Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక సూర్యకాంతం, ఒక ఛాయాదేవి… ఒక మంజూష ముక్కవల్లి…

June 21, 2026 by M S R

.

సినిమా ఇండస్ట్రీ విచిత్రంగా ఉంటుంది… ఓ మిత్రుడి సమాచారం మేరకు… ఇంకా పెద్ది సినిమా బ్రేక్ ఈవెన్ కోసం తన్లాడుతుంటే… సమంత నటించిన మా ఇంటి బంగారం ఒకే వీకెండ్‌తో అలవోకగా బ్రేక్ ఈవెన్ అయ్యిందట… సరే, ఆ బాక్సాఫీసు లెక్కల్ని కాసేపు వదిలేస్తే, ఒకటి మాత్రం నిజం…

సినిమా ఇండస్ట్రీ ఎవరూ అనుకున్నట్టు నడవదు… ఇక్కడ ప్రతిభకన్నా అవకాశాలు, అదృష్టం ముఖ్యం… మంచి ప్రతిభ ఉన్నవాళ్లకు నిచ్చెనలు దొరకవు… ఎక్కడో సుడి ఉన్నవాడిని ఎవడూ ఆపలేడు… కొన్ని అనూహ్యాలు అకస్మాత్తుగా మెరుస్తాయి కూడా… చాలా ఉదాహరణలు…

Ads

నిన్న ‘ముచ్చట’ మా ఇంటి బంగారం అనే సినిమాను సమీక్షించినప్పుడు… సమంతకన్నా మంజూష మెరుపులే ఎక్కువ అని అభిప్రాయపడింది… రెగ్యులర్ రొటీన్ ఫార్ములా రివ్యూయర్లకు అది నచ్చనట్టుంది… కానీ స్టిల్ ఆ సినిమాలో సమంతకన్నా మంజూష ముక్కవల్లి లెట్స్ కమాన్ అంటూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది, అది రియాలిటీ…

ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి తన ప్రతిభతో వెండితెరపై ఎలా మెరిసిందో చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ….

నటి మంజూష ముక్కవల్లి: సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర వరకు … ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత స్నేహితురాలు ‘కిరణ్మయి’ పాత్రలో కనిపించిన మంజూష, తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఎందుకు అలరించిందీ అంటే… తెరపై ఆమెను చూస్తుంటే, మన పక్కనే ఉన్న ఓ స్నేహితురాలు అనే ఫీలింగ్ కలుగుతుంది. అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది.


https://www.instagram.com/manju_kuttilu/?utm_source=ig_embed&ig_rid=AyAfc8O9FTI9hBD8ezDl86R


ప్రొఫైల్ – నేపథ్యం

  • స్వస్థలం….: మంజూష స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. తెలుగు యాసపై, భాషపై ఆమెకు ఉన్న పట్టుకు అక్కడి వాతావరణం ఒక ప్రధాన కారణం. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నది.

  • చదువు….: మంజూష విద్యాపరంగా బి.టెక్ (B.Tech) పూర్తి చేసింది. సాధారణంగా ఇంజనీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వైపు వెళ్లే వారు, కానీ మంజూషకు నటన అంటే ఉన్న అమితమైన ఇష్టంతో ఆ దిశగా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.

  • కుటుంబం…: ఆమెది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. తన తల్లిదండ్రులు, సోదరుడి మద్దతుతోనే ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగింది. తన కుమార్తె సినిమాలో వెండితెరపై కనిపించడం చూసి ఆమె కుటుంబం చాలా గర్వపడుతోందని ఆమె పలు ఇంటర్వ్యూలలో పంచుకున్నది.

  • వయస్సు…: మంజూష వయస్సు ప్రస్తుతం 25 – 27 ఏళ్ల మధ్య ఉంటుంది.

కెరీర్ – ప్రత్యేకత

మంజూష గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఆమె చేస్తున్న సోషల్ మీడియా రీల్స్. కేవలం గ్లామర్ కోసం కాకుండా, వైవిధ్యమైన కంటెంట్ కోసం ఆమె ప్రాధాన్యత ఇస్తుంది.

  • ఇమిటేషన్ స్పెషలిస్ట్…: పాతతరం అగ్ర నటీమణులైన సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ వంటి వారి మేనరిజమ్స్‌ను, డైలాగ్ డెలివరీని ఆమె మక్కీకి మక్కీ ఇమిటేట్ చేయడంలో సిద్ధహస్తురాలు. ఈ టాలెంటే నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. (నిజానికి భారీ సంఖ్యలో ఫాలోయర్లు ఏమీ లేరు ఆమెకు, కానీ ఇంపాక్ట్, రీచ్ ఎక్కువ)…

  • నందిని రెడ్డి కళ్లల్లో ఎలా పడింది?…: ‘మా ఇంటి బంగారం’ కోసం దర్శకురాలు నందిని రెడ్డి ఒక సహజమైన నటి కోసం అన్వేషిస్తున్నప్పుడు, మంజూష సోషల్ మీడియా రీల్స్ ఆమె దృష్టికి వచ్చాయి. ఆ పాత్రకు మంజూష అయితేనే బాగుంటుందని నందిని రెడ్డి, సమంత భావించారు. అయితే, నటనలో ఎంత ప్రతిభ ఉన్నా, సినిమాకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవాలని భావించి, ఆమెకు మూడు కఠినమైన ఆడిషన్స్ నిర్వహించారు. వాటిలో ప్రతిభ కనబరిచిన తర్వాతే మంజూషను ఫైనల్ చేశారు.

సినిమాలో స్పెషాలిటీ

సినిమాలో సమంతతో కలిసి మంజూష చేసే కామెడీ టైమింగ్, సహజమైన డైలాగ్స్ ప్రేక్షకులకు చాలా కొత్తగా, బాగున్నాయి. ఎక్కడా ‘నటిస్తున్నాను’ అనే భావన లేకుండా, తనదైన శైలిలో ఆమె పాత్రను పండించింది. ముఖ్యంగా సమంతతో కలిసి ఆమె చెప్పే “లెట్స్ కమాన్” వంటి డైలాగులు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి.

ఎటువంటి సినిమా నేపథ్యం (Backdrop) లేకుండా, కేవలం తన టాలెంట్‌ను నమ్ముకుని, సోషల్ మీడియా వేదికగా వెండితెర వరకు ఎదిగిన మంజూష లక్కీ ఫెలో… నిలబెట్టుకోవడంలో ఆమె తన ప్రతిభను చూపాలి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వీడి ఫుడ్డు వీడే వండుకుంటాడట- ఇంకానయం, చీర్ గరల్స్ కావాలనలేదు!
  • ఆకాశమే నీ హద్దురా… మన అంతరిక్షంలోకి స్కైరూట్ విక్రమ్-1 కొత్త స్టెప్!
  • 25 ఏళ్లు- 25 వేలు- వెయ్యి కిలోమీటర్లు… ఇంట్రస్టింగు ‘రుణబంధం’!
  • ఒక మనిషి భౌతికంగా మాయమైపోయి, మరోచోట ప్రత్యక్షం కాగలడా?
  • నాగదుర్గ తొలి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్టేనా?
  • అద్భుతం… 158 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన అరుదైన పుష్పం!!
  • అదే వృద్ధ అక్కినేని- అదే మీనా- అదే క్రాంతికుమార్… కానీ రిజల్ట్..?!
  • సౌదీలో నేను సేఫ్ అనుకున్నాడు! చివరకు UAPA లో బుక్కయ్యాడు!!
  • కెరీర్ మొదట్లో చిరంజీవి దస్తూరీ తెలుసా మీకు..? ఇదుగో ఓ లేఖ!!
  • I, No Body – ఓ కొత్త స్టోరీ లైన్ – కథ చెప్పడంలోనే కాస్త తడబాటు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions