Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ రహీమ్ సాబ్ మన హైదరాబాదీయే… బాలీవుడ్ బయోపిక్‌కు రియల్ హీరో…

April 8, 2024 by M S R

(రమణ కొంటికర్ల) ……… 1964లో రహీమ్ సాబ్ ఏ చిట్కాలైతే చెప్పాడో… ఇప్పుడు ఫుట్ బాల్ కు కేరాఫ్ లా మారిన బ్రెజిల్ లో అవే నేర్పిస్తున్నారు. ఈ మాటన్నది.. 1964లో ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ గా పనిచేసిన ఆల్బర్ట్ ఫెర్నాండో. అందుకే రహీమ్ సాబ్ ను ఫుట్ బాల్ ప్రవక్తగా కొల్చేవారట. ఇప్పుడెందుకీ రహీమ్ సాబ్ ముచ్చట అంటే.. ఈ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతున్న అజయ్ దేవగణ్ మైదాన్ స్టోరీ.. రహీమ్ సాబ్ ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన బయోపిక్. పైగా ఆ రహీమ్ సాబ్ మన హైదరాబాదీనే. ఏంటీ అంతలా బాలీవుడ్ నే కదిలించిన మన సయ్యద్ అబ్జుల్ రహీమ్ కథ..?

1909, ఆగస్ట్ 17-1963, జూన్ 11

రహీమ్ సాబ్ కు పర్యాయపదం.. మాడర్న్ ఇండియన్ ఫుట్ బాల్ ఆర్కిటెక్ట్. గ్రేట్ మోటివేటెడ్ టీచర్ గా మన్ననలందుకున్న రహీమ్ సాబ్.. డిసిప్లెయిన్ కు బట్టలేస్తే ఎలా ఉంటుందో.. అలాంటి ప్రిన్స్ పుల్స్ కల్గిన వ్యక్తి. మొత్తంగా భారతదేశ ఫుట్ బాల్ చరిత్రకు… సయ్యద్ అబ్దుల్ రహీమ్ జమానా ఓ గోల్డెన్ ఎరా.

Ads

రహీమ్ కోచ్ గా ఉన్నప్పుడు.. సాంకేతికంగా, వ్యూహాత్మకంగా ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కనబర్చిన ప్రదర్శనతో.. భారత్ ను నాడు ఫుట్ బాల్ కు కేరాఫైన బ్రెజిల్ తో పోలుస్తూ.. బ్రెజిల్ ఆఫ్ ఆసియాగా పిల్చేవారు. రహీమ్ పీరియడ్ లో.. 1951లో ఢిల్లీలోనూ, 1962లో ఇండోనేషియా జకార్తాలోనూ జరిగిన ఆసియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించింది ఇండియా. 1956లో మెల్ బోర్న్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో సెమీఫైనల్స్ వరకూ చేరిన మొట్టమొదటి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించి.. ఇప్పటికీ ఆ రికార్డ్ ను పదిలపర్చుకుందంటే.. దాని వెనుకున్నది మన హైదరాబాదీ. ఫుట్ బాల్ అంటే కేవలం బ్రెజిలే కాదు… మేమూ ఉన్నామని భారతదేశ సత్తాను చాటిన కోచ్ రహీమ్ సాబ్. ఆ తర్వాత నాల్గుసార్లు కొలంబో కప్పులను ఇంకే టీమ్ గెల్చుకోకుండా విజయానికి అడ్డుపడి.. కప్పును లాక్కుని ఇండియాకు పట్టుకొచ్చిన ఘనత సయ్యద్ అబ్దుల్ రహీమ్ ది.

అయితే, ప్రపంచం మొత్తంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడి ఆసక్తిగా చూసే ఫుట్ బాల్ వంటి క్రీడలో.. భారత్ పేరును రెపరెపలాడించిన రహీమ్.. మన హైదరాబాదీ కావడం గర్వించాల్సిన విషయం. మొదట కాచిగూడ మిడిల్ స్కూల్ తో పాటు, ఉర్దూ షరీఫ్ స్కూల్ లోనూ, చాదర్ ఘాట్ హైస్కూల్ లోనూ ఓ టీచర్ పనిచేసిన రహీమ్ కు ఫుట్ బాల్ ఆటపై మక్కువ ఎక్కువే. ఆ క్రమంలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లమా కూడా సంపాదించిన రహీమ్.. ఫుట్ బాల్ ప్రాక్టీస్ నే ఎక్కువ ఇష్టపడేవాడు. తన ప్రాక్టీస్ తో.. ఉస్మానియా యూనివర్సిటీ టీమ్ కు సెలక్టైన రహీమ్… ఎలెవన్ హంటర్స్ అనే టీమ్ కూ ప్రాతినిథ్యం వహించాడు. ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ స్థాయికి ఎదిగిన రహీమ్.. ఆ తర్వాత స్థానికంగా బెస్ట్ టీమ్ గా పేరున్న ఖమార్ క్లబ్ కు ప్రాతినిథ్యం వహించాడు. అలా డచ్ అమెచ్యూర్ లీగ్, HSV hoek అనే మరో నెదర్లాండ్ టీమ్ కూ ఫుట్ బాల్ ప్లేయర్ గా సెలక్టయ్యాడు.

హైదరాబాద్ ఫుట్ బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు, పయనీర్ ఆఫ్ స్పోర్ట్స్ గా పిల్చుకునే సయ్యద్ మహమ్మద్ హమీతో జత కట్టాక.. హెచ్ఎఫ్ఏకు రహీమ్ సాబ్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హైదరాబాద్ ఫుట్ బాల్ అసోసియేషన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ గా రూపాంతంరం చెందింది. దానికి కూడా ఫస్ట్ సెక్రటరీగా రహీమే పనిచేసారు. 1950లో ఫుట్ బాల్ లో హైదరాబాద్ ను నిలబెట్టేందుకు రహీమ్ సిగ్నిఫికెంట్ రోల్ పోషించారు. క్రీడల పట్ల ఎందరో ఔత్సాహికులను ప్రోత్సహించి.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఫుట్ బాల్ ప్లేయర్స్ గా తీర్చిదిద్దాడు.

1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్ లో ఫుట్ బాల్ కోచ్ గా జాయినైన రహీమ్.. 1963లో తాను మరణించే వరకూ అక్కడ సేవలందించాడు. ఐదు రోవర్ కప్స్ ను హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్ ఫుట్ బాల్ లో సాధించడం వెనుక రహీమే కీలకం. నాటి హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్ లో బెస్ట్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన మహమ్మద్ నూర్ ఏమంటాడంటే.. చాలా సంవత్సరాలు రహీమ్ సాబ్ కోచింగ్ లో ఫుట్ బాల్ ఆడాం. సెషన్ ముగిసిన ప్రతీసారి కప్ ఆఫ్ టీ తాగి.. ఆయనిచ్చే ఎంకరేజ్ మెంట్ తో మళ్లీ… ది బెస్ట్ గా, ఎక్సలెంట్ టీమ్ గా తయారుకావడానికి ప్రాక్టీస్ సెషన్స్ నిరంతరాయంగా నడుస్తూనే ఉండేవని. ఆ తర్వాత హైజరాబాద్ ఫుట్ బాల్ టీమ్ మేనేజర్ గా కూడా పనిచేసిన రహీమ్.. వరుసగా 1955, 57 సంవత్సరాల్లో ముంబైపై రెండు సంతోష్ ట్రోఫీలను సాధించగా.. 1958లో మద్రాస్ లో హ్యాట్రిక్ మాత్రం క్వార్టర్ ఫైనల్ ఓటమితో మిస్సైంది. ఆ సంతోష్ ట్రోఫీ మ్యాచుల్లో హైదరాబాద్ ఫుట్ బాల్ టీమ్ తరపున ఆడిన ప్లేయర్స్ లో అధికశాతం.. తాను కోచింగ్ లో నిష్ణాతులైన హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్ ఆటగాళ్లే కావడం విశేషం.

1950లోన్ ఇండియన్ నేషనల్ ఫుట్ బాల్ టీమ్ మేనేజర్ గా ఎంపికైన రహీమ్.. ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ ను తన పీరియడ్ లో గోల్డెన్ ఎరాగా మార్చేశాడు. 1951లో ఢిల్లీలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో ఇరాన్ పై విజయంతో.. ఇండియన్ జట్టును విన్నర్ గా నిల్పి గోల్డ్ మెడల్ వచ్చేలా తర్ఫీదునిచ్చాడు. 1956 ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్ ఉత్కంఠ రేపగా.. నాటి ఫుట్ బాల్ ప్లేయర్ బలరామ్ చేసిన గోల్ ఇండియాను మొదట ఆధిక్యంలో నిలిపింది. కానీ, రామ్ బహదూర్ తాపా అనే మరో ఆటగాడి చిన్న పొరపాటు వల్ల.. చారిత్రత్మక వరల్డ్ కప్ నుంచి భారత్ దూరమైంది.

ఇప్పటికీ ఇండియా ఫుట్ బాల్ కోచ్ అంటే.. రహీమ్ పేరే వినిపిస్తుంది కాబట్టే… ఇప్పుడు మన భాగ్యనగర్ వాసి సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్.. అజయ్ దేవగణ్ మైదాన్ రూపంలో తెరకెక్కుతోంది. 1962 ఏసియన్ గేమ్స్ రహీమ్ జీవితంలో ఆఖరి కప్. ఆ సమయంలో ఆటగాళ్లతో రహీమ్ ఏమన్నారంటే.. कल आप लोगों से मुझे एक तोहफा चाहिए… कल आप सोना जीतलो.. I WANT A GIFT FROM YO TOMORROW.. THE GOLD MEDAL.. రేపటి మ్యాచ్ లో నాకు మీరో బహుమతివ్వాలి.. అది గోల్డ్ మెడల్ కావాలి. అయితే, కోచ్ మాటకు కట్టుబడి… ఎక్కడా బిగి సడలకుండా ఆడిన ఇండియన్ ఫుట్ బాల్ టీమ్.. రహీమ్ కు కోచ్ గా చివరి మ్యాచ్ లో ఆయన కోరుకున్నట్టే గోల్డ్ మెడల్ తో ట్రీట్ ఇచ్చి తన జీవితకాల సాఫల్యానికి కారకులయ్యారు.

రహీమ్ గురించి.. భారత మాజీ అంతర్జాతీయ ఆటగాడు మహ్మద్ జుల్ఫీకరుద్దీన్ మాటల్లో చెప్పాలంటే… రహీమ్ పనిలో ఓ మాస్టర్. అతను భారత ఫుట్‌బాల్ జట్టును బలీయమైన బృందంగా తీర్చిదిద్దాడు. వారిని పటిష్టమైన క్రీడాకారులుగా మార్చిన అసాధారణ సామర్థ్యం రహీమ్ సొంతం. కానీ, రహీమ్ కఠినమైన క్రమశిక్షణాపరుడు.. అందుకే ఆయన ఆ హైట్స్ సాధించాడంటారు జుల్ఫీకరుద్దీన్.

మరి ఇలాంటి మనం గర్వించి చేయాల్సిన కథలను, బయోపిక్స్ ను.. ఇతర ఇండస్ట్రీస్ వారు వచ్చి చేస్తుంటే… మనం మాత్రం ఎక్కడో ఆడుజీవితం అంటూ పాడుకుంటూ కేరళవైపు చూడటమో.. లేక, ఇంకా ఏదో ఇండస్ట్రీలో వచ్చిన ఓ గొప్ప సినిమా గురించి మాట్లాడుకోవడమో చేస్తున్నాం. ఒక్క రహీమే కాదు.. ఇలాంటివారు వివిధ రంగాల్లో మనదగ్గరే బోలెడుమంది. జస్ట్ రీసెర్చ్ చేస్తే.. అవే గొప్ప సినిమాలవుతాయి. అవే మంచి స్ఫూర్తి కథలవుతాయి. కానీ, కావల్సిందల్లా జస్ట్ కాసింత చొరవే!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions