.
మమతా బెనర్జీ … బ్రిటన్ పర్యటనకు వెళ్లింది రీసెంటుగా… బ్రిటన్‌లో పర్యటనలు, సన్మానాలు, ప్రశంసలు, శాలువాలు, ప్రచారాలు ఈమధ్య సులభమయ్యాయి కదా…
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి సంబంధించి కెలాగ్ అనే కాలేజీలో ఓ గ్రూపు నిర్వహించిన కార్యక్రమానికి గురువారం రాత్రి వెళ్లింది… మామూలుగా దేశానికి సంబంధించిన ఏ ఘనతనైనా ఆమె జీర్ణించుకోలేదు తెలుసు కదా తన మెంటాలిటీ…
Ads
వ్యాఖ్యాత ఓ విషయాన్ని ప్రస్తావించాడు… ఇండియా ఇప్పటికే ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్‌ను అధిగమించేసి ప్రపంచంలోకెల్లా ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది, 2060 నాటి అగ్రస్థానానికి చేరుకుంటుంది కదాని ప్రస్తావించారు…
ఆమెకు చర్రుమంది… ఇండియా అగ్రస్థానం అనే ఊహనే భరించలేకపోయింది… నో, నో, నేను అంగీకరించను, ప్రపంచం ఒకవైపు ఆర్థిక యుద్ధాల్లో పడిపోతోంది, మనం పురోగతి ఆశిస్తాం, నేను నమ్మను, ఏమో కోరుకోవడమే తప్ప సాధించేది లేదు అంటూ నోరు పారేసుకుంది… ఎప్పటిలాగే, తన సహజ ధోరణిలో…
మమత మాత్రమే కాదు… ఎవరు పడితే వాళ్లు విదేశాలకు వెళ్లి ఇండియా పట్ల చులకన వ్యాఖ్యల్ని చేయడం చూస్తున్నాం కదా… రాహుల్ గాంధీ అందరికన్నా ఎక్కువ… అంతెందుకు..? స్టాలిన్ వంటి ఒకరిద్దరు తప్ప పాత ఇండి కూటమి నాయకులందరూ అదే తరహా…
సరే, ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే విద్యార్థులు ఆమె వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు… గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో చెలరేగిన హింస, ఆర్జీకర్ హాస్పిటల్‌లో వైద్యురాలి హత్యాచార సంఘటన ప్రస్తావిస్తూ ప్లకార్డులతో నిరసన ప్రకటించారు…
రాజకీయాలకు ఇది వేదిక కాదు అని ఏవో సర్దిచెప్పబోయింది గానీ, చాన్నాళ్లుగా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లోని ఇండియన్లకు మండిపోతున్న అంశాలే అవి… బెంగాల్‌లో మాత్రం ఎవరైనా ఇవి మాట్లాడితే ఆమె ఆగ్రహానికి, సర్కారీ గుండాయిజానికి గురికావల్సిందే…
నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో 1990 నాటి తనపై దాడి ఫోటోను (తను హాస్పిటల్‌లో పడున్న ఫోటోను) ప్రదర్శిస్తూ… నన్ను చంపడానికి ఎలాంటి కుట్రలు, ప్రయత్నాలు జరిగాయో తెలుసా, ఇలాంటి నిరసనలతో నన్ను భయపెట్టలేరు అని ఏదో జవాబు చెప్పి ముగించి, వెళ్లిపోయింది… ఆమె దగ్గర జవాబు ఉంటే కదా…
బెంగాల్ కాదు కదా, ఆమె ఏమీ చేయలేదు… బహుశా ప్రోగ్రాం నిర్వాహకుల మీద మండిపడి ఉంటుంది… సరే, ఇక్కడ ఓ ఇంట్రస్టింగు ప్రశ్న… అదేమిటంటే..? అంత హఠాత్తుగా ఆమె చేతికి అంత పెద్ద సైజు పాత ఫోటో ఎలా వచ్చింది..? వెంట తీసుకుపోయిందా…? అంటే జనం నిరసనను ఎక్స్‌పెక్ట్ చేసి, ఆ పాత ఫోటోతో ఏం చెప్పాలనుకుంది..?
ఎస్, అప్పట్లో ఆమె మీద దాడి జరిగింది, అయితే ఇప్పుడు జనం లేవనెత్తిన ప్రశ్నలకు అది జవాబు ఎలా అవుతుంది.,.? ఇలాంటి నాయకులే మన జాతి దరిద్రం, దేశ దౌర్భాగ్యం…
ఎన్నికల తరువాత హింసతో వేలాది మంది అస్సాం వలసపోయారు… ఒకప్పుడు ఏ గుండాగిరీతో ఏళ్ల తరబడీ బెంగాల్‌ను సీపీఎం పాలించిందో, దాన్ని మించిన రౌడీయిజంతో ఆమె వాళ్లను తొక్కేసింది, అలాగే పాలిస్తోంది… దేశానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క హితవచనం ఆమె నోటి నుంచి రాలేదు ఇన్నాళ్లలో…
మోడీకేమో భయం, ఆమె జోలికి పోడు, చేతకాదు… అయ్యో, 465 కిలోమీటర్ల కంచెకు తగిన భూమి ఇవ్వడం లేదు అంటాడు తప్ప అమిత్ షాకు కూడా అంతకుమించి ఏమీ చేతకాదు… దేశరక్షణ, చొరబాట్ల నియంత్రణకు ఓ కేంద్ర ప్రభుత్వంగా, తమ బాధ్యతగా వాళ్లిద్దరూ చేసేదేమీ లేదు, చేతులెత్తి కళ్లప్పగించి చూడటం మినహా…
సరే, చివరగా ఓ మాట చెప్పుకోవాలి… 1990లో ఆమె మీద దాడి నిజమే… తల పగిలింది… హాస్పిటల్‌లో చాన్నాళ్లు ఉంది… కోలుకుంది, రెట్టించిన కసితో పనిచేసింది… విజయం సాధించింది… కానీ ఏ రోజూ సరైన రాజకీయం చేయలేదు… బోలెడు ఉదాహరణలు…
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తన సొంత రాష్ట్రం అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదు… తన క్షుద్ర, నెగెటివ్ రాజకీయాలే తప్ప ఆమెకు మరో లోకమే పట్టదు… దేశానికి నష్టం చేసే అనేక అంశాల్లోనూ ఆమె తనను తాను మార్చుకోలేదు, మార్చుకోదు, మార్చుకుంటే ఆమె పేరు మమత బెనర్జీయే కాదు..!! ఈ కేరక్టర్ ఇండి కూటమి గనుక గెలిస్తే తను ప్రధాని కావాలని కలలు కన్నది… థాంక్ గాడ్…
మరోమాట… 1990 లో దాడి జరిగితే లాలూ ఆలం అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించి కేసు పెట్టారు… జనం ఛీత్కరించేసరికి తప్పనిసరై ఆరు నెలల తరువాత సీపీఎం తనను పార్టీ నుంచి బహిష్కరించింది,.. పార్టీయే తనను కుట్రతో అందులో ఇరికించిందని, తనను బలిపశువును చేసిందనీ వాపోయాడు తరువాత… 1992 లో మొదలైతే 2019లో తనను సరైన సాక్ష్యాధారాలు లేవని, పలువురు సాక్షులు అప్పటికే మరణించారని వదిలేశారు…!!
Share this Article