Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అది ఈనాడు కదా… అలాగే రాస్తుంది… కుంభమేళా విషాదంపై కూడా..!!

January 29, 2025 by M S R

.

కుంభమేళాకు కోట్లతో పోటెత్తే జనాన్ని నియంత్రించడానికి ఎన్ని ఏర్పాట్లయినా సరపోవు… ప్రత్యేకించి మౌని అమావాస్య వచ్చిందంటే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి వణుకు…

ప్రస్తుత తొక్కిసలాట తీవ్ర విషాదమే… మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఖచ్చితంగా తెలియడం లేదు గానీ… పాథటిక్ సిట్యుయేషనే… ఐతే గత ప్రభుత్వాలకన్నా ఈసారి జాగ్రత్త చర్యలు చాలా ఎక్కువని అక్కడికి వెళ్లొచ్చిన భక్తులు చెబుతున్నారు…

Ads

ఏకంగా ఓ టెంట్ సిటీనే నిర్మించింది యోగి ప్రభుత్వం… స్వతహాగా తను సన్యాసి… అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, భారీగా పోలీస్ బలగాలు, చికిత్స కేంద్రాలు గట్రా బాగానే చేసినా మళ్లీ తొక్కిసలాట తప్పలేదు… గతంలోనూ ఉన్నాయి సంఘటనలు…

(ఈనాడు పాత్రికేయ దరిద్రం మరోసారి చెప్పాలి… దాని సైటులో రాసిన ఓ వార్త లింక్ దిగువన ఉంది చదవండి… అందులో అన్నీ చెప్పారు గానీ నిర్లక్ష్యానికి, ప్రచార యావకు పేరొందిన శ్రీమాన్ చంద్రబాబు బాధ్యత వహించాల్సిన పుష్కర మృతుల సంఘటన రాయలేదు… మొన్నటి తిరుపతి తొక్కిసలాట కూడా రాయలేదు… కనీసం వార్తల్ని వార్తల్లాగా రాయండి నాయనా…)

https://www.eenadu.net/telugu-news/india/a-look-at-major-stampedes-in-india-over-the-years/0700/12501780

.

ఇది పీటీఐ కాపీ… ఈనాడు తీసుకున్నది ఈవార్తే… కానీ పుష్కర తొక్కిసలాటను ఎత్తిపారేసింది…

1954… మహా కుంభమేళా కాదు గానీ, కుంభమేళా… స్వతంత్రం వచ్చాక తొలి కుంభమేళా… తొక్కిసలాటలో 800 మంది మరణించారు… 2000 మంది గాయపడ్డారు… తీవ్ర విషాద సంఘటన… ఒక ఏనుగు అదుపు తప్పి జనం మీద వీరంగం వేయడంతో తొక్కిసలాట జరిగి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది…

kumbha mela

1986లో అప్పటి సీఎం ఇతర రాష్ట్రాల సీఎంలను, కేంద్ర మంత్రులను గట్రా పట్టుకొచ్చాడు… దరిద్రమైన బందోబస్తు… అప్పుడూ తొక్కిసలాటే, 200 మంది మరణించారు… (అసలు సంఖ్య ఎక్కువేనంటారు…)

2003లో నాసిక్‌ గోదావరి స్నానాల్లో 39 మంది, 2013లో అలహాబాద్ ఒక ఫుట్ బ్రిడ్జి కూలిపోయి 42 మంది మరణించారు… ఈ స్నానాలు గాకుండా గత ఏడాది హథరాస్‌ ఒక ఆశ్రమంలో తొక్కిసలాటలో 121 మంది మరణించారు…

ఇది మరీ ఘోరం, స్వామీ పాదాల కింద మట్టిని సేకరించడానికి భక్తులు పోటీపడటంతో ఈ దుర్ఘటన… 2013 మధ్యప్రదేశ్, రత్నఘడ్ మందిరంలో తొక్కిసలాటలో 115 మంది… అదీ కొన్ని వదంతుల వల్ల..! 2008 రాజస్థాన్ చాముండేశ్వరీదేవి ఆలయంలో 224 మంది… అది బాంబు పేలుడు రూమర్ల వల్ల…!

అదే ఏడాది కొండచరియలు విరిగిపడుతున్నాయనే వదంతులతో హిమాచల్ ప్రదేశ్, నయనాదేవి మందిరంలో 145 మంది… 2005 మహారాష్ట్ర మంధరాదేవి ఆలయంలో 265 మంది మరణించారు… ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళాలో… ఖచ్చితంగా మరణాల సంఖ్య తెలియదు… కానీ దేశం యావత్తూ షాక్‌కు గురైన దుర్ఘటన..!!

(ఐతే దొరికింది కదా చాన్స్ అనుకుని యాంటీ- హిందూ సెక్షన్ సోషల్ పోస్టులతో శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతోంది… అదొక విషాదం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions