Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మారువేషాల్లేవ్, పైగా మరణిస్తాడు… ఎంత ‘మగాడైనా’ సరే, ప్రేక్షకులకు నచ్చలేదు…

August 26, 2024 by M S R

హిందీలో సూపర్ హిట్టయిన సినిమా దీవార్ ఆధారంగా 1976 లో ఈ మగాడు సినిమా వచ్చింది . NTR అంతటి టాప్ హీరో నటించినా హిందీ సినిమాలాగా మన తెలుగు సినిమా పేలలేదు . బహుశా NTR పాత్ర విజయ్ చనిపోవటం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదేమో ! NTR కాబట్టి ముగింపు మార్చుకుని ఉండవలసింది .

NTR-యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో కాస్త నీరసంగా ఆడిన సినిమా ఇదేనేమో ! ఈ సినిమా గురించి చెప్పే ముందు హిందీ సినిమా కధను వ్రాసిన సలీం-జావేద్ ల గురించి కూడా చెప్పాలి . బాలీవుడ్ని ప్రేమ సినిమాల నుండి అండర్ వరల్డ్ , క్రైం సినిమాల ఒరవడి లోకి తీసుకుని వెళ్ళింది ఈ జంటే అని చెప్పవచ్చు .

1970s , 1980s లలో ఇలాంటి ఏంగ్రీ , పగ సాధింపు , అండర్ వరల్డ్ సినిమాలతో ప్రేక్షకులు మమైకం అయిపోయారు . దాని ప్రభావం మన తెలుగు సినిమాలపైన కూడా పడింది . ముఖ్యంగా NTR సెకండ్ ఇన్నింగులకు ఉపయోగపడ్డాయి . ఈ దీవార్ హిందీ సినిమా చాలా భాషల్లోకి రీమేక్ అయింది . సలీం-జావేద్ కాంబినేషన్ లాంటిదే మన పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్ కూడా .

Ads

ఇద్దరు అన్నదమ్ములు . అన్నకు సమాజం మీద , దేవుడి మీద కోపం , అసహనం . పెద్ద అండర్ వరల్డ్ కింగ్ అవుతాడు . పోలీసు ఆఫీసరయిన తమ్ముడి చేతిలో చనిపోతాడు . టూకీగా ఇదీ కధ . తల్లిదండ్రులుగా అంజలీదేవి , కాంతారావులు , తమ్ముడు పాత్రలో రామకృష్ణ , అతని ప్రియురాలిగా లత , ఆమె తండ్రిగా ధూళిపాళ , అండర్ వరల్డ్ బేడ్ బాయ్సుగా త్యాగరాజు , ప్రభాకరరెడ్డి , కె వి చలం , భీమరాజు , ఇతర పాత్రల్లో ముక్కామల , రాధాకుమారి , రావి కొండలరావు ప్రభృతులు నటించారు .

అంజలీదేవి నటించిన పాత్రను హిందీలో నిరూపరాయ్ నటించింది . రామకృష్ణ పాత్రను శశికపూర్ నటించారు . ప్రత్యేకంగా చెప్పవలసింది మంజుల పాత్ర . NTR ప్రియురాలిగా నటించింది . హిందీలో పర్వీన్ బాబీ నటించింది . ఈ సినిమాలో అభినందించవలసింది డి వి నరసరాజు డైలాగులను . బాగా పదునుగా ఉంటాయి .

ఈ సినిమాలో ఒక డైలాగ్ భలే పాపులర్ . మేరే పాస్ మా హై . నా వద్ద అమ్మ ఉంది . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం మంచి హిట్ సాంగులను ఇవ్వలేకపోయింది . కోరుకున్నాను నిన్నే కోరుకున్నాను అనే పాట ఒక్కటే పాపులర్ అయింది . జయమాలిని డాన్స్ పాట కూడా థియేటర్లో మాత్రమే బాగుంటుంది .

అండర్ వరల్డ్ సినిమా అయినా NTR కు మారు వేషాలు లేకపోవడం ఆశ్చర్యమే . బహుశా హిందీ సినిమాకు ఎలాంటి మార్పులు లేకుండా తీయవలసి వచ్చిందేమో ! లేకుంటే NTR పాత్రను బ్రతికించి ఉండేవారుగా ! సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని NTR అభిమానులు యూట్యూబులో చూడవచ్చు . చూడబులే . #తెలుగుసినిమాలు #తెలుగుసినిమాలసింహావలోకనం    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఎల్లమ్మ’గా భాగ్యశ్రీ..? ఊదు కాలదు- పీరు లేవదు..! పాపం వేణు..!!
  • ఆదిత్య ధర్… యామీ గౌతమ్… వెరీ పాపులర్ బాలీవుడ్ జంట ఇప్పుడు…
  • జగన్ క్యాంప్ ఎంత డిఫన్స్‌లో పడిందంటే… ఇదుగో ఈ యాడ్ పక్కా రుజువు…
  • ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?
  • సారీ గబ్బర్ సింగ్..! ఈ సనాతన సీక్వెల్‌లో ఏదో మిస్సయింది..!!
  • తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…
  • ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!
  • ఆ బూతు రోత పాటపై అందరూ లెంపలేసుకుంటున్నారు..! కానీ..?
  • ఎవరు ఈ లారీజానీ..? ఇరాన్ ‘మాస్టర్ మైండ్’నే లేపిన ఇజ్రాయిల్..!!
  • వైఎస్ విజయమ్మ ‘ఫరమ్’ అటాక్… ఆస్తుల పంచాయితీలో జగన్‌కు షాక్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions