.
కొన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో అసలు జనం ఉన్నారా లేదా కూడా ఇప్పటికీ నిర్ధారించుకోలేదు మనం… కొన్ని దీవుల్లోకి వెళ్తే అక్కడి ఆదిమ జాతి మనుషులు మనల్ని శత్రువులుగా చూస్తారు, చంపేస్తారు…
వేరే వ్యక్తులను అస్సలు రానివ్వరు… అలాంటి దీవుల్లో ఒకటి సెంటినలీ… ఎడారులైనా, దట్టమైన అడవులైనా, మంచు కొండలైనా తమ మత వ్యాప్తి కోసం ఎంత కష్టమైనా సరే ఆయా దుర్గమ ప్రాంతాలను చేరడానికి ప్రయత్నిస్తారు మతప్రచారకులు…
Ads
కానీ సెంటినలీస్ సహించరు… అమెరికన్ మిషనరీ జాన్ చౌ నవంబర్ 2018లో సెంటినలీస్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్లతో చంపబడ్డాడు.., వీరిని ప్రపంచంలోని చివరి ప్రీ-నియోలిథిక్ ఆదిమజాతిగా పరిగణిస్తారు…
సెంటినలీ, అలాంటి ఆదిమజాతులున్న దీవులకు వెళ్లడాన్ని భారత ప్రభుత్వం కూడా నిషేధించింది… వాళ్లను డిస్టర్బ్ చేయకూడదని ఆదేశించింది… ఆ జాతులను రక్షించడమే ఈ నిషేధాల ఉద్దేశం… తాజాగా ఓ అమెరికన్ జాతీయుడు ఇలాంటి నిషిద్ధ ప్రాంతమైన నార్త్ సెంటినల్ దీవికి అనధికారికంగా ప్రవేశించాడు…
పోలీసులు అరెస్టు చేశారు… తన పేరు మైఖాయిలో విక్టోరోవిచ్ పోల్యాకోవ్ (24)… తను ఉక్రెయిన్ సంతతికి చెందినవాడు… పోలీసుల కథనం మేరకు…
‘‘అతను ఎటువంటి అనుమతి లేకుండా నార్త్ సెంటినెల్ దీవిలోకి ప్రవేశించాడు… మార్చి 26న పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుని, కుర్మదేరా బీచ్ నుండి నార్త్ సెంటినల్ దీవికి వెళ్ళాడు… మార్చి 29న ఉదయం సమయంలో కుర్మదేరా బీచ్ నుండి తన బోటు ప్రయాణం ప్రారంభించాడు..,
సెంటినలీస్‌కు ఇవ్వడానికి, తద్వారా వాళ్లను ఆకర్షించడం కోసం “కొబ్బరికాయ, కోలా క్యాన్లను”ను తనతో తీసుకెళ్లాడు… పోల్యాకోవ్ ఉదయం 10 గంటలకు నార్త్ సెంటినెల్ దీవి ఈశాన్య తీరానికి చేరుకున్నాడు. బైనాక్యులర్స్ ఉపయోగించి అతను ప్రాంతాన్ని పరిశీలించాడు కానీ ఎవరినీ చూడలేకపోయాడు…
ఎవరైనా తనను చూసి ఉంటే తన సిట్యుయేషన్ ఏమై ఉండేదో తరువాత సంగతి… అక్కడే ఒక గంట పాటు తీరంలోనే ఉన్నాడు… ఎవరైనా తనను చూసి వస్తారనే భావనతో విజిల్ ఊదాడు కానీ సెంటినలీస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
కాసేపు తీరంలోనే అటూఇటూ తిరిగి, తను తీసుకొచ్చిన కానుకలను అక్కడే వదిలి, ఇసుక నమూనాలను సేకరించి, వీడియో రికార్డ్ చేసిన తర్వాత తిరిగి తన బోటుకు వచ్చాడు… మధ్యాహ్నం ఒంటి గంటకు అతను తిరిగి ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 7 గంటలకు కుర్మదేరా బీచ్‌కు చేరుకున్నాడు, అక్కడ స్థానిక మత్స్యకారులు అతన్ని గుర్తించారు…’’
డీజీపీ హెచ్‌ఎస్ ధలీవాల్ ఏమంటున్నాడంటే… “మేం అతని గురించి, రిజర్వ్‌డ్ ఆదిమ ప్రాంతాన్ని సందర్శించాలనే ఉద్దేశం గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం… సెంటినలీ ద్వీపాలతోపాటు ఇంకా ఏయే ప్రాంతాలకు వెళ్లాడో కూడా తెలుసుకుంటున్నాం… తన దగ్గర గాలితో నింపే బోటు, అవుట్ బోర్డ్ మోటార్ స్వాధీనం చేసుకున్నాం… అవి ఇక్కడే పోర్ట్ బ్లెయిర్‌లో అసెంబ్లింగ్ చేయించాడు…
సెంటినలీ దీవికి వెళ్లడానికి ఏమేం కావాలో మొత్తం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు… అధ్యయనం చేశాడు, జీపీఎస్ ఉపయోగించాడు… తన దగ్గర ఓ ఆధునిక కెమెరా కూడా ఉంది… తను సెంటినలీ దీవిలో తిరిగినట్టు ఆ కెమెరాలో ఆధారాలు దొరికాయి… తను అండమాన్, నికోబార్ దీవులకు రావడం ఇదే తొలిసారి కాదు…
గత ఏడాది అక్టోబరులో కూడా సెంటినలీ దీవి ప్రయాణానికి రెక్కీ చేశాడు… కానీ హోటల్ సిబ్బంది ప్రతిఘటించారు… గత జనవరిలో బరటాంగ్ దీవులకు వెళ్లాడు, అక్కడి ఆదిమజాతి మనుషులను వీడియో షూట్ చేశాడు… రహస్యంగా… అమెరికా పౌరుడు కాబట్టి విదేశాంగ శాఖ ద్వారా అమెరికన్ ఎంబసీకి సమాచారం ఇచ్చాం…’’
అక్కడికి వెళ్లడం, వాళ్లతో స్నేహం చేయడం, తరచూ వెళ్తూ మెల్లిగా మత వ్యాప్తికి ప్రయత్నించడమే తన సంకల్పం అని భావిస్తున్నారు…
Share this Article