Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!

September 8, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. కొండల్లో కోనల్లో పారే సెలయేరులా ప్రారంభమై హోరున కిందకు దూకే జలపాతమై చివరకు సముద్రాన్ని చేరే నదిలాగా ముగుస్తుంది ఈ మన్నెంలో మొనగాడు సినిమా .

అరకు లోయలో నాగరికతకు దూరంగా అమాయకంగా జీవించే మన్నెం వాసుల సినిమా . యదార్థ గాధ ఆధారంగా నిర్మించబడిన శృంగార , విషాద , దృశ్య కావ్యమని దర్శకుడు సినిమా మొదట్లోనే చెపుతారు .
నిజమే .

Ads

మొనగాడు అర్జున్- వెన్నెల శృంగారాన్ని ప్రకృతి ఒడిలో అందంగా చూపారు దర్శకుడు కోడి రామకృష్ణ . మా పల్లెలో గోపాలుడు టీం రామకృష్ణ , గోపాలరెడ్డి , అర్జున్ ఈ సినిమాలో కూడా సక్సెస్ఫుల్ టీంగా మరోసారి రుజువు చేసుకున్నారు . హీరోయిన్ వెన్నెల నిజంగానే వెన్నెలలాగా ఉంది . మరలా మరే సినిమాలో కనిపించినట్లు లేదు .

వారిద్దరి డ్యూయెట్లు , సరసాలు కమనీయంగా ఉంటాయి . దృశ్య కావ్యమే . ఆ అమాయక మన్నెం జీవితాల లోకి ఓ కీచకుడు ప్రవేశించి , వెన్నెలని పాడుచేసి ఆమె చావుకు కారణం అవుతాడు . ఆ దుర్మార్గుడిని వెంటాడి వేటాడి చంపేస్తాడు మొనగాడు . నేరం ఒప్పుకున్న కారణంగా ఉరిశిక్ష అమలుతో సినిమా విషాదాంతంగా ముగుస్తుంది . సినిమానంతా కోడి రామకృష్ణ చాలా బిర్రుగా నడిపించారు .

vennela

అర్జున్ మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యతను ఫైట్లకు చక్కగా ఉపయోగించుకున్నారు . ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి జాకీ చాన్ కనిపిస్తాడు . ఇతరులకు చిరంజీవి కనిపిస్తాడు . ఫైట్లతో పాటు గూడేలలో ఉండే ఆచారాలను , కట్టుబాట్లను కోడి రామకృష్ణ బాగా చూపారు . నవధాన్యాలు మొలకెత్తిన మూడో రోజు పెళ్ళి ముహూర్తం ఆచారం ఒకటి ఉన్నట్లు ప్రేక్షకులకు తెలుస్తుంది .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో సి నారాయణరెడ్డి గారు వ్రాసిన పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . రేలా రేలా రేలారే రేగు తోపుల్లో రెళ్ళ పూల జాతరలో , పొన్నాచెట్టు కింద ఎన్నీయలో , ఓ మామా చందమామా , కాబోయే నా మొనగాడు మన్నెంలో మొనగాడు , కిక్కిరి గిరి గిరి చక్కంగానే పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పొన్నాచెట్టు కింద ఎన్నీయలో పాటను భార్గవ్ కృష్ణమూర్తి పాడారట . బాగా పాడారు . చిట్టెమ్మ ఈడుకొచ్చె పాట మన్నెంలో ఉండే ఆచారాలను చూపుతుంది .

vennela

అర్జున్ , నూతన నటి వెన్నెల జోడీ , నటన రెండూ బాగుంటాయి . వీరిద్దరి తర్వాత గొల్లపూడి మారుతీరావు , వై విజయ పాత్రలు , నటన బాగుంటాయి . విలనుగా మదన్ అనే నటుడు నటించారు . అతను కూడా తర్వాత మరే సినిమాలో కనిపించినట్లుగా లేదు . బ్రహ్మాజీ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసాడనుకుంటాను .

సినిమాలో అర్జున్ ఫైట్ల తర్వాత సాధారణ ప్రేక్షకులకు బాగా బాగా గుర్తుండి పోయింది పిల్లి- పాము పోరాటం . అద్భుతంగా , సందర్భోచితంగా పెట్టారు దర్శకుడు . ఫైట్లను సాహుల్ అద్భుతంగా కంపోజ్ చేసారు . భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనరుపై నిర్మాత గోపాలరెడ్డికి , ఎగ్జిబిటర్లకు డబ్బులు వచ్చినట్టున్నాయి . కోడి రామకృష్ణ ఎకౌంట్లో మరో హిట్ సినిమా చేరింది .

vennela

అరకు లోయ మండలలం చొంపి అనే గ్రామంలో ఔట్ డోర్ షూటింగ్ అంతా చేసారు .1986 సెప్టెంబరులో రిలీజయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఏక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడవచ్చు . చూడతగ్గ సినిమాయే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!
  • ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!
  • జర్నలిస్టులంటే తోపులూ, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
  • 1.74 లక్షల కోట్ల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions