.
Ashok Kumar Vemulapalli …. ఆదర్శ కుటుంబం రిలీజ్ కి మల్లారెడ్డి కాలేజీలో సెలవు ఇచ్చారు
కాలేజీలు చదువు చెప్పడానికా? సినిమా ప్రమోషన్ల కోసమా?
ఇలాంటి కాలేజీల్లోనా మన పిల్లల్ని చదివించేది ?
ప్రభుత్వం మల్లారెడ్డి కాలేజీ యజమానిపై చర్యలు తీసుకోదా ?
మల్లారెడ్డి విద్యాసంస్థల్లో వరుసగా సినిమా ఈవెంట్లు నిర్వహించడం, వెంకటేశ్ సినిమా విడుదల రోజున విద్యార్థులకు సెలవు ప్రకటిస్తామని ప్రీతి రెడ్డి చెప్పడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన విద్యాసంస్థలు సినిమా ప్రమోషన్లకు వేదికలుగా మారడం ఎంతవరకు సమంజసం? విద్యార్థుల చదువును పక్కనపెట్టి సినిమా ప్రచారానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి?
Ads
ఇటీవల టాక్సిక్ సినిమా ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్సులు కూలి విద్యార్థులు గాయపడిన ఘటనపై కూడా వార్తలు వచ్చాయి. అయినా వరుసగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై యాజమాన్యం, అధికారులు సమాధానం చెప్పాలి.
అసలు విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఇలాంటి సినిమా ఈవెంట్లకు ఏ నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నారు? విద్యాశాఖ, పోలీసులు అనుమతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారా? విద్యాసంస్థలను వాణిజ్య ప్రచార వేదికలుగా మార్చుకోవచ్చా?
విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉండాలి. సినిమా ప్రమోషన్ల కోసం కాదు!
తెలంగాణ విద్యాశాఖ ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలి. విద్యార్థుల భద్రత, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.
#StudentSafety #EducationFirst #TelanganaEducation #CampusSafety #AshokMedia
సారీ, బతుకమ్మ ఉత్సవాల పేరిట… గార్భా, దాండియా పేరిట… వేల మంది విద్యార్థుల ఎదుట పాత వెగటు హిందీ పాటలకు డాన్సు చేసిన దృశ్యాల గురించి ఇక్కడ వివరించడం లేదు…
Share this Article