Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మాయిని పందెంలో ఓడిపోతే… అది ‘మంచి రోజులు వచ్చాయి’ అట..!

June 4, 2024 by M S R

Subramanyam Dogiparthi…. కాస్త ఎర్ర సినిమా . ఇదోరకం క్లాస్ వార్ సినిమా . పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే సినిమా . 1971 లో తమిళంలో వచ్చిన సవాలే సమాలి సినిమాకు రీమేక్ మన మంచిరోజులు వచ్చాయి సినిమా . తమిళంలో వంద రోజులు ఆడి కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయిన సినిమా . మన తెలుగులోకే కాదు ; కన్నడ , మళయాళ , హిందీ భాషల్లోకి కూడా రీమేక్ అయింది .

1972 మే 12 న రిలీజయిన మన తెలుగు సినిమా ఎందుకనో తమిళ సినిమా అంత సక్సెస్ కాలేదు . ఈ సినిమా బాగా గుర్తు ఉండటానికి కారణం దేవులపల్లి వారు వ్రాసిన నేలతో నీడ అన్నది నను తాకరాదని పగటితో రేయి అన్నది పాట . టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . ఈనాటి సంక్రాంతి అసలైన పండగ , ఎగిరే గువ్వ ఏమంది విసిరే గాలి ఏముంది , సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . హిట్టయ్యాయి కూడా .

ఓ పేదవాడు , ఓ పెత్తందారు పంతాలకు పోయి పందెం వేసుకుంటారు . పెత్తందారు ఓడిపోతే తన గారాల కూతురిని పేదవాడికిచ్చి పెళ్లి చేయాలి . పెత్తందారు ఓడిపోతాడు . ఊళ్ళో ఓ పేదవాడితో పెళ్ళి జరిపిస్తారు . ఈ సినిమాలో నాకెందుకో ఈ పందెం అస్సలు నచ్చలేదు . ఇరవయ్యో శతాబ్దంలో కూడా ఆడవాళ్ళని పందెం వస్తువుగా చూపడం నాకు నచ్చకపోవటమే కాదు , కోపం కూడా వచ్చింది . Of course . సినిమాయే అనుకోండి . పైగా వాళ్ళ డబ్బులు , వాళ్ళిష్టం . (ఒక అమ్మాయి ఆమెతో ఏ ప్రమేయం లేకుండా ఓ పేదోడికి, అదీ ఏదో బెట్టింగ్ కారణంగా పెళ్లి చేయాల్సి వస్తే… అది సోషలిజం స్థాపనా..? మంచి రోజులు వచ్చాయనే టైటిలా..?)

Ads

ANR , కాంచన , కృష్ణంరాజు , నాగభూషణం , గుమ్మడి , ధూళిపాళ , అంజలీదేవి , గీతాంజలి ప్రభృతులు నటించారు . తమిళంలో శివాజీ , జయలలిత , నంబియార్ , యస్ వరలక్ష్మి నటించారు . మన తెలుగు సినిమాకు వి మధుసూధనరావు దర్శకుడు . ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ సినిమాకు అసోసియేట్ దర్శకుడు .

ఈ సినిమాను చిలకలూరిపేటకు సైకిళ్ళు వేసుకొని వెళ్లి మరీ చూసాం . ఆరోజుల్లో మా నరసరావుపేటకు ఫస్ట్ రిలీజులు ఉండేవి కావు . సినిమా వీడియో కానీ , పాటల వీడియోలు కానీ ఎందుకనో యూట్యూబులో లేవు . తమిళ సినిమా ఉంది . జయలలిత అభిమానులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

May be an image of 3 people and text

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రావణ తాండవం! రెహమాన్ అందిస్తున్న ఓ సర్‌‘ప్రైజ్ సాంగ్ !!
  • నమ్మకాన్ని బ్రేక్ చేసిన వైసీపీ… ఇది ఎవరికి చెంపపెట్టు ?
  • ప్చ్, వ్యవస్థలో ఎవరూ శుద్దపూసలు కారు- ఈయన అతీతుడేమీ కాదు !!
  • ఇన్నేళ్లకు దొరికింది సరైన పాత్ర..! భేష్, రెచ్చిపోయింది ఈ వరంగల్ పోరి !!
  • నిరాశ ! గాయపడిన ప్రతి బాధితుడి ప్రతి చర్యా న్యాయమైపోదు!!
  • ఒక బొద్దింక నిజాలు మాట్లాడుతోంది… మరో రెండు నోరువిప్పాల్సి ఉంది…
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • స్పర్శతో రూపం దిద్దుకున్న దైవం : అంధ శిల్పి రాంపాల్ వేళ్లే కళ్లు !
  • దక్షిణ వెండి తెరపై చాప్లిన్ ఈ గుండూరావ్ అలియాస్ నగేష్ !
  • లెనిన్ పాండియన్ ! తమిళ వెండి తెరపైకి మళ్లీ వచ్చిన నగరి రోజా !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions