తెలంగాణ అసెంబ్లీలో కేటీయార్ మజ్లిస్‌ను ఉద్దేశించి ‘ఏడు సీట్ల పార్టీ’ అని చేసిన వ్యాఖ్య అక్బరుద్దీన్‌కు కోపం తెప్పించింది… అంతేకాదు, తను ఈసారి 50 సీట్లలో పోటిచేస్తాం, 15 మందితో మళ్లీ సభకొస్తామంటూ ఓ సీరియస్ వ్యాఖ్య చేశాడు…… ఇంట్రస్టింగు… అబ్బే, అలా ఝలక్కులిస్తారు, అంతేతప్ప కేసీయార్‌తో జాన్‌జిగ్రీ దోస్తీని వాళ్లెందుకు వదులుకుంటారు… కేసీయార్ వాళ్లకు ఎన్నెన్నో పనులు చేసి పెట్టాడు… మళ్లీ కేసీయార్ గెలిస్తేనే వాళ్లకు పండుగ… అని తేలికగా తీసిపారేసేవాళ్లున్నారు…
అసలు వాళ్లకు 50 సీట్లలో పోటీచేసేంత సీన్ ఎక్కడిది..? వాళ్లు పాతబస్తీ దాటి బయటికి వెళ్లిందెప్పుడు అనే అభిప్రాయాలూ వస్తున్నాయి… కానీ తప్పు… మజ్లిస్ ఎప్పుడూ తన ప్రయోజనాల్నే చూసుకుంటుంది… తనకు ఏది ప్రయోజనమో లెక్కలేసుకుంటుంది… అఫ్‌కోర్స్, ప్రతి పార్టీ కూడా అంతే… ఆ పార్టీ హైదరాబాద్ దాటి ఇప్పటిదాకా లోకసభ, శాసనసభ స్థానాలకు పోటీపడటం లేదనేది నిజమే… కానీ మున్సిపల్ కార్పొరేషన్లలో ఆల్‌రెడీ కొన్నిచోట్ల సత్తా చాటింది… వేరే రాష్ట్రాలకూ పాకుతోంది…
హైాదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందూ వోటు సంఘటితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే… కావాలని బీఆర్ఎస్, మజ్లిస్ అవసరార్థం ప్రత్యర్థిత్వాన్ని కనబరిచాయి… మజ్లిస్ మాకు సహజ మిత్రులు అని వ్యాఖ్యానించిన నోళ్లే, అబ్బే, వాళ్లకూ మాకూ దోస్తీ లేదు అన్నాయి… కేసీయార్ జాతీయ రాజకీయాల మీద మజ్లిస్‌కు పెద్ద ఇంట్రస్టు లేదు… అది దూరదూరంగానే ఉంటోంది… నిజంగానే మజ్లిస్ గనుక విడిగా రాష్ట్రవ్యాప్తంగా పోటీకి దిగితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ అవకాశాలకు ఎంతోకొంత దెబ్బ… ఇన్నాళ్లూ పాతబస్తీలోని 7 సీట్లు, ఒక ఎంపీ సీటు మినహా ప్రతిచోటా ముస్లిం వోట్లు బీఆర్ఎస్‌కు పడుతూ వస్తున్నాయి… అవన్నీ మజ్లిస్ వైపు వెళ్తే కేసీయార్‌కు నష్టమే అవుతుంది…
Ads
నిజంగానే ఈసారి ఎక్కువ సీట్లలో అసెంబ్లీకి వస్తే… హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అంచనాల నడుమ… తమకు సొంతంగా అధికారం రాకపోయినా సరే, తమ బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుందని గనుక మజ్లిస్ బలంగా భావించే పక్షంలో… తప్పకుండా పాత బస్తీ దాటి బయటికి వస్తుంది… ఈ నేపథ్యంలో సియాసత్ డెయిలీ ఈ ప్రస్తుత చర్చకు ముందే గత నెలలో మజ్లిస్ పార్టీ విస్తరణ మీద ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది… ఇంట్రస్టింగుగా ఉంది… అదేమంటుందంటే…
‘‘మజ్లిస్ పార్టీ 50 స్థానాల్లో పోటీకి ఏడాది కాలంగా కసరత్తు చేస్తోంది… ఏయే సీట్లలో ముస్లిం వోట్లు ఎక్కువగా ఉన్నాయి..? ఏయే సీట్లు మజ్లిస్ పోటీ చేయడానికి మంచి చాన్స్ ఉంది..? అనేది ఆ కసరత్తు… ఆమధ్య దారుస్సలాంలో జరిగిన ఓ మీటింగులో జిల్లాల మజ్లిస్ కేడర్ ప్రధానంగా ప్రజాసమస్యల్ని ఎక్స్‌పోజ్ చేయాలంటూ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చాడు… అణగారిన వర్గాలకు రిజర్వ్ చేయబడి, ముస్లిం వోట్లు ఎక్కువగా ఉన్న సీట్లలో కూడా హిందూ అభ్యర్థులను పెట్టాలనేది ప్లాన్…
దీనివల్ల బహుజనుల వోట్లను కూడా ఇతర ప్రాంతాల్లో సంపాదించవచ్చునని ఆ ప్లాన్ ఆంతర్యం… ఇప్పటికైతే జిల్లాల్లో 17 సీట్లను ఐడెంటిఫై చేశారట… అంటే పాతబస్తీలోని ఏడెనిమిది సీట్లు గాకుండా… నిజామాబాద్ అర్బన్, సంగారెడ్డి, కరీంనగర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, కోరుట్ల, భువనగిరి, వరంగల్ ఈస్ట్, మహబూబ్‌నగర్, ఖమ్మం, జహీరాబాద్, వికారాబాద్, షాద్‌నగర్ సీట్లలో పోటీకి ఆల్‌రెడీ బ్లూప్రింట్ రెడీ అయిపోయింది…
అవకాశమున్న ప్రతిచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను పార్టీలో చేర్చుకుని, వాళ్లను పార్టీ అభ్యర్థులుగా నిలపాలనే ఆలోచన కూడా ఉంది… బహుజనుల వోట్లు గనుక ముస్లిం వోట్లకు కలిస్తే గెలుసు సులభమవుతుందని అంచనా… ఉదాహరణకు, గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్‌లో పార్టీ మీర్ మజాజ్‌ను నిలబెడితే 23.53 శాతం వోట్లు వచ్చాయి… కాగా బీఆర్ఎస్‌కు 31.15 శాతం వచ్చాయి… బహుజన వోట్ల సమీకరణ జరిగితే ఆ తేడాను ఇట్టే కొట్టేయవచ్చు…”
స్టోరీ కాస్త వివరంగానే ఉంది… పార్టీ ముఖ్యులు ఇలాగే లెక్కలు తీస్తున్నారు… మజ్లిస్ ఈ వ్యూహానికి పదును పెట్టి నిజంగానే తెలంగాణవ్యాప్తంగా పోటీలో ఉంటే బీఆర్ఎస్‌కు ఖచ్చితంగా కష్టమే… కానీ అపూర్వ సహోదరులు ఒవైసీ, కేసీయార్ అక్కడి దాకా రానిస్తారా..?!
Share this Article