కొత్త అందగత్తెను వెతికి పట్టుకోవడం… వీలైనంతవరకూ తెలుగు మొహాలు అక్కర్లేదు… నార్త్ పిల్లలు లేదంటే మలయాళీ పిల్లలు… ఎంత వయస్సు తక్కువుంటే అంత బెటర్… కొన్నాళ్లు విపరీతంగా హైప్… బోలెడు అవకాశాలు… తరువాత కరివేపాకులు… సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంతే… కొందరే నిలదొక్కుకుని కొన్నాళ్లు ఫీల్డ్‌లో నిలబడగలుగుతారు… ఇండస్ట్రీ దోపిడీ నుంచి చాకచక్యంగా రక్షించుకుంటూ, తమను తాము ఎలివేట్ చేసుకుంటూ… కొందరు మాత్రమే చాన్నాళ్లు వెలుగుతారు…
మొన్నమొన్నటిదాకా శ్రీలీల పేరు మారుమోగిపోయింది… నిజానికి పెళ్లిసందడి సినిమాతోనే మెరిసింది… ఎవరీ పిల్ల అనుకున్నారు అందరూ… ప్రత్యేకించి ఆమె స్టెప్పులు… లుక్కు… తరువాత ఇక వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి… వరుస కట్టారు నిర్మాతలు… బోలెడంత రెమ్యునరేషన్… చివరకు బాలకృష్ణ, రవితేజ, మహేశ్ బాబు దాకా… ఓ స్టార్డం అనుభవించింది…
ఆమె నటనకు స్కోపున్న పాత్రలేమీ రాలేదు… ఎంతసేపూ రిెకార్డింగ్ డాన్సులు… మరీ గుంటూరు కారంలో ఐటమ్ సాంగ్… ఇక జనానికి ఆ డాన్సులు మొహం మొత్తాయి… ఇప్పుడు ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు… ప్రేమలు సినిమాలో చేసిన మమిత బైజు మీద పడ్డాయి మనవాళ్ల కన్ను… అదేదో విజయ్ దేవరకొండ సినిమాకు ఆమెను తీసేసుకున్నారు అనే ప్రచారం, అంతేకాదు, మరికొన్ని సినిమాలూ ఆమెకు వస్తున్నాయి అంటూ మీడియాలో విపరీతమైన హైప్…
Ads
అంత తేలికగా ప్రతిదీ ఒప్పుకునే టైపు కాదు… జాగ్రత్తగా ఆలోచిస్తోంది… ఇక అందరి కన్నూ భాగ్యశ్రీ బోర్సే మీద పడింది… ఔరంగాబాద్ అమ్మాయి… మోడల్, అంతకుమించి బయోడేటా ఎవరికీ తెలియదు… నైజీరియాలో ఎందుకు చదువుకోవాల్సి వచ్చిందో కూడా తెలియదు… ఇండియాకు వచ్చాక బిజినెస్ మేనేజ్మెంట్ చేసింది… తను చేసింది ఒకే సినిమా… యారియాన్2 అనే హిందీ సినిమాలో చేసింది… అందులోనూ లీడ్ రోల్ ఏమీ కాదు, మందలో మనిషి…
రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా కోసం దర్శకుడు హరీశ్ శంకర్ ఆమెను తీసుకున్నాడు… ఇక మొదలు మీడియా హైప్… అదుగో విజయ్ దేవరకొండ రాబోయే సినిమాకు శ్రీలీలను తీసిపారేసి, మమిత బైజును తీసుకున్నారన్నారు కదా మొదట్లో… ఇప్పుడు అదీ మార్చేసి ఇదుగో ఈ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారని ప్రచారం… రాబోయే సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌కు కీలకం… చాన్నాళ్లుగా తన సినిమాలు అన్నీ ఎదురుతంతున్నాయి…
నిజానికి నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు దక్కే ప్రయారిటీ ఎంత..? మంచి రోల్స్ ఎన్ని..? అన్నీ రొటీన్ పిచ్చి గెంతుల పాత్రలే కదా…
ఈ సినిమాలో ఆమె రోల్ ఇంకా ఫిక్సయిందో కాదో తెలియదు, మరో ప్రచారం… నాని రాబోయే సినిమాకు తీసుకున్నారు అంటూ… అవకాశాలు తన్నుకొస్తున్నాయి అంటూ బోలెడన్ని వార్తలు… ఇద్దరూ బక్కపలుచగా మరీ పిల్లల్లా కనిపిస్తున్నారు… చాలా తక్కువ అనుభవం… అఫ్కోర్స్, మనవాళ్లకు కావల్సింది వాళ్లే కదా…!
Share this Article