.
సోషల్ మీడియాలో ఒక మిత్రుడి పోస్టు ఓసారి చదవండి….
Singer #Mangli కు రాజకీయాలకు సంబంధం లేదట.. తాను neutral అట.. (నమ్మండయ్యా…)
Nominated posts కి Political parties కు సంబంధం లేదట.. ఈవిడ గొప్ప కళాకారిణి కనుక SVBC లో nominated పదవి YCP ప్రభుత్వం ఇచ్చిందట (నమ్మండయ్యా…)
Ads
ఈవిడ కళకు గత ప్రభుత్వం మంత్రముగ్ధులై ఆంధ్రాలో శైవక్షేత్రాల్లో private albums shooting కు ఆఘమేఘాల మీద అనుమతులు ఇచ్చారు (నమ్మండయ్యా…)
ఎమ్మెల్యే మరియు ఎంపీ పనిమాలా రమ్మంటే దర్శనానికి పోయిందట.. (నమ్మండయ్యా…)
దేవుడి కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం అట (నమ్మండయ్యా…)
2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పాటలు పాడింది.. 2 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసింది.. వైసీపీకి మాత్రమే కాదు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడింది.. కానీ టీడీపీకి మాత్రం పాడడానికి వీలు పడలేదట (నమ్మండయ్యా…)
అయితే.. అప్పటికే నాపై వైసీపీ ముద్ర పడటం వల్ల ఇతర పార్టీలకు దూరమయ్యిందట.. అందుకే 2024లో రాజకీయ పార్టీల పాటలు పాడనని తిరస్కరించిందట.. (నమ్మండయ్యా…)
సరే, ఎవరు నమ్ముతారో ఏమిటో తెలియదు గానీ… మరో చూడండి ఓసారి…
అయ్యో అయ్యో, నన్ను బదనాం చేస్తున్నారు అని మొత్తుకుంటున్న మంగ్లీ నీకు ఓ సూటి ప్రశ్న… నువ్వు ఎస్బీబీసీ సలహాదారుగా జగన్ నియమించాడు అంటేనే నువ్వు వైసీపీ మనిషివి అని నిర్ధారణ… దాన్ని నువ్వు బయటికి చెప్పుకోలేదు, బయటపడ్డాక ఏదేదో సమర్థనకు దిగావు…
నువ్వు వైసీపీ మనిషివి కాబట్టే టీడీపీకి పాడనన్నావు… నేను న్యూట్రల్ కళాకారిణిని, ఎవరికైనా పాడతా అనే సోయి నీలో లోపించింది… అది క్లియర్… ఇన్ని చెప్పావు సరే, శ్రీకాళహస్తిలో గుడిలో నీ ప్రైవేటు సాంగ్ షూటింగ్ ఎలా చేశావు..? ఏం సమర్థన ఉంది నీ దగ్గర… అంత పెద్ద సుదీర్ఘ వివరణలో ఆ అంశం లేదెందుకు..? నీకు అనుమతినిచ్చిన , ఇప్పించినవాళ్ళు ఎవడు..? జగన్ పీరియడ్ కాబట్టి వాడికి ఏమీ కాలేదు… అదొక వెర్రి పాలన కాబట్టి..!!
ఏపీబీజేపీ అనే మరో తలకుమాసిన నాయకత్వం భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమికి సిగ్గూశరం ఎలాగూ లేదు, ఉండదు కాబట్టి వాడికి ఇకపై కూడా ఏమీ కాదు..! పైగా కేస్ట్ కార్డ్ కూడా బయటికి తీసింది ఇప్పుడు…
అదే తెలంగాణ కాలేశ్వరం టెంపుల్‌లో ఇలాగే ప్రైవేటు సాంగ్ షూట్ చేసుకోవడానికి కక్కుర్తిపడి పర్మిషన్ ఇచ్చిన ఈవో మగానుభావుడికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది… కనీసం తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞత, సోయి ఉంది కాబట్టి… ఏపీలో అవి కనిపించవు కాబట్టి…
ఎస్వీబీసీ అనేదే ఓ దిక్కుమాలిన దరిద్రపు భక్తజన ధన దుర్వినియోగ చానెల్… సరే, టీటీడీ వెధవలకు ఆ సోయి లేదు, మరి నీ విచక్షణ, నీ విజ్ఞత ఏ గాలిలో కలిసిపోయాయ్… నీకు సాగినన్ని రోజులు నువ్వు ఏం చేసినా రైట్..? ఎవరైనా విమర్శిస్తే పిచ్చి కారణాలతో విఫల సమర్థన…
వెంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకుంటే ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తారా..? అదీ గోప్యంగా..! అదేదో చేయకూడని పని చేసినట్టు, ఎవరికి చెప్పినా అదేదో విశ్వరహస్యం బట్టబయలైనట్లు… అదుగో ఇదే… తగ్గించుకుంటే మంచిది… జగ్గీదేవ్ చాలామందిని పిలుస్తాడు, అదే పెద్ద దందా… అక్కడికి పోవడం, పాడటం పెద్ద ప్లస్సు ఏమీ కాదు… గొప్పగా చెప్పుకోకు…
అక్కడికి టీడీపీ క్యాంపు పెద్ద శుద్ధపూస అని చెప్పడం లేదు… రాజకీయ నాయకులు, పార్టీలే అంత… డబ్బులు పడేస్తారు, వాడుకుంటారు… మన స్వచ్ఛతను ఎలా కాపాడుకుంటున్నాం అనేది మనకే తెలియాలి… అది తెలియకపోతే జస్ట్, సైలెంటుగా ఉండిపోవాలి..!!
Share this Article