ఓ ప్రయోగం… ఓ భిన్నమైన ప్రజెంటేషన్… సూపర్బ్ నటన… ఆరేడేళ్ల ప్రయాస… తపస్సు… ఓ అత్యంత పాపులర్ నవలకు దృశ్యరూపం… అన్నీ నిజాలే… కానీ అందరికీ నచ్చాలని ఏముంది..? ఆడుజీవితం సినిమా గురించే..! అది బేసిక్‌గా మలయాళ సినిమా… నటీనటులు, ఇతర క్రాఫ్ట్స్‌మెన్ వాళ్లే… టార్గెట్ చేసిన ప్రేక్షకులూ మలయాళీలే… సో, మలయాళీ ప్రేక్షకులను కనెక్టయింది…
సహజంగానే మలయాళ ప్రేక్షకులు భిన్నమైన కథల్ని, ప్రయోగాల్ని ఇష్టపడతారు… అనేక ఏళ్లుగా ఆ టేస్ట్ వాళ్లలో ఇంకిపోయింది… ఫార్ములా సినిమాలకు ఆదరణ తక్కువ… ఐనాసరే అన్ని సినిమాలూ నచ్చాలని ఏమీ లేదు… బయటి వాళ్లకు, అంటే వేరే భాషాప్రేక్షకులకు నచ్చాలని అస్సలు లేదు… ఈ చర్చ ఎందుకు వచ్చిందీ అంటే…
ఈ సినిమాను పాన్ ఇండియా పేరిట మలయాళంతోపాటు కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లోకి డబ్ చేసి వదిలారు… తమిళంలో కాస్త పర్లేదు గానీ మిగతా భాషల్లో అట్టర్ ఫ్లాప్… ఎవడూ దేకడం లేదు… అలాగని సినిమా బాగా లేదని కాదు, సినిమా ప్రియుల ప్రశంసలు రాలేదనీ కాదు… ఆ తరహా సినిమాల్ని ప్రేమించే సెక్షన్ ఇష్టపడింది… కానీ సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు…
Ads
ఆరు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే… మొత్తం 81 కోట్లు… అందులో ఓవర్సీస్ 35 కోట్లు (మలయాళ సినిమాలు ఓవర్సీస్‌లో బాగానే ఆడతాయి, కేరళ నుంచి వలస కార్మికుల సంఖ్య ఎక్కువ కదా…), ఇండియాలో వసూళ్లు 46 కోట్లు… ఇందులో 38 కోట్లు మలయాళ వెర్షన్… తమిళంలో కాస్త నయం, కానీ తెలుగులో దారుణం… 1.75 కోట్లు మాత్రమే… కన్నడంలో అసలు లెక్కించాల్సిన పనిలేదు… 6 రోజుల్లో 26 లక్షలు…
ఇక మలయాళ నెటిజనం తెలుగు ప్రేక్షకుల మీద, రివ్యూయర్ల మీద పడ్డారు… ‘అసలు తెలుగు రివ్యూయర్లు ఇచ్చిన రేటింగులు చూస్తే నవ్వొస్తుంది, అసలు వీళ్లకు టేస్టుందా..? మేం తెలుగు సినిమాలు చూడటం లేదా..? మా సినిమాల్ని తెలుగువాళ్లు ఎందుకు చూడరు…?’ ఇదుగో ఇలాంటి వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు… తెలుగు నెటిజనం కూడా కౌంటర్లు వేస్తున్నారు… నిజానికి ఇదంతా అబ్సర్డ్… (నిజానికి ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి… ఐనా రివ్యూయర్ కూడా సగటు ప్రేక్షకుడే కదా…)
నిజానికి ఎన్ని మలయాళ సినిమాల్ని తెలుగు ప్రేక్షకుడు నెత్తిన పెట్టుకోలేదు..? నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు… హీరో, దర్శకుడు బాగా తపస్సు చేశారని సినిమా చూడరు కదా… మరి కన్నడ ప్రేక్షకుడి మాటేమిటి..? వాడు మొత్తానికే రిజెక్ట్ చేశాడు కదా… ఇక్కడ మరో ఉదాహరణ చెప్పుకోవాలి… తెలుగు ప్రేక్షకుడు నిస్సందేహంగా ప్రేమించే దర్శకుడు మణిరత్నం… తను ఆడుజీవితం నవలను మించిన పొన్నియన్ సెల్వన్ భారీ సంపుటాల్ని సంక్షిప్తీకరించి రెండు భాగాల సినిమా తీశాడు…
కానీ తెలుగు ప్రేక్షకుడికి నచ్చలేదు, రిజెక్ట్ చేశాడు… కారణం, ఆ తమిళ పూర్వరాజుల చరిత్రకు మనకు ఎక్కదు కాబట్టి… అసలు ఆ పేర్లే మనకు అయోమయం… కన్నడంలో కూడా ఆ సినిమాను ఎవ్వడూ దేకలేదు… సినిమా ఒక భాషాప్రేక్షకుడికి నచ్చకపోతే, ఆ ప్రేక్షకుడిని తిట్టిపోయడం కాదు, ఎందుకు నచ్చలేదనే మథనం, సమీక్ష అవసరం… అంతేగానీ ఇలా నెట్‌లో తిట్టిపోస్తే ఏం లాభం,.? చివరగా… తమిళ సినిమాల్ని దాదాపు స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లా ఆదరిస్తాడు తెలుగు ప్రేక్షకుడు, ఆ హీరోలకు తెలుగు సెకండ్ నేటివ్ ప్లేస్… కారణం సింపుల్… కాస్త అతి ఉన్నా సరే, తమిళ సినిమా కూడా దాదాపు తెలుగు సినిమాయే కాబట్టి…!!
Share this Article