Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భిన్నమైన కథ… కృష్ణతో శ్రీదేవి జోడీ… సూపర్ హిట్ కొట్టింది…

December 30, 2024 by M S R

.
.    ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..        ….. కృష్ణ-కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా . 1980 ఏప్రిల్లో విడుదలయిన ఈ మామా అల్లుళ్ళ సవాల్ సూపర్ హిట్ సినిమా . 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . లాగించిన సినిమా కాదు ; ఆడిన సినిమా …

ముందుగా మెచ్చుకోవలసింది కధను , స్క్రీన్ ప్లేని తయారుచేసిన యం డి సుందరాన్ని … ఇద్దరు ప్రాణ స్నేహితులు . ఒకరు ధనవంతుడు , మరొకరు పేదవాడు . కాలేజీలో క్లాస్ మేట్స్ చేసిన ఓ కామెంటుతో పేద స్నేహితుడు ధనవంతుడైన స్నేహితుడిని వదిలి వెళ్ళిపోతాడు .

తర్వాత కాలంలో ధనవంతుడు లాయర్ అవుతాడు . బావ కూతురిని పెళ్ళి చేసుకుంటాడు . పేద స్నేహితుడు చనిపోతాడు . అతని తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాడు . అతను ఒక హత్య కేసులో ఇరికించబడతాడు . అతన్ని కాపాడుతానికి లాయర్ హీరో నడుం బిగిస్తాడు .

Ads

ఆ కేసుని హేండిల్ చేసేది హీరో బావ కం మామ పోలీసు ఆఫీసర్ సత్యనారాయణ . ఇద్దరూ పంతంగా తీసుకొని సవాళ్లు విసురుకుంటారు . చివరకు హీరో లాయర్ తన మిత్రుడి తమ్ముడిని కాపాడటంతో సినిమా ముగుస్తుంది .

రొటీన్ కధగా కాకుండా డిఫరెంట్ కధ . అందుకు తగ్గట్లుగా జంధ్యాల సంభాషణలు . ముఖ్యంగా మామా అల్లుళ్ళ మధ్య సవాళ్ళ డైలాగులు బాణాల్లాగా ఉంటాయి . వాళ్ళిద్దరివే కాదు , అందరి డైలాగులు చాలా పదునుగా ఉంటాయి . డైలాగులు సినిమాలో డ్రామాని బాగా మెయింటైన్ చేస్తాయి .

వీటికి తోడు చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు . సినిమా ప్రారంభమే వేటూరి వ్రాసిన ఒక మంచి పాటతో ప్రారంభమవుతుంది . స్నేహితులు కృష్ణ , రంగనాధులు మోటార్ సైకిళ్ళ మీద షికారు కొడుతూ పాడే పాట . ఒక నాటిది కాదు వసంతం విడిపోనిది మా అనుబంధం పాట . బాలసుబ్రమణ్యం , ఆనందులు పాడారు . శ్రీదేవి బ్రాండ్ మార్క్ వానపాట కూడా ఉందండోయ్ . దీన్నీ వేటూరయ్య గారే వ్రాసారు . చిటుక్కు చిటుక్కు చిలికింది వాన .

వీటూరి వ్రాసిన బర్త్ డే పాట . చాలా శ్రావ్యంగా ఉంటుంది . మంచితనానికి మాయని మమతకు పుట్టినరోజు ఇది . అలాగే ఆయనే వ్రాసిన మరో పాట శ్రీదేవి వంటి చిట్టితల్లికి సీమంతం చేయరండి అని శ్రీదేవి మీదే ఉంటుంది . చాలా బాగుంటుంది . వీటూరిదే మరో పాట చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది . బాగుంటుంది .

ఈ సినిమాలో రమాప్రభకు కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలి అనుకునే పిచ్చి . ఆమెకు , తండ్రి అల్లుకు ఓ పాట ఉంది . సరదాగా సాగుతుంది . చక్కనైన మా కృష్ణయ్యని ఎక్కడైనా చూసారా అనే పాట . ఓ మండపేట మైనరు హేయ్ పిండి మిల్లు ఓనరూ జయమాలిని పాట ఇరగ ఉంటుంది . 1980 లో జయమాలిని కాస్త ఒళ్ళు చేసినట్లుగా ఉంటుంది . అయినా డాన్సు స్పీడులో ఏం తేడా ఉండదు .

30+ సినిమాలు కలిసి పనిచేసారు కృష్ణ- కె యస్ ఆర్ దాసులు . ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్సే . ఈ సినిమా క్లైమాక్స్ దాస్ మార్కులోనే ఉంటుంది . ఈ సినిమా విజయానికి ఆయన దర్శకత్వం కూడా ముఖ్య కారణమే .

ఏక్షన్+సెంటిమెంట్+ఎమోషన్+డ్రామా . వెరశి ఈ సినిమా . అతిలోకసుందరి శ్రీదేవి గ్లామర్ ఉండనే ఉంది . ప్రత్యేకంగా అభినందించాల్సింది హీరో కృష్ణని . చాలా బాగా నటించారు .

ఇతర నటీనటులు అందరూ కూడా ఎవరికి వారు బాగా నటించారు . సత్యనారాయణ , జమున , నిర్మలమ్మలను ముందుగా చెప్పుకోవాలి . ఎమోషనల్ సీన్లను చాలా బాగా పండించారు .రంగనాధ్ , చంద్రమోహన్ , అల్లు , సారధి , ప్రభాకరరెడ్డి , సిలోన్ మనోహర్ , జమున , రమాప్రభ , అత్తిలి లక్ష్మి ప్రభృతులు నటించారు .

కృష్ణ , శ్రీదేవి , సత్యనారాయణ అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . A watchable , emotion-filled sentimental , feel good , entertaining movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions