ప్రశాంత్ కిషోర్..! వర్తమాన రాజకీయాల్లో ఆయన పేరు విననివాళ్లు లేరు… ఎన్నికల వ్యూహకర్తగా పేరు… నిజానికి తన టీం ఆపరేషన్స్ అధికంగా ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, ఫేక్ ప్రచారాలతో జనం మెదళ్లను తాత్కాలికంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం..! పార్టీల సిద్ధాంతాలు, వాటి నాణ్యత అనేవి గాలికి కొట్టుకుపోయి, ఇదుగో ఇలాంటివే ఎన్నికల్లో ప్రధానపాత్ర వహించడానికి ప్రధాన కారకుడు తను… తనను చూసి దేశమంతా బోలెడు మంది ఎన్నికల వ్యూహకర్తలు, సోషల్ టీం లీడర్లు గట్రా అర్జెంటుగా పుట్టుకొచ్చారు… ఆయన అదృష్టమో, మన రాజకీయాల దురవస్థో గానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్‌తో వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న పార్టీలు అధికారంలోకి వచ్చాయి… దానికి కారణాలు అనేకం ఉండొచ్చు, కానీ క్రెడిట్ మాత్రం పీకే ఖాతాలో పడింది…
ఇంకేముంది..? ఈ దేశరాజకీయాల్లో నేనేమైనా చేసేయగలను అనే ఓ మాయపొర పీకేను కమ్మేయగా, అంతా మేమే చేసిపెట్టాం అనే పిచ్చి ప్రచారం ఆయన టీం చేసుకుంటోంది… పార్టీల నడుమ సంధానకర్త పాత్ర, పొత్తుల్లో దళారీ పాత్రతో పాటు… బీజేపీకి వ్యతిరేకంగా ఓ పెద్ద కూటమిని అర్జెంటుగా నిర్మించి, దేశరాజకీయాలకు ఓ కొత్త దశను, దిశను చూపించబోతున్నాననే ఓ పే-ద్ద భ్రమ పీకేను ఆవరించింది… ఆ అడుగులే వేయిస్తోంది… జాతీయ స్థాయిలో ఈరోజుకూ పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే యాంటీ-బీజేపీ ప్రతిపాదిత కూటమి నుంచి మమత బెనర్జీ తీసిపారేసింది, పక్కనపెట్టేసింది, కాబోయే ప్రధానిగా కలలు కంటున్నది… ఇతర రాష్ట్రాల్లోకి కూడా పార్టీని విస్తరిస్తానంటోంది… ఆశలు మంచివే, కానీ బెంగాల్ దాటితే తన ప్రభావం ఎంత..? ఈ స్వప్న మేఘాల్లో ప్రయాణం ఏమిటి..? ఈ పరిణామాలకు కారకుడు ఈ ప్రశాంత్ కిషోరే…
నిజానికి ఒక పార్టీ అనుసరించే రాజకీయ ధోరణుల దగ్గర నుంచి.., అధినేత పోకడలు, ప్రతిపక్షం బలహీనతలు, వర్తమాన సమస్యలపై పార్టీల వర్క్ దగ్గర నుంచి… పార్టీ కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే వర్కర్ దగ్గర నుంచి… పోలింగ్ బూతులో కూర్చునే కార్యకర్త దాకా… ఎన్నెన్నో అంశాలు గెలుపును ప్రభావితం చేస్తయ్… హఠాత్తుగా ఎవరో నేను వ్యూహకర్తనహో అని చెబుతూ ఏదో మంత్రదండాన్ని ఊపగానే వోట్లు రాలవ్… ఓ ఎడ్లబండి వెళ్తూ ఉంటుంది, ఆ బరువును కష్టానికోర్చి లాగేది ఎడ్లు, బండి కింద నీడపట్టులో వెళ్లే కాపలాకుక్క మొత్తం భారాన్ని తానే మోస్తున్నానని భావిస్తే ఎలా ఉంటుంది..? పీకే టీం ధోరణి ఇలాగే ఉందంటూ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ నాయకుల్లో అసహనం పెరుగుతోంది…
Ads
రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ డెరెక్ ఒబ్రియెన్ ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు… ఆయన ఏదయినా మాట్లాడితే అది పార్టీ స్థూలాభిప్రాయంగానే తీసుకోవాలి… ‘‘పీకే టీం జస్ట్, మాకు ఓ పొలిటికల్ అడ్వయిజరీ సంస్థ మాత్రమే… పార్టీ పటిష్ఠత కోసం సలహాలు ఇచ్చేందుకు ఐదేళ్లకు ఒప్పందం కుదిరింది… అంతకుమించి సదరు సంస్థ అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు… వాళ్ల పని వాళ్లు చేయాలి, అంతకుమించి పార్టీ తరఫున మాట్లాడొద్దు, దాని ప్రస్తుత పనితీరును మమత అంచనా వేస్తారు… బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై మాత్రమే మా దృష్టి కేంద్రీకరిస్తాం, అంతే తప్ప మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆ అవసరం లేదు…’’ అని కుండబద్దలు కొట్టినట్టుగా పీకే టీం పరిమితులు ఏమిటో గుర్తుచేశాడు… క్షేత్ర స్థాయిలో కూడా పీకే టీంకూ, టీఎంసీ కేడర్‌కూ నడుమ దూరం పెరిగిపోతోంది… టీఎంసీ కేడర్ బాగా అసహనంగా ఉంది… ఐనా, పరిమితులు తెలుసుకుని పనిచేస్తే అది ఐప్యాక్ ఎందుకు అవుతుంది..? ఆయన పీకే ఎలా అవుతాడు..? ఇంకా పీకే పీకే అని జపం చేస్తున్న ఇతర నేతలకు ‘‘అర్థమవుతోందా…!!
Share this Article