Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…

January 7, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ……. కొడుకు దిద్దిన కాపురం కాదు కొడుకులు దిద్దిన కాపురం . మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసిన సినిమా . ఒకనాటి హరనాథ్ , జమున నటించిన లేత మనసులు సినిమా టైపు . కాకపోతే అది ఆడ కవల పిల్లలు కాబట్టి ఫైటింగులు గట్రా లేకుండా విడిపోయిన తమ తల్లిదండ్రులను కలిపారు ఇద్దరు కుమార్తెలు . ఈ సినిమాలో కవలలు మగ పిల్లలు కావటం వలన ఫైటింగులు , టీజింగులు  గట్రా ఉన్నాయి .

ఈ సినిమా అంతా మహేష్ బాబుల మీదే నడుస్తుంది . కధ ఏంటంటే : హీరో కృష్ణ పేదవాడు , హీరోయిన్ విజయశాంతి కోటీశ్వరుడి కుమార్తె . కృష్ణ తోటి పెళ్లి అని చెప్పి మోహన్ బాబుతో పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు తండ్రి గుమ్మడి . ఆఖరి క్షణంలో వచ్చి విజయశాంతిని తీసుకుని వెళ్ళి పెళ్ళి చేసుకుంటాడు హీరో కృష్ణ .

Ads

చేయని హత్య కేసులో హీరోని ఇరికిస్తారు . విజయశాంతి కృష్ణే హత్య చేసాడని నమ్ముతుంది . కింద కోర్టులో పడిన శిక్షను హైకోర్టు కొట్టేసీ విడుదల అవుతాడు హీరో .‌ విజయశాంతి కవలలను ప్రసవిస్తుంది . భార్యాభర్తలకు తెలియకుండానే ఇద్దరు కవలలు చెరొకరి దగ్గర పెరుగుతారు .

ఇద్దరు కవలలు కలుసుకుని తల్లిదండ్రులను కలపటానికి చేసే ప్రయత్నమే మిగిలిన సినిమా అంతా . ఈ ప్రయత్నంలో తండ్రి , తండ్రి స్నేహితులు గిరిబాబు , అశ్విని కవలలకు తోడ్పడతారు . క్లైమాక్సులో అందరూ కలిసి అసలు నేరస్తుడయిన మోహన్ బాబుని , హత్య చేసిన త్యాగరాజును , తదితర విలన్లను పోలీసులు అరెస్టు చేయటంతో సీనిమా సుఖాంతం అవుతుంది .

రాజ్య- కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హుషారుగా ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , మనో , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . థియేటర్లో బాగుంటాయి . కొరియోగ్రాఫర్ శ్రీను డాన్సుల్ని కూడా బాగా కంపోజ్ చేసారు .‌ కృష్ణ , విజయశాంతి మీద రెండు డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి.

ssmb

జూం చక్కా ఎంచక్కా , బహూపరాక్ ఓ మహారాణీ అంటూ సాగుతాయి ఈ రెండు డ్యూయెట్లు . మహేష్ బాబు ఎంట్రీ సాంగ్ ఓం నమ నటరాజుకే నమ గ్రూప్ డాన్స్ బాగుంటుంది . మహేష్ బాబు చిన్నవాడిగా ఉన్నప్పుడే డాన్సులు బాగా వేసాడు . అలాగే మోహన్ బాబుని ఇద్దరూ కలిసి టీజ్ చేసే హే మామా హే మామా పాట కూడా హుషారుగా ఉంటుంది .

మరో పాట శివ శివ మూర్తివి గణనాధా నువు శివునీ కుమారుడవు గణనాధా కూడా బాగుంటుంది . కృష్ణ తాగినట్లు నటించి పాడే పాట ఆలూ లేదు చూలూ లేదు అల్లుడేమో సోమలింగం కూడా హుషారుగా ఉంటుంది . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు .

త్యాగరాజన్ క్లైమాక్సులో ఫైట్లను కొత్త రకంగా కంపోజ్ చేసారు . విజయశాంతికి , మహేష్ బాబుకి అనార్కలికి కట్టినట్లు సజీవ సమాధి కడతారు . కృష్ణ , విజయశాంతి , గుమ్మడి , గిరిబాబు , మోహన్ బాబు , అశ్విని , కుయిలీ , త్యాగరాజు , సాక్షి రంగారావు , సారధి , ప్రభాకరరెడ్డి , తదితరులు నటించారు . విశేషం ఏమిటంటే జయమాలిని ఉన్నది కానీ ఆమెకు పాట కానీ డాన్స్ కానీ లేదు .

భీశెట్టి లక్ష్మణరావు నేసిన కధకు పరుచూరి బ్రదర్స్ డైలాగులను వ్రాసారు . పద్మాలయా బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , నిర్మాత , దర్శకుడు అన్నీ కృష్ణే . కాపురాల మీద కృష్ణ ఎనిమిది సినిమాల్లో నటించారు . వాటిల్లో ఒకటయిన ఈ కొడుకు దిద్దిన కాపురం కమర్షియల్ గా సక్సెస్ అయింది .

మహేష్ బాబుకు మంచి పేరు వచ్చింది . బాగా నటించాడు . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . It’s a commercial , feel good , entertainer .

నేను పరిచయం చేస్తున్న 1215 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
  • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…
  • … ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!
  • తల్లి చెప్పింది… ‘సింహంలా పోరాడు… అంతేగానీ పిరికివాడివై తిరిగిరాకు’
  • రోగ్ ప్లానెట్ కాదు… దుష్ట గ్రహమూ కాదు… అదొక ఒంటరి జర్నీ… అంతే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions