Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేను క్రిస్టియన్ కాను…. సోనియా మాటల అర్థమేమిటో తెలియదు…

December 18, 2024 by M S R

.

‘A Maverick in Politics’… అని ఓ పుస్తకం రాస్తున్నాడు కదా మణిశంకర్ అయ్యర్… లాహోర్‌లో పుట్టిన ఈ 83 ఏళ్ల రాజకీయ నాయకుడు పూర్వాశ్రమంలో ఓ ఫారిన్ సర్వీస్ ఉన్నతాధికారి…

డూన్, కేంబ్రిడ్జి విద్యాభ్యాసం సమయంలో రాజీవ్ గాంధీ ఈయనకు జూనియర్… అప్పటి నుంచే సాన్నిహిత్యం ఉంది ఇద్దరికీ… తరువాత పీఎం ఆఫీసులో కూడా పనిచేశాడు ఈయన… మూడుసార్లు లోకసభకు ఎన్నికైనా తరువాత వరుస పరాజయాలు… ఒక దఫా రాజ్యసభ సభ్యుడు…

Ads

తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్… సోదరుడు జర్నలిస్టు… మామ జర్నలిస్టు… సిక్కుయువతిని పెళ్లిచేసుకున్నాడు… ఇదీ ఆయన నేపథ్యం… వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడు, రచయిత… రాజీవ్ మీద నాలుగైదు పుస్తకాలు వెలువరించాడు… ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియదు…

కొత్త పుస్తకం సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో… పదేళ్లుగా సోనియా గాంధీతో ముఖాముఖీయే లేదు… రాహుల్ గాంధీ ఒక్కసారి కాసింత టైమ్ ఇచ్చాడట… ప్రియాంక మాత్రం తనతో బాగుండేదని అంటున్నాడు…

కీలక సమయంలో ప్రణబ్ ముఖర్జీని గనుక ప్రధానిగా ఎంచుకుని ఉంటే… మన్మోహన్ ‌సింగ్‌ను రాష్ట్రపతిని చేసి ఉంటే… 2014లో ఎలాగూ ఓడిపోయేవాళ్లమే కానీ, మరీ 44 సీట్ల అవమానకరమైన ఓటమి ఉండేది కాదనేది మణిశంకర్ అభిప్రాయం… (మన్మోహన్ రిమోట్ ప్రధాని, ప్రణబ్ ముఖర్జీ ఇండిపెండెంట్… సోనియా విధేయతను చూస్తుంది తప్ప స్వతంత్ర ప్రధాని ఆమెకు ఎందుకు..?)

గాంధీ – నెహ్రూ కుటుంబం వల్లే నాయకుడినయ్యాను… ఆ కుటుంబం వల్లే నాయకుడిని గాకుండా పోయాను అంటాడు ఈయన… సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ఆ ఇంటర్వ్యూలో ఓ పాయింట్ ఇంట్రస్టింగు అనిపించింది… అర్థం కాలేదు కూడా… టైమ్స్‌లో కనిపించింది…

https://timesofindia.indiatimes.com/india/my-political-career-made-unmade-by-the-gandhis-what-senior-congress-leader-mani-shankar-aiyar-said-on-sonia-rahul-priyanka-gandhi/articleshow/116330070.cms

ఈయన ఓసారి సోనియా గాంధీకి హేపీ క్రిస్మస్ అని గ్రీటింగ్స్ చెప్పాడు… దానికి ఆమె ‘నేను క్రిస్టియన్‌ను కాను’ అని బదులిచ్చింది… ‘నేను ఆశ్యర్యపోయాను… ఏమో, ఆమె తనను తాను క్రిస్టియన్‌గా పరిగణించడం లేదేమో… ఐనా నేను హేతువాదిని…

నాస్తికుడిని ఐనంతమాత్రాన వేరే మత విశ్వాసాలను అగౌరవపరచను… అన్ని మతాలనూ ఒకేరీతిన చూస్తాను’’ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మణిశంకర్ అయ్యర్… అందరిలో ఉన్న భావన ఏమిటీ అంటే..? ఆమె రాజీవ్ గాంధీని పెళ్లిచేసుకున్నా సరే…

తన వ్యక్తిగత మత విశ్వాసాన్ని అలాగే పాటించిందీ అని… ప్రియాంక, రాహుల్ కూడా అంతేనని… కానీ మణిశంకర్ అయ్యర్ చెబుతున్నది వేరు… ఏమో… ఎన్నికలొస్తే మాత్రం ప్రియాంక గంగస్నానాలు, రాహుల్ జంధ్యధారణాలు, గుడి సందర్శనలు మాత్రం చూస్తుంటాం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions