.
మంచు ఫ్యామిలీలో అందరూ అంతేనా..? గతంలో ఓసారి మోహన్‌బాబు ఏదో స్టేజీ మీద అక్కినేనికన్నా నేనే బెటర్ యాక్టర్ అని చెప్పుకున్నట్టు చదివాం, వీడియోలు కూడా చూసినట్టు గుర్తు…
మంచు విష్ణు కూడా ఎలా మాట్లాడతాడో చూస్తూనే ఉన్నాం కదా… తాజాగా ప్రభాస్ మీద ఏవో కామెంట్లు చేశాడు… ఏదో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…
Ads
‘‘ప్రభాస్ యాక్టింగ్ జస్ట్ నార్మల్ నాకు… కానీ మోహన్‌లాల్ ఓ లెజెండ్… సుదీర్థమైన కెరీర్… ప్రభాస్ లెజెండ్ కావడానికి టైమ్ పడుతుంది… నాకు ఆ విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడే కాదు…’’
తను అన్నదాంట్లో ఒక కోణం నుంచి చూస్తే పెద్ద తప్పేమీ కనిపించదు… తను ప్రభాస్ పట్ల అమర్యాదగానో, కించపరుస్తున్నట్టుగానో ఏమీ మాట్లాడలేదు… పైగా తను కాస్త టైమ్ తీసుకున్నాక లెజెండ్ అవుతాడనీ, నాకు ఆ నమ్మకం ఉందనీ అన్నాడు…
కానీ వ్యక్తీకరించే విధానం ప్లస్ సందర్భం ముఖ్యం… అది మంచు విష్ణుకు తెలియదు… ఎందుకంటే..? మీరు అడిగారని కన్నప్ప సినిమాలో గెస్ట్ రోలో, ఏదో రోల్ చేస్తున్నాడు ప్రభాస్… నిజానికి తనకున్న స్టార్‌డమ్ రీత్యా చిన్నాచితకా పాత్రలు, గెస్ట్ రోల్స్ కూడా యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్ లేదు ఇప్పుడు…
తన అనారోగ్యంతో తను కమిటైన వేల కోట్ల భారీ ప్రాజెక్టులకే న్యాయం చేయలేకపోతున్నాడు… అలాంటిది కన్నప్పలో ఆ కాస్త రోల్ షూట్ కూడా పూర్తి చేశాడు… ఖచ్చితంగా తన స్టార్‌డమ్, తన అప్పియరెన్స్ కన్నప్ప సినిమాకు బాగా ప్లస్…
ఈ స్థితిలో లెజెండా, కాదా అనే చర్చ, అభిప్రాయం శుద్ధ దండుగ,.. అది ప్రభాస్ ఫ్యాన్లను నొప్పించేదే… అనవసరమైన అభిప్రాయం వెల్లడి… గతంలో ఇదే కదా గొడవ… చిరంజీవితో… ఎవరు లెజెండ్, ఎవరు సెలబ్రిటీ అని..!
నిజానికి ఆ చర్చ జోలికి వెళ్లకూడదు, అదీ తన సినిమాలో పుణ్యానికి రోల్ చేస్తున్నప్పుడు… కొంత కర్టెసీ అవసరం… పైగా విష్ణు ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు… ప్రతి మాటా ఆచితూచి, సందర్భాన్ని బట్టి వాడాలి… ప్రభాస్ మీద వ్యాఖ్యల్లో అది కనిపించలేదు… ఐనా తనసలే ‘మంచు’ విష్ణు… తను అంతే…
ఐనా ప్రభాస్‌కూ మోహన్‌లాల్‌కూ పోలిక ఏమిటసలు..? ఆ ప్రస్తావన, ఆ పోలిక ఉత్త దండుగ… ఎవరి కెరీర్ వాళ్లది, ఎవరి ఫ్యానిజం వాళ్లది, ఎవరి మెరిట్ వాళ్లది… మరింత క్రూడ్‌గా చెప్పాలంటే మోహన్‌లాల్ స్టార్‌డమ్ చాలా పరిమితం… కానీ ప్రభాస్ పాన్ ఇండియా హీరో… (నటన వేరు, స్టార్‌డమ్ వేరు…)
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు గానీ… తను వేగంగా షూటింగులకు హాజరయ్యే పరిస్థితే ఉంటే… ఇప్పటికిప్పుడు ఏక్‌సేఏక్ వేల కోట్ల ప్రాజెక్టులున్నాయి తన చేతిలో… ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ లెజెండ్… ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా..!!
(పైన వీడియో బిట్ వనిత టీవీలో కనిపించింది… దాని రీచ్ పూర్ కదా… 6 వేల వరకూ వ్యూస్ ఉన్నట్టు కనిపించింది… విష్ణు ఏ కాంటెక్స్ట్ లో ఇలా అన్నాడో తెలియదు గానీ… అనవసరం, అవాయిడ్ చేయాల్సింది…) #prabhas, #rebelstar, #kannappa, #manchuvishnu
Share this Article