Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే ఎన్టీయార్… దాసరి సరేసరి… అప్పట్లో ఓ ఎర్ర కమర్షియల్ కళాఖండం…

August 29, 2024 by M S R

నటరత్న-దర్శకరత్న కాంబినేషన్లో 1976 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ మనుషులంతా ఒక్కటే . ఎర్ర కమర్షియల్ సినిమా . కమర్షియల్ ఎర్ర సినిమా . స్వాతంత్య్రం రాకముందు సంస్థానాధీశులు , జమీందార్లు , వాళ్ళ తాబేదార్లు , నౌకర్లు చేసే అఘాయిత్యాలతో ప్రారంభమవుతుంది సినిమా . మొదట్లో కాస్త మంగమ్మ శపధం సినిమా ఛాయలు కనిపిస్తాయి . కానీ , ఈ సినిమాలో మంగమ్మకు శపధం చేసే అవకాశం ఇవ్వకుండా పెద్ద హీరో మంచోడు అయిపోతాడు . NTR ద్విపాత్రాభినయం అనటానికి అవకాశం లేదు . తండ్రి పాత్ర చనిపోయాకే కొడుకు పాత్ర వస్తుంది .

ఈ సినిమాలో NTR , జమునలకు ఈ పాత్రలు కొట్టిన పిండే . అప్పట్లో రత్నగిరి సంస్థానాధీశుడి పాత్ర ఏ నాగభూషణమో వేయాల్సిన పాత్ర . ఆ పాత్రను సత్యనారాయణ పోషించి ఇద్దరు NTR లకు ధీటుగా నటించారు . ఈ ముగ్గురితో పాటు మంజుల , అల్లు రామలింగయ్య , నగేష్ , కాకరాల , రాజశ్రీ , కొమ్మినేని శేషగిరిరావు ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో రమాప్రభ రెండు పాత్రలను వేయటం విశేషం . రమాప్రభ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇదేనేమో ! అల్లు రామలింగయ్య- రమాప్రభల జోడీ వీర అల్లరి . ఎర్ర హీరో నారాయణమూర్తి సినిమా క్లైమాక్సులో ఓ సింగిల్ డైలాగ్ పాత్రలో కనిపిస్తారు .

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హిట్ . సి నారాయణరెడ్డి వ్రాసిన అనుభవించు రాజా అనుభవించు , తాతా బాగున్నావా పాటలు బాగుంటాయి . తాతా బాగున్నావా పాట తాతను మనమడు టీజింగ్ చేసే పాట . సి నారాయణరెడ్డి వ్రాసిందే మరో ఎర్ర పాట ఎవడిదిరా ఈ భూమి 1970s , 1980s లోని ఎర్ర ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి . ఆత్రేయ వ్రాసిన పాట కాలం కాదు పాటను బాల సుబ్రమణ్యం ఘంటసాలను గుర్తుకు తెస్తారు .

Ads

ఈ సినిమాలో మరో రెండు పాటల్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఒకటి దాసరి నారాయణరావే వ్రాసింది . నిన్నే పెళ్ళాడుతా రాముడు భీముడు అని మొదలుపెట్టి NTR నటించిన సినిమాల టైటిల్సుతో ఓ పాటను నేసాడు దాసరి . సినిమాలో మంజుల ఎదురుగా ఆడియెన్సులో కూర్చొని ఉన్న చిన్న NTR మీద పాడే డాన్స్ పాట . థియేటర్లు చప్పట్లతో ,ఈలలతో మారుమోగిపోయాయి . మంజుల డాన్స్ కూడా బాగుంటుంది . (కమల్ హాసన్ పదహారేళ్ల వయస్సులో కూడా సినిమా టైటిళ్ల పాట ఒకటి ఉంది… సినిమా పాట అంటే ఏదో దిక్కుమాలిన సాహిత్యమే అవసరమా, ట్యూన్‌లో ఏ పదాలు పొదిగినా సరే, చల్తా…)…

రెండోది అల్లు- రమాప్రభల ముత్యాలూ వస్తావా అడిగిందీ ఇస్తావా పాట . కొసరాజు వ్రాసారు ఈ పాటను . హిందీ ఆరాధన సినిమాలోని రూప్ తేరా మస్తానా ట్యూన్లో ఉంటుంది . అసలా ఐడియా దాసరికి ఎలా వచ్చిందో . పాటలో ఇద్దరు రాజకుమారుడు , రాజకుమారిల దుస్తులు , సంబంధించిన సెట్టింగ్ . మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం పాటలాగా ఈ పాట కూడా తిరనాళ్ళల్లో జనాన్ని ఊపేసిన పాట .

ప్రత్యేకంగా చెప్పాల్సింది మరొకటి కూడా ఉంది . అది బెనర్జీ వాళ్ళ వీరాభిమన్యు బుర్ర కధ . బుర్ర కధతో పాటు పెద్ద NTR ని కురుక్షేత్రంలో అభిమన్యుడిని ఎలా చంపుతారో అలా చంపటం దాసరి బాగా చూపారు . బుర్రకధ చివర్లో భారతదేశానికి స్వాతంత్య్రం రావటం , చిన్న NTR పుట్టడం కలిపి చూపడం చాలా సందర్భోచితంగా చూపారు దాసరి .

రిలీజయిన యాభై కేంద్రాలలోనూ యాభై రోజులు ఆడి మంచి కలెక్షన్లను రాబట్టింది . నాలుగు చోట్ల షిఫ్టింగులు లేకుండా వంద రోజులు ఆడింది . విజయవాడ లక్ష్మీ టాకీసులో 128 రోజులు ఆడింది . హైదరాబాదులో షిఫ్టింగులతో సిల్వర్ జూబిలీ ఆడింది . వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో జరిగింది . మా గుంటూరులో ఇరగ ఆడింది .

దుర్గా నాగేశ్వరరావు కో డైరెక్టర్ , కోడి రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ . రెండవ ఉత్తమ కధా చిత్రంగా వెండి నంది అవార్డుని పొందింది . అహింసా విప్లవం అనే సందేశంతో సినిమాను ముగిస్తారు దాసరి . మహాత్మాగాంధీ , నెహ్రూ , లాల్ బహదూర్ శాస్త్రి , ఇందిరాగాంధీల సందేశాలను ప్రస్తావిస్తూ సినిమాను ముగిస్తారు దాసరి .

నేనయితే ఈ సినిమాను థియేటర్లలో గానీ , టివిలో గానీ ఎన్ని సార్లు చూసి ఉంటానో ! కమర్షియల్ ఎర్ర కళాఖండం అని చెప్పవచ్చేమో ! మాతరంలో , మా తర్వాత తరంలో ఈ సినిమాను చూడనివారు ఎవరూ ఉండరేమో ! ఈతరంలో ఎవరయినా చూడనివారు ఉంటే యూట్యూబులో ఉంది . తప్పక చూసేయండి . Undoubtedly a great entertainer and value for time cinema . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!
  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…
  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions