.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 47 కోట్ల మంది మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేశారట… మొత్తం మేళా పూర్తయ్యేసరికి 55 కోట్లు దాటిపోతుందని అంచనా…
ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఉత్సవం… దీనివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే లెక్కల కోణంలో కాదు, ఎంత భారీగా ఏర్పాట్లు చేశారనే కోణంలో మాత్రమే చూడాలి దీన్ని… మునుపెన్నడూ లేని రీతిలో యోగి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా సరే, తొక్కిసలాట – ప్రాణనష్టం తప్పలేదు…
Ads
వందల కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్, అవస్థల వార్తలు వస్తూనే ఉన్నాయి… ఇంకా ఇంకా జనం పోటెత్తుతూనే ఉన్నారు… ఇక మరో పదమూడు రోజుల్లో ఉత్సవ సమాప్తి… మహా కుంభ మేళా మళ్లీ ఎన్నేళ్లకో… అందుకే దేశం నలుమూలల నుంచీ భక్తజనం తాకిడి కొనసాగుతూనే ఉంది… అయితే..?
కాస్త రద్దీ తక్కువగా ఉండి, తక్కువ అవస్థలతో మహాకుంభమేళా స్నానాలకు వెళ్లాలనుకునేవారికి ఈ వారం రోజుల ప్రయాణం బెటర్… ఎందుకంటే..?
ఈసారి స్నానాలకు విశిష్ట తిథులు పైన చూపిన టేబుల్… జనవరి 13 పౌష్య పౌర్ణమి, 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి… వీటిలో ఐదు తిథులూ అయిపోయాయి… ఇక మిగిలింది మహాశివరాత్రి…
అదే రోజు ఉత్సవం పరిసమాప్తి… సో, ఆరోజు కూడా జనం తాకిడి విపరీతంగా ఉంటుంది… ఎటొచ్చీ ఈ వారం పది రోజులే భక్తుల తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది… రకరకాల అఖాడాలు ఇక సర్దుకుంటున్నాయి… కాకపోతే ఇప్పటికీ ట్రెయిన్ టికెట్లు లేవు, ఫ్లయిట్ టికెట్ల రేట్లు మరీ అడ్డగోలుగా పెంచేశారు… సొంత వాహనాల్లో వెళ్లేవారికి ట్రాఫిక్ జామ్ అవస్థలు… ఎటువైపు నుంచి అక్కడికి చేరుకోవాలని అనుకున్నా నలుదిక్కులా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతోంది… పిల్లలు, ముసలివాళ్లతో వెళ్లేవాళ్లకు మరీ అవస్థలు ఎక్కువ…
ఐనాసరే, ఎలాగోలా వెళ్లాలీ అనుకునేవారికి ఢిల్లీ వరకూ ఫ్లయిట్లలో వెళ్లి, అక్కడి నుంచి ప్రయాగరాజ్ వరకు వందేభారత్ రైళ్లలో వెళ్లడం ఓ బెటర్ ఆప్షన్… కానీ ఢిల్లీ వరకు ఫ్లయిట్ చార్జీలు కూడా పెంచేశారు… ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ వరకు వందేభారత్ 6 గంటల ప్రయాణం… జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, రద్దీ తక్కువ ఉండే ప్రాంతాల్నే ఎంపిక చేసుకుంటే బెటర్…
ఎలాగూ 15, 16 తేదీల్లో ఎలాగూ శని, ఆదివారాల రద్దీ ఉంటుంది… ఇక 17 నుంచి 24 వరకు కాస్త బెటర్… మళ్లీ చివరి రెండు రోజులు మహాశివరాత్రి జనం పోటెత్తుతారు… ఇదీ పరిస్థితి…!!
Share this Article