Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

NTR, ఆంధ్రా హేమమాలిని జంట… సినిమా అలా వచ్చింది, ఇలా పోయింది…!!

August 31, 2024 by M S R

ఎవరయినా చూసారా ఈ సినిమాను !? NTR ఉన్నాడు కాబట్టి బహుశా ఓ అయిదారు వారాలు ఆడి ఉంటుంది . ఈ సినిమాకు కధ వ్రాసింది ఆరుద్ర . స్క్రీన్ ప్లే , దర్శకత్వం సి యస్ రావుది . కధ ఎక్కడకు పోతుందో , ఎందుకు తీసుకొని వెళుతున్నారో అర్థం కాదు . NTR , ANR వంటి మహానటులు కూడా మొహమాటం మీద కొన్ని సినిమాలను ఒప్పుకుంటారేమో అప్పుడప్పుడు .

NTR కు జోడీగా పద్మప్రియ నటించింది . మిగిలిన పాత్రల్లో కృష్ణంరాజు , రామకృష్ణ , ప్రభ , ప్రభాకరరెడ్డి , జి వరలక్ష్మి , నాగభూషణం , అల్లు రామలింగయ్య , శరత్ బాబు , జయమాలిని , సత్యనారాయణ ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో జయమాలిని పాత్ర కేవలం ఐటెం డాన్సరుగా కాకుండా , చాలాసేపు ఉండే పాత్ర . అందంగా కూడా కనిపిస్తుంది . ఆంధ్రా హేమమాలిని పద్మప్రియ అందంగానే కనిపిస్తుంది కానీ డైలాగ్స్ డెలివరీ ఘోరం . స్వంత వాయిసో లేక డబ్బింగ్ వాయిసో తెలియదు .

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . జయ జయ రామ హరే పాట చాలా బాగుంటుంది . కళ్ళతో రాసిందే కవిత పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది . మిగిలిన పాటలు విరిసిన ఊహల పందిరిలో , చెక్కిలి నవ్వింది ఎంచక్కగ నవ్వింది శ్రావ్యంగానే ఉంటాయి . యల్ ఆర్ ఈశ్వరి పాడే పాట విప్పే మొనగాడు పాట జయమాలిని మీద . జయమాలిని డాన్స్ పాట ఎలా ఉండాలో అలాగే ఉంటుంది . ఉండాలి కదా !

Ads

సినిమా యూట్యూబులో ఉంది . NTR అభిమానులు చూడాలనుకుంటే చూడవచ్చు . అలాగే పద్మప్రియ అభిమానులు కూడా . ఈ సినిమా ఎందుకు బాగా తీయలేదో అధ్యనం చేయాలనే ఆసక్తి కలవారు కూడా చూడవచ్చు . కొత్తగా సినిమాలు తీద్దామనుకునే నిర్మాతలు తప్పక చూడాలి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస
  • డియర్ చంద్రబోస్, ఓ నాలుగు రోజులు చల్లగరిగెలో ఉండి రావచ్చుగా…
  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!
  • నిషా నూర్‌..! ఈమెదీ సిల్క్ స్మిత కథేనా..? డర్టీ పిక్చర్‌-2 అదేనా..?
  • ఘర్షణ వద్దు – అదెటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేని రోజులివి !!
  • FSD … మస్కా కాదు, మస్క్ మార్క్ ఆటో పైలట్ Tesla కారు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions