మిత్రుడు Venkateshwar Reddy… ఫేస్ బుక్ వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఓసారి చదవండి ముందుగా… ‘‘హిజ్రాలు సానుభూతి కోల్పోతున్నారు.
ఈ మధ్య ఒక గృహప్రవేశ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా పెద్ద పెద్దగా అరుపులు వినవచ్చాయి. ఏమిటా ??? అని చూస్తే… ఒక హిజ్రా … గృహస్థులకు శుభం జరగాలంటే 42 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. 42 వేలే ఎందుకు? అని ప్రశ్నిస్తే.. ఆ ఏరియాలో ఉండే స్క్వేర్ ఫీట్ ఆధారంగా, ఫ్లాట్ ఏరియా ఆధారంగా నిర్ణయించారట. ఆ రోజే గృహప్రవేశం అని ఎవరు చెప్పారు? అని అడిగితే… గోమాతను సప్లై చేసే వాడని సమాధానం. నువ్వు వెళ్ళాక మరొక హిజ్రా వస్తే మేమేం చేయాలి అని ప్రశ్నిస్తే…. ఈ గోడ మీద నేను ఒక నెంబర్ వేసి సంతకము పెడతాను, అది చూసి వెళ్ళిపోతారు అని సమాధానం.
సిఐకి ఫోన్ చేస్తామని చెబితే… ఆ భాయ్యా కూడా.. మా దగ్గర తీసుకుంటాడులే అని మరో సమాధానం. నీకు ఇవ్వము చేతనైంది చేసుకోమనగానే.. మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు… పోకిరి సినిమాలో బిచ్చగాళ్ళ మాదిరిగా… 10 నిమిషాల్లో 20 మందికి పైగా హిజ్రాలు వచ్చి పాటలు పాడటం మొదలు పెట్టారు.. వాళ్లు తిట్టే తిట్లు, పాటలు వినలేక, శుభ వాతావరణాన్ని పాడు చేసుకోలేక… 42000 లో సగమైన 21000 ఇచ్చిన తర్వాత కానీ వాళ్లు అక్కడి నుంచి కదలలేదు… ఈ సంఘటన చూడక ముందు నాలో హిజ్రాల పట్ల చాలా సానుభూతి , ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేది..ఈ సంఘటన చూశాక ఈ దేశంలో ఎవరికి తోచిన రీతిలో వాళ్లు దోచుకోవటం అనేది ఒక సర్వసాధారణంగా కనబడింది…
(ప్రతీకాత్మక చిత్రం)
Ads
ఒక్క హైదరాబాదే కాదు, రాష్ట్రంలో అనేక పట్టణాల్లోనూ ఇదే స్థితి… ఎహె, ఇదేం పిచ్చి సమస్య, బెగ్గర్స్, ఏవో ముష్టి పడేసి వెళ్లగొట్టేస్తే సరి అనే పోలీసులే అధికం… కానీ నిజంగానే అనేక సమస్యలు తలెత్తుతున్నయ్… షాపుల ఓపెనింగులు, గృహప్రవేశాలు, రిసెప్షన్లు, పెళ్లిళ్లు మాత్రమే కాదు, చిన్నాచితకా ఫంక్షన్ అంటే చాలు వాలిపోతున్నారు… బంధుమిత్రుల ముందు తలవంపులు… గట్టిగా ఏమీ అనలేరు, అంటే ఇంకా ఎంత పెంట చేస్తారోనని జంకు…
ఏరియాలు పంచుకుంటారు, ఒకరి ఏరియాలోకి ఇంకొకరు రారు… ఫంక్షన్ హాలు రేంజ్, ఏర్పాట్ల లెవల్ చూసి అప్పటికప్పుడు అడగాల్సిన ‘హిజ్రా మామూల్’ డిసైడ్ చేస్తారు… వేలకువేలు… చివరకు కొన్ని హాళ్లలో ఇలాంటోళ్లు జొరబడకుండా బౌన్సర్లను పెట్టినా ప్రయోజనం ఉండటం లేదు… హాళ్ల మేనేజర్లతో కూడా కమీషన్ల లింకులు… క్రమేపీ ఓ మాఫియాలాగా మారుతోంది… ఇదింకా ముదిరితే ఆర్గనైజ్డ్ క్రైం వైపు దారితీసే ప్రమాదం ఉంది… ఆల్రెడీ వచ్చిందేమో కూడా… థర్డ్ జెండర్ అంటే గతంలో కాస్త సానుభూతి చూపించేవాళ్లు కూడా ఇప్పుడు ఏవగించుకుంటున్నారు… ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి..? బహుశా పోలీసులకు కూడా ఆలోచన తట్టడం లేదేమో…!! అందరూ అలాంటోళ్లు కాదు, ఇది సామాజిక సమస్య వంటి నీతులొద్దు ప్లీజ్… జేబులో నుంచి వేలకువేలు ఇస్తున్నవాళ్లకు తెలుస్తుంది నొప్పి… హాళ్లలో సప్లయ్ చేసేవాళ్లు, బోళ్లు తోమేవాళ్లు, ఫ్లోర్ ఊడ్చేవాళ్లు, కుర్చీలు వేసేవాల్లు… వాళ్లకు చాయ్ పైసలు ఇవ్వడానికి చేతులు రావు, కానీ ఈ థర్డ్ జెండర్ డిమాండ్ చేయగానే…. తప్పడం లేదు..!!
Share this Article