Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…

September 11, 2026 by M S R

.

అప్పట్లో మహేశ్ బాబు నటించిన మురారి సినిమా సూపర్ హిట్ కొట్టిందంటే కారణం, ఆ కథలో హీరోకు ఏదో జాతకదోషం, అమ్మవారికి ప్రత్యేక పూజలతో విరుగుడు ప్రయత్నాలు ఎట్సెట్రా డివోషనల్ కంటెంట్ కాదు… సినిమాకు ఆ కంటెంట్ అస్సలు ప్లస్ కాదు… కానీ హిట్‌కు కారణం..?

మహేశ్, బింద్రేల సరసాలు, బావామరదళ్ల అల్లరి, కుటుంబసభ్యుల నడుమ పిలుపులు, ప్రేమలు, గ్రామీణ వాతావరణం… ప్రధానంగా దర్శకుడి ప్రజెంటేషన్‌కుతోడు పాటలు ఆ సినిమా విజయానికి తోడ్పడ్డాయి… సేమ్, మురారిలోలాగే ఓ అమ్మవారు, ఆమె శాపం, తరతరాలుగా ఓ కుటుంబంలోని వారసుడికి ప్రాణగండం ఎట్సెట్రా కథాంశాన్ని తీసుకున్నారు…

Ads

అవును, మహేంద్రగిరి వారాహి అనే సినిమా కథ అదే… అమ్మవారు, జాతకదోషాలు, శాపాలు, ప్రాణగండాలు అనే బేసిక్ లైన్ మినహా మురారిలోని ఫన్, పాజిటివ్ వైబ్స్, మ్యూజిక్ మ్యాజిక్ ఎట్సెట్రా ఏమీ లేవు ఇందులో… బహుశా ఇది కూడా వారాహి అమ్మవారి శాపమేమో!!

అంతటి అక్కినేనికి వారసుడైనా, ఆ లెగసీ సుమంత్‌ను స్టార్ హీరోను కాదు కదా, ఓమోస్తరు సక్సెస్‌ఫుల్ హీరోను కూడా చేయలేకపోయింది… అదీ 26 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో… ఇప్పుడు 51 ఏళ్లు అంటే, తెలుగు ఇండస్ట్రీ హీరోయిజం లెక్కల్లో పెద్ద వయస్సేమీ కాదు, జెన్‌జీయే… కానీ సుమంత్ ఇప్పుడు రెగ్యులర్ ఆర్టిస్టు కాదు, ప్రజెంట్ జనరేషన్‌కు కనెక్ట్ కాలేడు… ఏదో అమ్మవారి శాపమేమో…

సరే, ఏదో మళ్లీ హీరోగా ట్రై చేశాడు, పైగా సినిమాలో చిన్నాచితకా పాత్రలే అయినా సిద్ధు, ఐశ్వర్య రాజేష్, బ్రహ్మానందం, ఆలీ, మాళవిక మోహనన్, మంజుభార్గవి తదితరులు చాలామంది కనిపిస్తారు… ఎందుకు కనిపిస్తారో, ఆ పాత్రల ప్రాధాన్యం ఏమిటో దర్శకుడికే సరిగ్గా క్లారిటీ లేదు… ఏదో అమ్మవారి శాపమేమో…

200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం… కుటుంబంలో జన్మించిన ప్రతి మగవారసుడు 33 ఏళ్లు రాగానే ఏదోరకంగా మరణిస్తాడు… అది తరాలుగా అమలవుతూనే ఉంది… ఆ శాపానికి కారణం ఏదో అత్యాచారం… మరి హీరో..? ఓ యూట్యూబర్… మూఢ నమ్మకాల్ని, బాబాల్ని, మోసాల్ని బయటపెడుతూ ఉంటాడు… (ప్చ్, నిజజీవితంలో యూట్యూబర్ల గురించి దర్శకుడికి అంత పెద్ద అవగాహన లేదో, ఎప్పుడూ బాధితుడు కాలేదో తెలియదు…)

అదేదో సినిమాలో నాగార్జునను మెంటలిస్టుగా చూపారు కదా, అలా చూపినా బాగుండేదేమో… అమ్మవారి శాపం ఫలించేరోజు హీరో గారి అన్నగారు కూడా ఓ దున్నపోతు పొడిచి మరణం పాలవుతారు… ఈ యూట్యూబర్ హీరోకు డౌటొచ్చి దర్యాప్తుకు పూనుకుంటాడు… అన్నీ తవ్వుతుంటాడు… చివరకు ఏం కనుగొన్నాడనేది కథ… పాపం, చివరలో ఒకటీరెండు ట్విస్టులు పెట్టాడు దర్శకుడు, కానీ అవే మైనస్… అమ్మవారి శాపమేమో…

ఎక్కడా సినిమాలో ఒక హౌ మూమెంట్ లేకుండా ఇంత జాగ్రత్తగా ఎలా తీయగలిగాడో… నిజానికి ఈ పాత్రకు సుమంత్ సూట్  కాలేదు… దానికితోడు గెస్ట్ అప్పియరెన్సుల తాలూకు వాల్యూ యాడిషన్ కూడా ఏమీ వర్కవుట్ కాలేదు… ఫస్టాఫ్ బోర్… సెకండాఫ్ హీరో దర్యాప్తుతో కథ కాస్త వేగం పుంజుకుని, చివరకు క్లైమాక్స్ వేళకు మళ్లీ చతికిల పడింది… అమ్మవారి శాపమేమో…

సినిమాల్లో ఎఐని గానీ గ్రాఫిక్స్‌ను గానీ ఎంతమేరకు అవసరమో అంతే వాడాలి… కానీ ఇందులో ఎడాపెడా వాడేశారు… దాంతో ఒరిజినాలిటీ మిస్సే కదా… దేవుళ్లు, దేవతలు, నమ్మకాలు ప్రజెంట్ సినిమా ట్రెండే, డౌట్ లేదు, కానీ అది ఇంపాక్ట్‌ఫుల్‌గా తెరపై ప్రదర్శితమయితేనే హిట్టు… లేకపోతే నప్పదు, ప్రేక్షకులకు నచ్చదు… అమ్మవారి శాపమేమో…

అనూప్ రూబెన్స్‌కు కూడా ఔట్‌పుట్ చూశాక నిరాశ కలిగినట్టుంది… బీజీఎం పేలవం… దర్శకుడి పేరు చెప్పనేలేదు కదూ సంతోష్ జాగర్లపూడి… చివరగా… మురారి సినిమాలో మహేశ్ బామ్మ పడే వేదన, చేసే పూజలు మనల్ని సినిమా కథతో ట్రావెల్ చేయిస్తాయి, మహేంద్రగిరి వారాహి కథలో అలాంటి ఫీల్ ఒక్కచోట కూడా లేదు… బహుశా అమ్మవారి శాపమేమో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…
  • ఫాఫం కేసీయార్ ! ప్లాన్ ఎదురుతన్ని తెలంగాణ సమాజంలో అభాసుపాలు !!
  • సో, పిక్చర్ వెరీ క్లియర్… కన్నవాళ్లూ కసాయిలే ! 
  • నాయకులే కాదు – మీడియా కంపెనీలూ కండువాలు మార్చుకుంటయ్ !!
  • EPIC – బోల్డ్‌గా ఏదో చెప్పాలనుకుని- బోల్తాకొట్టిన కథాకథనాలు !!
  • వారమైనా కాలేదు – బిగ్‌బాస్ తిక్క ప్లానింగు – ఓ గట్టి కంటెస్టెంట్ ఔట్ !!
  • సినిమా బ్లాక్‌బస్టర్ ! హఠాత్తుగా కరోలీ బాబా ఇంటిపై పంచాయితీ !!
  • సర్దార్-2 … మిషన్ పెద్దదే… కానీ ఇంజన్‌లో దమ్ములేదు – ఇది కార్తి టాక్సిక్ !!
  • ‘‘పిరికి న్యాయమూర్తి అనిపించుకోవడంకంటే చావడానికే ఇష్టపడతాను’’
  • ప్రతి కథా ఇరుముడి కాలేదు – మారెమ్మలా తుస్సుమనొచ్చు కూడా!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions