కృష్ణ – కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన మరో కౌబాయ్ సినిమా 1973 లో వచ్చిన ఈ మంచివాళ్ళకు మంచివాడు సినిమా . ఈ సినిమా ఔట్ డోర్ షూటింగ్ అంతా రాజస్థాన్ లోని ఉదయపూర్ వద్ద ఉన్న దేల్ వాడా అనే గ్రామంలో , మహాబలిపురం ఇసుక దిబ్బల్లో చేసారు . ఈ సినిమా కూడా ట్రెజర్ హంట్ సినిమాయే . నిధి కోసం కధ .
మోసగాళ్ళకు మోసగాడు రేంజిలో ఆడలేదు . మొనగాడొస్తున్నాడు జాగ్రత్త , మా ఊరి మొనగాళ్ళు వంటి కౌబాయ్ సినిమాలు బాగా ఆడలేదు . ఈ మంచివాళ్ళకు మంచివాడు సినిమా కమర్షియల్ గా బాగానే ఆడింది . రిపీట్ రన్సులో ఇంకా బాగా ఆడింది . యస్ భావనారాయణ నిర్మాతగా వచ్చిన కలర్ సోడా .
సత్యం సంగీతంలో పాటలు శ్రావ్యంగానే ఉంటాయి . వెండి మబ్బు విడిచింది వింత దాహం వేసింది , పిల్లా షోకిల్లా పిలిచే సందె వేళ , ఏ ఊరోయ్ మొనగాడా ఏ ఊరోయ్ షోగ్గాడా పాటలు , విజయనిర్మల , హలం డాన్సులు హుషారుగా ఉంటాయి . శ్రీశ్రీ వ్రాసిన లేనే లేదా అంతం లేనే లేదా రానే రాదా విముక్తి అనే పాట బాగుంటుంది . నాలుగు పాటలూ నలుగురు అగ్ర రచయితలు రాయడం విశేషం… దాశరథి, సినారె, ఆరుద్ర, శ్రీశ్రీ…
Ads
కృష్ణ , విజయనిర్మల , సత్యనారాయణ , నాగేష్ , త్యాగరాజు , జగ్గారావు , నిర్మలమ్మ , గోకిన రామారావు , కాకరాల , సి హెచ్ నారాయణరావు , హలం , ఆనందమోహన్ ప్రభృతులు , దేల్ వాడా గ్రామస్తులు నటించారు .
కాలేజి రోజుల్లో మా నరసరావుపేటలో చూసా . వెంకటేశ్వర పిక్చర్ పేలస్ అని గుర్తు . యూట్యూబులో ఉంది . రొటీన్ ట్రెజర్ హంట్ సినిమా అయినా కె యస్ ఆర్ దాస్ సినిమాను బాగానే ఉరికించాడు . కృష్ణ , విజయనిర్మల , హలం అభిమానులను కాసేపు అలరించే సినిమాయే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……. (By డోగిపర్తి సుబ్రహ్మణ్యం)
నిజానికి ఓ పెద్ద హిట్ సినిమా వచ్చిందంటే… అదే హీరో నటించిన తదుపరి చిత్రంపై చాలా అంచనాలుంటాయి… పోలికలూ వస్తాయి… ఏమాత్రం తగ్గినా ప్రేక్షకుడు ఊరుకోడు… అల్లూరి సీతారామరాజు సినిమా తరువాత కృష్ణ సినిమాలు వరుసగా ఫెయిల్ కావడానికి కారణం ఇదే… మోసగాళ్లకు మోసగాడు తరహాలో పలు కౌబాయ్ సినిమాలు వచ్చినా ఆడలేదు… మోసగాళ్లకు మోసగాడు టైటిల్‌కు పూర్తి కంట్రాస్టుగా మంచివాళ్లకు మంచివాడు అని టైటిల్ పెట్టినా సరే అంత పెద్దగా ఆదరణ పొందలేదు… కాకపోతే కృష్ణ- కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్ అనగానే ఏమేం మసాలాలు ఉండాలో అన్నీ ఉన్నాయి….. ముచ్చట
Share this Article