Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవిని ఇలాంటి పాత్రల్లో మళ్లీ చూడగలమా..? నెవ్వర్..!!

March 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ప్రేమ త్యాగాన్ని కోరుతుంది , కోరుకుంటుంది వంటి సుసందేశాలతో వచ్చిన సినిమా ఈ మంచుపల్లకీ . నవంబర్ 18 , 1982న విడుదల అయిన ఈ సినిమాకు మాతృక తమిళంలో సూపర్ హిట్టయిన పాలైవాన సోలై అనే సినిమా .

ప్రకృతి ప్రేమికుడు వంశీకి మొదటి సినిమా ఇది . తమిళంలో సూపర్ హిట్టయిన సినిమా మరెందుకనో తెలుగులో పేరయితే వచ్చింది కానీ హిట్ కొట్టలేదు . అయితే ఆ తర్వాత అతని దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా సితార సూపర్ హిట్టుతో వంశీ మరెన్నో అందమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు . బాపు అంతటి వాడిగా పేరు తెచ్చుకున్నాడు కూడా .

Ads

తమిళంలో హీరోయినుగా నటించిన సుహాసినే మన తెలుగులో కూడా హీరోయినుగా నటించింది . ఆమెకు మొదటి తెలుగు సినిమా కొత్త జీవితాలు . ఇది రెండో సినిమా . కానీ , ఆమెకు పేరు తెచ్చింది ఈ సినిమాయే . ఈ సినిమా టైంకు ఆమె ఇంకా ఫిలిం ఇన్స్టిట్యూటులో శిక్షణ పొందుతూనే ఉంది .

ఈ సినిమాకు హీరో చిరంజీవి . మన ఊరి పాండవుల్లోలాగానే ఇందులో కూడా అయిదుగురు స్నేహితుల్లో ఒకడే అయినా ఈ సినిమా టైంకు స్టార్డం వచ్చేసింది . అయినా సినిమా చేయటానికి అంగీకరించాడు . 70 వేలు పారితోషికంగా ఇచ్చారట .

ఈ సినిమాకు డైలాగులు వ్రాసింది Yandamoori Veerendranath గారు . చిరంజీవి- యండమూరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా అనుకుంటాను . తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ డూపర్ సినిమాలు చాలానే వచ్చాయి .

మిగిలిన నలుగురు స్నేహితులుగా రాజేంద్రప్రసాద్ , నారాయణరావు , సాయిచంద్ , సప్తపది గిరీషులు నటించారు . నిరుద్యోగులయిన వీధి చివర గోడల మీద వేలాడే బేచిగా నటించిన ఈ అయిదుగురూ ఎవరికి వారు లవ్వాడే హీరోయినుగా సుహాసిని బాగా నటించింది .

వారందరినీ రిపేర్ చేసి ఉద్యోగాన్ముఖులుగా చేస్తూ , వారిని ప్రయోజక మార్గంలో పెట్టే పాత్ర ఆవిడది . అందరి లవ్ నుండి తప్పించుకున్నా హీరో చిరంజీవిని ఇష్టపడ్డా వెలిబుచ్చకుండా తప్పించుకుంటుంది .

నారాయణరావు చెల్లెలు పెళ్లి పీటల మీద ఆగిపోతే తాను ఎక్కువ కాలం బతకననీ నారాయణరావు చెల్లెలిని పెళ్ళి చేసుకోవటానికి ఒప్పిస్తుంది . పెళ్ళిపందిరిలోనే చిరంజీవి చేతిలో వాలి హాస్పిటల్లో అయిదుగురి సమక్షంలో ప్రాణాలను వదులుతుంది . క్లైమాక్స్ చాలా హృద్యంగా ఉంటుంది . ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లుతాయి . టూకీగా ఇదీ కధ .

రాజన్- నాగేంద్ర దర్శకత్వంలో పాటలు బాగానే ఉంటాయి . వేటూరి వ్రాసిన మనసే మణిదీపం మనసే నవనీతం , మేఘమా దేహమా ఉరమకే ఈ క్షణం పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . శ్రీశ్రీ వ్రాసిన పగలు రేయిలో జారక ముందే వెలుగు చీకటిగా మారకముందే కలుసుకుంటాం చాలా బాగుంటుంది . హేపీ న్యూ ఇయర్ , నీ కోసమే మేమందరం పాటలు బాగుంటాయి . పాటల్ని బాలసుబ్రమణ్యం , యస్ జానకిలు పాడారు . మేఘమా దేహమా ఆల్‌టైమ్ క్లాసిక్…

ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , పి యల్ నారాయణ , సాక్షి రంగారావు , దేవదాస్ కనకాల , పుష్యమి , ప్రభృతులు నటించారు . అన్నపూర్ణ పాత్ర , ఆ పాత్రలో ఆమె నటన బాగుంటాయి .

14 లక్షల రూపాయల బడ్జెటుతో తీసిన ఈ సినిమాకు డబ్బులు వెనక్కు రాలేదట . పేరయితే వచ్చింది అందరికీ . సినిమా యూట్యూబులో ఉంది . చూడబుల్ సినిమాయే . అప్పటికే ఎంగ్రీ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఈ సినిమాలో ప్రేమను త్యాగం చేసి , తాను వన్ సైడెడుగా ప్రేమించిన అమ్మాయి మాటకు గౌరవం ఇచ్చే గుడ్ & సాఫ్ట్ బాయిగా చక్కగా నటించాడు .

బహుశా ఆయన అభిమానులకు అది నచ్చలేదేమో అప్పట్లో ! ఇప్పుడు నచ్చొచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం  #సినిమా_కబుర్లు  #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!
  • ఇదుగో గ్రహాంతర జీవులు… వస్తున్నాయి, పోతున్నాయి, గమనిస్తున్నాయి…
  • సో వాట్..? ఈ కెప్టెన్ కూడా ఆటలో పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది..!
  • ఎవల్యూషన్, ట్రాన్స్‌ఫార్మేషన్… ఓ psychological angle లో చూద్దాం…
  • లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటరా..? యాక్టరా..? ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ..!!
  • క్రికెట్‌లోకి ఈ ఆల్‌రౌండర్ ఎంట్రీకి దారివేసింది ఓ పర్‌ఫెక్ట్ థ్రో..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions