొణ ధ్వనులు లేకుండా ఆహ్లాదంగా సాగిపోయే సినిమా . హీరోహీరోయిన్లు ముగ్గురూ చాలా చక్కగా అందంగా నటించారు . A watchable family sentimental romantic movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
పాటల ట్యూన్స్, సినిమా తేరే మేరే సప్నే సినిమాకు కాపీ అనిపించేలా ఉంటయ్… నవల బాగుండి, సినిమా బాగోలేదు అనే బాపతు సినిమాల్లో ఇదీ ఒకటి… పెద్దగా ఆడలేదు… బ్రిటిష్ డాక్టర్, రచయిత ఏజే క్రానిన్ రాసిన ద సిటడెల్ అనే నవల ఆధారంగా తీసిన సినిమా అంటారు… యద్దనపూడి నవల కూడా దాని మీద ఆధారపడిందని చెప్పాలి… క్రానిన్ నవల వల్ల చాలా గొప్ప మేలు జరిగింది బ్రిటన్ లో. నోషనల్ హెల్త్ స్కీమ్ (NHS) వచ్చింది. అతని రికమెండేషన్ల వల్ల…
Share this Article