Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హాస్యం అశ్లీలం చొక్కా వేసుకుని థియేటర్లకు వచ్చిన రోజులవి..!!

October 24, 2025 by M S R

.
Subramanyam Dogiparthi …. ముందే చెపుతున్నా . మన్మధుడు ఓ కండిషన్ పెట్టాడు . ఏందంటే మన్మధలీల కామరాజు గోల సినిమా చూడబోయే వారందరూ కమల్ హసన్ మన్మధలీల సినిమా కూడా చూడాల్సిందే . లేకపోతే మన్మధుడు శపిస్తాడు . మన్మధుడు అవసరం అయిపోయిన వాళ్ళు లెక్కచేయవలసిన అవసరం లేదు . ఇంక సినిమాలోకి వెళదాం …

1987 ఆగస్టులో వచ్చిన మన్మధలీల కామరాజు గోల ఆరోజుల్లో బాగానే గోల గోల చేసింది . 1976 లో వచ్చిన కమల్ హాసన్ మన్మధలీల ఎలా అయితే హల్చల్ చేసిందో ఆల్మోస్ట్ అదే లెవెల్లో కుర్రకారుని , వయసయిపోయిన వారిని కూడా థియేటర్లకు బాగానే రప్పించుకుంది . రెండు సినిమాలలో హీరోలు మన్మధ పీడితులే .

ఎక్కడో ఒకరూ అరా రుష్యశృంగులు మినహాయించి ఎవరికి వారు కామరాజుల్లాగే కలల్లో వీర విహరించారు . ఈ శృంగార కధను రేలంగి నరసింహారావు , మిత్రులు Divakara Babu Madabhushi నేసారు . స్క్రీన్ ప్లేని కూడా వారిద్దరే తయారుచేసారు . ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వ్రాయటం కాస్త కత్తి మీద సామే .

Ads

ఎందుకంటే మన్మధలీల సినిమాలో హీరోలాగా ఈ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ కూడా కనిపించిన ప్రతి చీరె వెంటా పడుతుంటాడు . అలాంటి శృంగారుడు ఉత్తి పుణ్యానికి ఏకపత్నీ వ్రతుడయి ట్రాక్ ఎక్కేలా కధను , స్క్రీన్ ప్లేని తయారుచేయడం కష్టమే . ఆ కష్టతరమైన కార్యక్రమాన్ని రేలంగి నరసింహారావు , దివాకర బాబులు సక్సెస్ఫుల్గా ప్రేక్షక రంజకంగా మలిచారు .

మన్మధలీల సినిమాలోలాగానే చాలామంది భామలు తళుక్కుమంటారు ఈ సినిమాలో కూడా . ఫస్ట్ హాఫ్ అంతా రాజేంద్రప్రసాద్ లీలలే . ఈ సినిమాలో గొప్ప క్రియేటివిటీ ఏమిటంటే మన్మధుడి పాత్ర . An attempt of social fantasy . ఆ మన్మధుడు ఒక్క హీరోకే కనిపిస్తూ ఉంటాడు . మాట్లాడుకుంటూ ఉంటారు . పోట్లాడుకుంటూ ఉంటారు . సవాళ్లు విసురుకుంటూ ఉంటారు .

ఆ సవాళ్ళ గోలే సెకండ్ హాఫంతా . కుదురుగా కల్పనను పెళ్లి చేసుకున్న రాజేంద్రప్రసాద్ సంసారం చేసుకోకుండా మన్మధుడు అవాంతరాలు సృష్టిస్తూ ఉంటాడు . భర్త పెళ్ళికి ముందు చుక్కలు పెట్టడం వలనే తనతో కాపురం చేయటం లేదని భార్యకు అనుమానం , కోపం వస్తాయి .

మన్మధుడితో కామరాజు రాజీకొచ్చాక బామ్మ వేషంలో వెళ్ళి భార్యామణి గారి కోపాన్ని తగ్గించి మరలా కామరాజు వద్దకు వచ్చేలా చేయడంతో శుభం కార్డు పడుతుంది . కామరాజు బుధ్ధిగా కాపురం చేసుకోవటానికి ఉపక్రమిస్తాడు .

పూర్తి హిలేరియస్ అయిన ఈ మూవీలో జంధ్యాల , వంశీ మార్క్ పాత్రలు పుష్కలంగా ఉంటాయి . మొదటిది చంద్రమోహన్ మన్మధుడి పాత్ర . మన్మధుడిగా అందంగా ఉంటాడు . తర్వాత సుత్తి జంట పాత్రలు . అహ నా పెళ్ళంటలో కోట , బ్రహ్మానందం పాత్రల్లాగా .

ఆ తర్వాత శ్రీలక్ష్మి లేడీ దేవదాసు పాత్ర . కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ దేవదాసు లాగా లైటు స్థంభాల కింద కనిపిస్తూ ఉంటుంది . మన్మధలీల సినిమాలో కమల్ హాసన్ మిత్రుడి పాత్ర వంటి పాత్రలో శుభలేఖ సుధాకర్ పాత్ర .

అప్పుడప్పుడు మన్మధుడి చేత ఆవహించబడే బామ్మ నిర్మలమ్మ పాత్ర బాగుంటుంది . వై విజయ కాసేపే కనిపించినా ప్రేక్షకులు మరచిపోలేని అందమైన పాత్రలో తళుక్కుమంటుంది . తిక్క రేగితే కనిపించిన వస్తువులన్నీ పగలగొట్టే పాత్రలో నూతన్ ప్రసాద్ , మన్మధ చూర్ణాన్ని ఇచ్చే ధన్వంతరి పాత్రలో పొట్టి ప్రసాద్ , తదితరులు నటించారు . ఇంకా చాలామంది భామామణులు కామరాజు చుక్కలుగా తళుక్కుమంటారు .

వినోదభరిత చిత్రాలకు సంభాషణలు వ్రాయటం చాలా కష్టం . మెప్పిస్తూ కధను , డైలాగులను నడిపించటం ఇంకా కష్టం . డైలాగులను అలా వ్రాయటంలో దివాకర బాబు సక్సెస్ అయ్యారు . సాలూరు వాసు రావు సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారి పాటల్ని దర్శకులు రేలంగి చాలా చాలా హాటుగా చిత్రీకరించారు .

ముఖ్యంగా అదుపులేని దాహమేదో అణుచుకున్నా ఆగకుంది పాటలో పాపం నిజంగానే అపుకోలేరు . మరో డ్యూయెట్ నన్ను చీరె చేసుకో నడుము చుట్టు చుట్టుకో కూడా హాటుగానే ఉంటుంది . మన్మధ లీలా కామరాజు గోలా పాట గోలగా ఉంటుంది . రాజేంద్రప్రసాద్ గోపికలకు చుక్కలు పెట్టే చు చు చు చు చుక్కా పాట హుషారుగా ఉంటుంది .

సినిమా అంతా రాజేంద్రప్రసాద్ , కల్పన మీద , చుక్కల భామల మీద రొమాంటిగ్గా నడుస్తుంది . ఎక్కడా బోరించకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ రొమాంటిక్ ఫేంటసీ మూవీ యూట్యూబులో ఉంది . వినోద రస ప్రియులు , శృంగార రసాభిలాషులు , కల్పన సౌందర్యాభిమానులు , రాజేంద్రప్రసాద్ అభిమానులు తప్పక మరోసారి చూడవచ్చు .

చూడని వారు తప్పక చూడవచ్చు . అయితే మన్మధుడి కండిషన్ మాత్రం మరచిపోకండి . రెండూ చూడండి . మన్మధుడి శాపానికి గురి కాకండి . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు



హాస్యం అశ్లీలత చొక్కా తొడుక్కుని థియేటర్లకు రావడం, బూతులు యథేచ్ఛగా దొర్లడం బహుశా ఈ సినిమా నుంచే ఆరంభమైందేమో...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Knowledge is not devine… జ్ఞానం ఎప్పుడూ అత్యంత ప్రమాదకరం…
  • హాస్యం అశ్లీలం చొక్కా వేసుకుని థియేటర్లకు వచ్చిన రోజులవి..!!
  • ఎక్కడుందీ లోపం…? ఎందుకిలా నిలువునా కాలిపోతున్నాం మనం..?!
  • హఠాత్తుగా ఈ ఏసీ బస్సులు ఎందుకిలా కాలిపోతున్నయ్…? ఏం చేయాలి..?!
  • దావత్ వితౌట్ దారు..! ఆల్కహాల్‌పై మోజు తగ్గుతున్న యువతరం..!!
  • BESS… The Game-Changer for Continuous Power…
  • కోహ్లీ డక్, రోహిత్ 73… ఎక్కడొచ్చింది తేడా..? ఎవరిదీ తప్పు..?
  • అందం, వినోదం, యోగా, వ్యాపారం ప్లస్ మోసం- శిల్పాశెట్టికి పలు ముఖాలు…
  • BESS… పవర్ సెక్టార్‌లో రేవంత్‌ భేషైన ముందడుగు… అదేమిటంటే..?!
  • “నా ఎడిటర్ అభిప్రాయంతో విభేదించే స్వేచ్చ నాకు లేదా?”

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions