.
ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల వేణగోపాల్ రావు బృందం… ఇదీ వార్త… బహుశా ఇక మావోయిస్టు నక్సలైట్ల ప్రస్థాన చరిత్రలో పెద్ద మలుపు కావచ్చు ఇది… హిస్టారికల్ ట్విస్ట్ అనుకుంటాను…
ఇది సంచలనమే… కొంతకాలంగా ఆయన సాయుద పోరాట విరమణ, జనజీవన స్రవంతిలోకి వెళ్లామని ప్రతిపాదించడమే ఓ సంచలనం… పార్టీ అడుగులను నిశితంగా విశ్లేషిస్తూనే, ఇక రిట్రీట్ కావల్సిన సమయం వచ్చేసిందని ముక్తాయించాడు…
Ads
సింపుల్‌గా బయటికి రాలేదు తను… మావోయిస్టు సర్కిళ్లు, సానుభూతిపరులు, పొలిటికల్ సర్కిళ్లలోనూ ఓ డిబేట్‌కు తెరలేపాడు తన బహిరంగ లేఖలతో… అందరమూ ఓ నిర్ణయం తీసుకుని, ఇక జనంలోకి వద్దామనేది స్థూలంగా తన లేఖల సారాంశం…
సరే, కొన్ని కమిటీలు వ్యతిరేకించాయి, కొన్ని సమర్థించాయి… మొత్తానికి పోరాట విరమణ మీద మావోయిస్టు పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని స్పష్టం చేశాయి ఈ లేఖలు, దానికి కౌంటర్ లేఖలు… రాజ్యం భీకర దాడి నుంచి కాస్త బ్రీత్ కోసం కాల్పుల విరమణను ప్రతిపాదించినా, కేంద్రం ససేమిరా అనడంతో… జనం నుంచి కూడా పెద్దగా మద్దతు రాకపోవడంతో…
వందలు, వేల మిలిటెంట్లను రక్షించుకోవడానికి సాయుధ పోరాట విరమణే శరణ్యం అనే చర్చ జోరందుకుంది… మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు కూడా కొన్నాళ్లుగా ఊహిస్తున్నదే… మహారాష్ట్ర, గడ్చిరోలిలో 60 మంది పోరాట సహచరులతో కలిసి ఆయన లొంగిపోయాడు…
(ఫైల్ ఫోటో )
తను లొంగిపోవాలనుకుంటే… ఆయుధాల్ని పీజీఎల్ఏ (మావోయిస్టు ఆర్మీ) స్వాధీనం చేసుకుంటుందని మావోయిస్టు పార్టీ ఓ లేఖలో పేర్కొన్నట్టు గుర్తుంది… మరోవైపు 60 మంది ఆయుధాలతో సహా లొంగిపోయారని ఇంకా ధ్రువపడని వార్తలు చెబుతున్నాయి… నిజం ఏమిటో తెలియాల్సి ఉంది…
బయటికి రండి, మీ ప్రాణాలకు మాదీ భరోసా అని కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర నుంచి తెలంగాణ పోలీసుల దాకా అందరూ చెబుతున్నారు… మరోవైపు ఆపరేషన్ కగార్ తీవ్రతరమైంది… ఈ కీలక సమయంలో ఇక నక్సలైట్ అనేవాడే లేకుండా చేస్తానని అమిత్ షా ఉరుముతున్నాడు…
నిజంగానే అత్యంత పటిష్ట రక్షణ ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా కేంద్ర రక్షణ బలగాలకు దొరికిపోతున్నారు… పోలీసులు అడుగుపెట్టలేని మావోయిస్టు కీలక అడ్డాల్లోకి కూడా కేంద్ర బలగాలు అడుగుపెడుతున్నాయి…
కొత్త తరం ఎలాగూ పోరాటంలోకి రావడం లేదు… సీనియర్ నాయకుల అనారోగ్యాలు… ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ పోలీసులకు బలంగా ఉండటం.,. ఈ స్థితిలో రక్షణే గగనమైపోయింది మావోయిస్టు నేతలకు… వరుస ఎన్‌కౌంటర్లలో వందల మంది మావోయిస్టులు నేలకొరుగుతున్న నేపథ్యంలో… తాత్కాలిక సాయుధ పోరాట విరమణ మేలనే భావనను మల్లోజుల బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చాడు…
మల్లోజుల లొంగుబాటు ఎందుకు సంచలనం అంటే… తనను స్పూర్తిగా తీసుకుని, ఇతర కీలక నేతలు కూడా లొంగుబాటు వైపు అడుగులు వేస్తారని పోలీసులు నమ్మకం… కూంబింగ్, సెర్చింగ్ ఆపేది లేదు, కానీ లొంగిపోయే వాళ్లను ఏమీ చేయబోం అని పలు రాష్ట్రాల పోలీసులు బహిరంగంగానే భరోసా ఇస్తున్నారు… లొంగిపోయే వాళ్ల మీదున్న కేసుల విషయంలో కూడా సానుకూలంగా ఉంటామని చెబుతున్నారు…
ఇక మల్లోజుల లొంగుబాటు బాపతు ప్రకంపనలు ఎలా ఉంటాయో వేచి చూడాలి… ఏమో, పూర్తి సాయుధ విరమణ వైపా..? ఉనికిని చాటుకుంటూ కొందరు పోరాటాన్ని కొనసాగించేవైపా..!?
Share this Article