.
కన్నప్ప సినిమా కథ క్లోజయినట్టే… మలయాళం, కన్నడం భాషల్లో మరీ వారం రోజులే… తమిళం మరో రెండు రోజులు అదనం… హిందీ, తెలుగు భాషల్లో మరీ రోజుకు లక్ష రూపాయల వసూళ్లకు పడిపోయింది…
అంత భారీ ఖర్చు పెట్టినా సరే, ప్రపంచవ్యాప్తంగా, అయిదు భాషల్లో వసూళ్లు కలిసి కూడా 50 కోట్ల మార్క్ చేరలేదు, నాన్ థియేటరికల్ రైట్స్ అమ్మినా సరే, స్థూలంగా వంద కోట్ల వరకూ చిలుం వదిలినట్టే లెక్క…
Ads
సరే, ఆ కథ, ఆ టేకింగ్ ఎట్సెట్రా చాలాసార్లు చెప్పుకున్నదే గానీ… వెంటనే మంచు విష్ణు ఆలోచనలు రామాయణం వైపు మళ్లడం కాస్త ఇంట్రస్టింగు… మొండితనమే అనిపిస్తుంది… కానీ ఆ సినిమాకు తను ఆలోచించిన తారాగణం మరింత ఇంట్రస్టింగు…
రాముడిగా సూర్య… ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాడట… 2009లోనే అడిగాడట, కానీ కుదరడం లేదు అంటాడు… కానీ అప్పుడు సూర్యకు ఇంత ఫాలోయింగ్ ఉందా..? తను రాముడి పాత్రకు సూటవుతాడా..? ఇవీ ప్రశ్నలు… ఐనా ఎందుకు సూట్ కారు..? సీత పాత్రకు నయనతార న్యాయం చేయలేదా ఏం..?
ఇంట్రస్టింగు ఏందంటే..? రావణుడి పాత్రకు తన తండ్రి మోహన్‌బాబు పేరు పరిశీలించడం… గుడ్, బాగానే చేయగలడు… మంచి డైలాగులు పడాలే గానీ ఇరగదీస్తాడు… మరి సీత..? ఆలియా భట్ అట… ఒప్పుకుంటే బాగానే ఉంటుంది… కాకపోతే సాయిపల్లవిలాగే తనూ జీరో సైజ్…
లక్ష్మణుడిగా నందమూరి కల్యాణ్‌రామ్, జటాయువుగా సత్యరాజ్, ఇంద్రజిత్తుగా కార్తి… హనుమంతుడిగా విష్ణు… ఇవన్నీ అప్పటి సమీకరణాలు… ఇప్పుడు కొన్ని కుదరొచ్చు, కొన్ని కుదరకపోవచ్చు… అసలు సూర్య అంగీకరిస్తాడా..? ఇవన్నీ వోకే, అసలైన సమస్య డబ్బులు, తారాగణం, కథ కానేకాదు… ఆల్రెడీ స్క్రిప్టు రెడీగానే ఉందంటున్నాడు కదా… డబ్బులకూ కొదవ లేదు…
కానీ.. 4 వేల కోట్ల రూపాయల భారీ రామాయణం నిర్మాణంలో ఉంది… రెండు పార్టులు, అనేక భాషలు, ప్రపంచమంతా రిలీజ్ చేయబోతున్నారు… హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు… నార్త్ సూపర్ స్టార్ రాముడు, సౌత్ సూపర్ స్టార్ యశ్ రావణుడు… ఏమాత్రం కాస్త మంచి మౌత్ టాక్ వచ్చినా ఈ రామాయణం ముందు మరే రామాయణమూ నిలబడకపోవచ్చు…
వెరసి ఏం జరుగుతుంది..? ఆఁ ఏముందిలే… మరో వంద కోట్లు అంటారా..? కాదు, చూస్తూ చూస్తూ ఆ రిస్క్ దేనికనే ప్రధాన ప్రశ్న తలెత్తుతుంది… మొదట్లో కాస్త మంచి టాకే వచ్చినా, ఏకంగా ప్రభాస్‌నే దింపినా సరే, అంతిమంగా చేతులు కాలాయి కన్నప్ప సినిమాతో… సో, విష్ణు ఆలోచన ఆచరణకు వస్తుందానేది సందేహమే… (ముఖచిత్రంగా వాడింది ఎఐ ఊహాత్మక ఫోటో... సౌజన్యం, ఒడిశాటీవీ)...
Share this Article