Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మజ్ను అంటే ఓ పేరు కాదు..! పిచ్చోడు, మూర్ఖుడు అని అర్థం..!!

October 3, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. మజ్ను అనేది ఓ పేరు కాదు . లైలా ప్రియుడి పేరు ఖైస్ . మజ్ను కాదు . మజ్ను అనే మాట మజ్నున్ అనే అరబిక్ పదం నుంచి రూపాంతరం చెందింది . మజ్నున్ అంటే పిచ్చోడు , మూర్ఖుడు అని అర్థం .

లైలా కోసం వీధుల వెంట పిచ్చోడయి తిరుగుతుంటే ఖైసుని మజ్నున్ అనే వారు . అదే మజ్నుగా స్థిరమయింది . ఇదీ మజ్ను స్టోరీ . కారణాలు ఏమయినా ప్రేమలో విఫలమయన వాళ్ళను మజ్ను అనో దేవదాసు అనటమో సెట్టయిపోయింది .

Ads

తండ్రి ANR దుర్గాపురం వెళ్లి పార్వతి ఊళ్ళో ప్రాణాలు వదిలాడు . కొడుకు నాగార్జున ప్రేయసి ఒళ్ళో ప్రాణాలు వదిలాడు . దేవదాసుని మళ్ళీ పుట్టించిన దాసరి ఎందుకనో మజ్నుని మళ్ళీ పుట్టించలేదు . మజ్ను 1987 లో వస్తే ఆయన 2017 దాకా ఉన్నా ఆ ఆలోచన చేసినట్లుగా లేదు . నాగార్జునే ఇప్పుడు తన కొడుకుల్లో ఒకరి చేత మజ్నుని మళ్ళీ పుట్టించవచ్చు .

1987 సంక్రాంతి సీజన్లో వచ్చిన ఈ మజ్ను సినిమా బాగా హిట్టయింది కూడా . ఘాట్ రోడ్లో మలుపులు లాగా దాసరి కధను చాలా మలుపులు తిప్పి సక్సెస్ చేయించాడు . కధ , స్క్రీన్ ప్లే చాలా బిర్రుగా నడుస్తోంది . తన సినిమాల్లో డ్రామా ఎక్కువగా ఉంటుంది . ఈ సినిమాలో డ్రామాను బాగానే తగ్గించాడు . ఈ సినిమాకు కధ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు , నిర్మాత , దర్శకుడు , సర్వం ఆయనే . ఎందుకనో నటించలేదు .

హీరో హీరోయిన్ల వివాహం జరగకుండా ఉండేందుకు ఓ విలన్ హీరో బుర్రలో ఓ ఉత్తరం ద్వారా విషం నాటుతాడు . హీరోయిన్ పవిత్రత గురించి వాకబు చేసుకుని నిశ్చితార్థం నాడు హీరోయినుకు కోపం తెప్పించి నిశ్చితార్థాన్ని మిస్సవుతాడు . పెళ్ళి చెడగొట్టిన సుధాకరుతో హీరోయిన్ రజని పెళ్లి జరిగిపోతుంది .

హీరో హీరోయిన్ని , హీరోయిన్ హీరోని మరచిపోలేరు . ఇంతలో తన భర్తే దొంగ ఉత్తరం వ్రాసి తమ పెళ్ళిని జరగకుండా చేసాడని హీరోయినుకి తెలిసిపోతుంది . విలన్ హీరోని చంపించటానికి ప్రయత్నం చేస్తాడు . చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హీరో హాస్పిటల్ నుండి బయటకొచ్చి ప్రేయసి కోసం వెళుతూ దారిలోనే చనిపోతాడు .

పార్వతి దేవదాసుని కలవకుండానే దేవదాసు చనిపోతాడు . మజ్ను మాత్రం తన ప్రేయసి చేతుల్లోనే చనిపోతాడు . ప్రేయసి కూడా చనిపోతుంది . అలా లైలా మజ్నులను చేసారు దాసరి .

ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా . మరో తెలుగు సినిమాకు ఆయన సంగీతాన్ని అందించినట్లుగా లేదు . ఇది తొలి రాత్రి కదలని రాత్రి ; ప్రేయసి రావే ఊర్వశి రావే సూపర్ హిట్ మెలోడియస్ సాంగ్ ఈ సినిమాలోనిదే. అలాగే మరో విషాదభరిత పాట పొరబడితివో త్వరబడితివో కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది .

హేయ్ నేనే నేనే నేనే నేనే అంటూ సాగే గిటార్ ప్రదర్శనతో సినిమా హుషారుగా ప్రారంభం అవుతుంది . ఐ లవ్ యు , కాలి గజ్జ కట్టుకోను ,  కన్ను కన్ను కలుపు డ్యూయెట్లు అన్నీ బాగుంటాయి . వీటిల్లో ఒకటి వాన పాట కూడా . చిటపట చినుకులు పడుతూ ఉంటే వాన పాటలకు ఆద్యుడు నాగేశ్వరరావు గారేగా !

ఇంతకూ ఈ సినిమా సందేశం ఏంటంటే ప్రేయసిలను చాలా జాగ్రత్తగా హేండిల్ చేసుకోవాలి . ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని హేండిల్ చేసినా ఊరకూరకే ఫైర్ అయిపోతుంటారు . That is an exclusive privilege of fair s x . బడా బడా అనుభవజ్ఞులు చెప్పిన మాట ఇది . Of course . ఇప్పుడు కుర్ర జనం అంత సుతిమెత్తగా లేరనుకోండి . ఉంటే ఉండు ; పోతే పో కాలం కదా ఇప్పుడు .

హీరోగా నాగార్జున పూర్తిగా సెటిల్ కాలేదు అనిపిస్తుంది ఈ సినిమా టైంకు . రజని బాగా నటించింది . విలనుగా సుధాకర్ కూడా బాగా నటించాడు . ఇతర ప్రధాన పాత్రల్లో మూన్ మూన్ సేన్ , సత్యనారాయణ , కె ఆర్ విజయ , గుమ్మడి , షావుకారు జానకి , జె వి సోమయాజులు , తదితరులు నటించారు . మూన్ మూన్ సేన్ నటించిన రెండు సినిమాల్లో ఇదొకటి . మరొకటి సిరివెన్నెలను గుర్తు చేసేదేముంది !?

తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమాను తమిళంలో ఆనంద్ అనే టైటిలుతో రీమేక్ అయింది . ప్రభు , రాధ లీడ్ రోల్సులో నటించారు . తెలుగు సినిమా బాగానే ఉంటుంది .

బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది . సమకాలీన ఢాం ఢాం సంగీత దర్శకులు నేర్చుకోవలసిన సంగీతం ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు వాచ్ లిస్టులో పడేసుకోవచ్చు . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!
  • ఇదుగో గ్రహాంతర జీవులు… వస్తున్నాయి, పోతున్నాయి, గమనిస్తున్నాయి…
  • సో వాట్..? ఈ కెప్టెన్ కూడా ఆటలో పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది..!
  • ఎవల్యూషన్, ట్రాన్స్‌ఫార్మేషన్… ఓ psychological angle లో చూద్దాం…
  • లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటరా..? యాక్టరా..? ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ..!!
  • క్రికెట్‌లోకి ఈ ఆల్‌రౌండర్ ఎంట్రీకి దారివేసింది ఓ పర్‌ఫెక్ట్ థ్రో..!!
  • భారతీయ సివంగులు గెలిచాయి… తొలిసారి ప్రపంచకప్‌ ముద్దాడాయి….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions