.
ఈరోజు వార్త ఏమిటంటే..? తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం… రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్…
తమకు వేతనాలు (30%) పెంచి ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పిన ఫెడరేషన్ నాయకులు… పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే పే చేయాలని డిమాండ్…
Ads
సూపర్… ఒక్కొక్కడు వందా రెండొందల కోట్లు తీసుకుంటున్నారు… నటన అంటే తెలియని సోకాల్డ్ వెధవ హీరోలు… వారస హీరోలు… హీరోయిన్లు, దర్శకులు, సంగీత దర్శకులు ఎట్సెట్రా…
మరి వాళ్లు ఏం చేయాలన్నా ప్రాణంగా భావించే దిగువ స్థాయి ఆర్టిస్టులు, 24 క్రాఫ్ట్స్‌లో ఉన్నవాళ్లకు మాత్రం నాలుగు రూపాయలు పెంచండర్రా అంటే చస్తారు… ఒరేయ్, ఏమాత్రం ఆర్థిక భద్రత లేని వాళ్లకేరా ఇండస్ట్రీ భరోసాగా ఉండాల్సింది… దరిద్రపు హీరోల పారితోషికాల్లో జస్ట్, 10 పర్సెంట్ కట్ చేయండ్రా, వీళ్ల 30 శాతం వేతనాలు కాదు, 60 శాతం ఇవ్వొచ్చు…
ఎందరో ఫిష్ వెంకట్ వంటి వాళ్ళను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి…
హీరోల కాళ్ల మీద పడి పాకుతూ, దేకుతూ, నాకుతూ సినిమాలు తీసే నిర్మాతలందరికీ చెప్పేది అదే… సరే, ఈ వార్త చదువుతుంటే మహావతార్ నరసింహ గుర్తొచ్చింది… ఒక్క వెధవ హీరో లేడు, బోల్డ్ హీరోయిన్ లేదు, తోడుగా వెకిలి వెగటు వేషాల ఇతర తారల్లేరు, ఐటమ్ సాంగ్స్ లేవు…
అసలు ఏ ఆర్టిస్టూ లేడు… ఆహా… హొంబలె ఫిలిమ్స్… ఎవడి దగ్గరా వంగిపోకుండా, ఎవడి కాళ్లూ మొక్కకుండా…. మబ్బుల్లో విహరించే చెత్తా హీరోల జోలికి పోకుండా… ఏం సినిమా తీశార్రా బాబూ… హిందీ బెల్ట్ అదిరిపోతోంది… జస్ట్, 15 కోట్లతో సినిమా తీస్తే ఇప్పటికే 83 కోట్లు… కోటితో మొదలై, డ్రాప్ గాకుండా, వీకెండ్ 19 కోట్లు అట… వావ్…
కేజీఎఫ్, కాంతారా… హొంబలె వాడు ఏది పట్టుకున్నా బంగారమే… శుక్ర మహర్దశ… అయితే ఇక్కడ ఓ చిన్న డౌటనుమానం… అది 15 కోట్ల బడ్జెట్… దర్శకుడు, సంగీత దర్శకుడు, వాయిస్ ఓవర్ ఖర్చు, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు గరిష్టంగా 5 కోట్లు… అంటే యానిమేటెడ్ గ్రాఫిక్స్ కోసం గరిష్టంగా వాళ్లు ఖర్చు చేసింది 10 కోట్లు…
ఎక్కడా గ్రాఫిక్స్ నాసిరకం అనిపించలేదు, పైగా ప్రతి సీన్‌ను బ్రహ్మాండంగా ఎలివేట్ చేశాయి… మరి కొందరు బడా నిర్మాతలు గ్రాఫిక్స్ కోసం 100, 200, 300, 500 కోట్లు ఖర్చు పెట్టాం అంటారేమిటి..? నిజంగా అంత సీన్ ఉందా..?
ఎవడికి పెడుతున్నారు పూలు..? ఐటీ వాళ్లకా..? ప్రేక్షకులకా..? పైగా చెత్తా డ్యాష్ డ్యాష్ టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంపు, అదేమంటే… నిర్మాణ వ్యయం అట… ఎవడు పెట్టమన్నాడురా మిమ్మల్ని, ఇండస్ట్రీలో పనిచేసే దిగువ స్థాయి వర్కర్ల పొట్టలు కొట్టి…!!
సినిమా నిర్మాణం అంటేనే బోలెడన్ని ఐటీ బాగోతాలు, కొన్ని మనీ లాండరింగులు… మన ఐటీ, మన ఈడీలకు చేతగాక… నడుస్తోంది అలాంటి నిర్మాతల ఆట… ఏదో ఉంది తిరకాసు… అదీ బయటపడాలి… ఇప్పుడు చెప్పండి సినిమా వర్కర్లకు 30 శాతం పెంచడానికి ఎందుకురా మీ వెనుకంజ… వాళ్ల పొట్ట కొట్టడం కాదురా, కాస్త ఆ పెద్ద దరిద్రుల తోకలు కత్తిరించండి… 5, 10 కోట్లు ఇస్తే అద్భుతాలు క్రియేట్ చేసే వాళ్ళున్నారు… కాస్త ఎదగనివ్వండిరా …
పోనీ, అంతలేసి భారీ ఖర్చులతో, ఆ హీరోల భారీ రెమ్యునరేషన్లతో సినిమా తీస్తే ఏముంది..? 90 శాతం ఫ్లాపులే.., బయ్యర్ల నెత్తిన ఎర్రతువ్వాల… ఇక్కడే మరో అంశం… ఇదే హొంబలె ఫిలిమ్స్ బేసిక్‌గా కన్నడ కదా… అక్కడ ఫ్లాప్… నిజం…
మొత్తం 83 కోట్ల వసూళ్లలో కన్నడ వెర్షన్ వసూళ్లు జస్ట్ 1.63 కోట్లు మాత్రమే… సరే, తమిళం, మలయాళం ఎలాగూ కన్నడ సినిమాలను సహించరు, తమిళం 71 లక్షలు, మలయాళం మరీ 19 లక్షలు… కుమ్మేస్తున్నది హిందీ బెల్టులో… 49.45 కోట్లు హిందీలోనే… తరువాత తెలుగులో 15.87 కోట్లు… వావ్… జై తెలుగు ఆడియెన్స్..!!
Share this Article