.
నైతికంగా దిగజారుతూ… ఫేక్ ఫోటోలు, ఎఐ ఇమేజీలు, ఎడిటెడ్ వీడియోలతో ఎంత నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నా సరే బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న మైలేజీ ఏమీ లేదు… కేసీయార్ ఫామ్ హౌజ్ రాజకీయం రాబోయే రోజుల్లో బాగా దెబ్బకొట్టబోతోంది…
అరెరె, ఆగండి, రేవంత్ రెడ్డి సర్కారుకు మైలేజీ కూడా ఏమీ లేదు… దానికి సవాలక్ష కారణాలు… అసమర్థ, అనుభవ రాహిత్య పాలన అని మాత్రమే కాదు… కాంగ్రెస్ సహజ అవలక్షణాలు (వివరించాలంటే స్పేస్ సరిపోదు) రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయి…
Ads
మరోవైపు బీజేపీలో లీడర్‌షిప్ పంచాయితీలతో భ్రష్టుపట్టిస్తున్నారు… పీడీఎస్‌యూ ఈటలను ఏమేరకు పార్టీ శ్రేణులు ఓన్ చేసుకుంటామనేది సమస్య… సో, ఓ పెద్ద వాక్యూమ్ కనిపిస్తోంది… తన గురువు చంద్రబాబు బాటలోనే మరో పదేళ్లు ఉంటా, ఇంకా ఉంటా అని రేవంత్ ఏం చెప్పినా అది శుద్ధ దండుగ… అంత సీన్ లేదు… దానికి తను అమలు చేసే ప్రజాపథకాల పట్ల ప్రజల్లో ఆదరణ రాకపోవడమే పెద్ద తార్కాణం…
బీఆర్ఎస్ సంగతికి వద్దాం… మొన్నటి రజతోత్సవ సభలో కేసీయార్, కేటీయార్… వీళ్లు తప్ప మరొకరి ప్రాధాన్యం లేదు, ఫ్లెక్సీలు, స్టేజీ బ్యానర్ కూడా జస్ట్, కేటీయార్… అంటే తన వారసుడు కేటీయారే అని స్పష్టంగా చెప్పాడు… ఎంతోకాలంగా అది అమలవుతూనే ఉంది… అధికారంలో ఉన్నప్పుడూ తను డిఫాక్టో సీఎం…
ఐతే తనకు జనంలో ఎంత యాక్సెప్టెన్సీ ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్క్… మగ వారసత్వమేనా, మేమం తక్కువ, నాకేం తక్కువ అనే భావన కవితలో బలంగా ఉంది… తానెందుకు రాబోయే రోజుల్లో సీఎం కాకూడదు అనే భావన… నిన్న సోదెమ్మలతో జోస్యం చెప్పించుకుని కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంది, అది మరీ కరెక్టు కాదు…
అందుకే పదేళ్లలో సామాజిక తెలంగాణను సాధించలేకపోయాం అని ఓ బాంబ్ విసిరింది… జనం ఫీడ్ బ్యాక్ తెలిశాకే ఈ కామెంట్ చేస్తున్నాను అని చెప్పింది… అది కేసీయార్‌పైకే వదిలిన బ్రహ్మాస్… అంటే, మా పదేళ్ల పాలన సాధించింది శూన్యం అని చెబుతోంది ఆమె… కేసీయార్ పాలనకు అతి పెద్ద అభిశంసన అది… దీంతో బీఆర్ఎస్ క్యాంపెయినర్లు తెలుసు కదా… ఉచ్చం నీచం తెలియవు… కేసీయార్ బిడ్డ అయితేనేం, కవిత మీదే అటాక్ స్టార్ట్…
ఈలోపు హరీష్ మరో స్టేట్‌మెంట్… కేసీయార్ కేటీయార్‌కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తాను అంటున్నాడు… అంటే ఏదో రగులుతోంది పార్టీలో… సరే, హరీష్ మేనల్లుడే తప్ప రక్త వారసత్వం కాదు, తను అనర్హుడే అనుకుందాం… పైగా ఏమాత్రం చాన్స్ దొరికినా మా షిండే తనే అని ఆల్రెడీ బీజేపీ ప్రచారం ఉండనే ఉంది…
(ఏమో, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో రోజులు మూడితే… హరీష్‌కు బీఆర్ఎస్‌లో కాలం చెల్లితే… ఇద్దరూ కలవవద్దని ఏముంది..? ఆఫ్టరాల్ రాజకీయాలు…) కానీ కవిత తిరుగుబాటే అసలైన విశేషం… ఓ కోణంలో చూస్తే, నిజమే కదా, ఆమె బీఆర్ఎస్ వారసత్వం ఆశిస్తే తప్పేమిటి..? అసలు ఎన్నేళ్లు ఈ పితృస్వామిక, మగ వారసత్వాలు…? ఆడవాళ్లు రాజ్యాధికారానికి పనికిరారా..? కేసీయార్ భావన అదేనా..? అందుకే కవిత పయనానికి, ఆశలకు పదే పదే కత్తెర పెడుతున్నాడా..?
కేసీయార్ బయటికి ఏం చెప్పినా ఇక జనంలోకి రాడు… అసెంబ్లీకి కూడా రాడు… తన ప్రజాజీవితం కొడిగడుతోంది… మరి నిజంగానే తన వారసులు ఎవరు..? రేవంత్ సర్కారు మీద వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అందిపుచ్చుకుని, వారసత్వ గొడవల్లేకుండా దూకుడుగా వెళ్లుందా..? అదీ అనైతిక సోషల్ ప్రచారాలతో కాదు… నిజంగానే జనంలోకి వెళ్లి, జనాన్ని చైతన్యవంతం చేస్తూ..!
Share this Article