.
Subramanyam Dogiparthi ….. ఈ మరణమృదంగం సినిమాలో సుహాసినికి కోదండరామిరెడ్డి చాలా అన్యాయం చేసారు . సినిమా చివర్లో చిరంజీవికి భార్య ఆయిపోయి, బిడ్డను కన్న రాధ ఇంకో రాధకు చెపుతుంది . వెనకాల ఇంకో చిరంజీవి వస్తున్నాడు ; అతన్ని లిఫ్ట్ అడుగు అని . దొంగమొగుడు సినిమాలో భానుప్రియ కోసం మూడో చిరంజీవి వచ్చినట్లు అన్న మాట .క నీసం సుహాసినికి అలా పెట్టి ఉన్నా బాగుండేది . ఏందో ఈ డైరెక్టర్లు !
అదంతా ఎలా ఉన్నా చిరంజీవిని మెగాస్టార్ చేసింది ఈ మరణ మృదంగం సినిమాయే . అప్పటివరకు సుప్రీం హీరో , డైనమిక్ హీరో అంటూ టైటిల్సులో వేసేవారు . నిర్మాత కె యస్ రామారావు గారికి చిరంజీవిని మెగాస్టార్ చేసేయాలని కోరిక కలిగింది . చేసేసారు . చిరంజీవి అయిపోయారు .
Ads
చిరంజీవి , కోదండరామిరెడ్డి , యండమూరి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా . యండమూరి నవలల్లో నటించటం చిరంజీవికి అలవాటే… దీని తరువాత రుద్ర నేత్ర, స్టువర్ట్‌పురం వచ్చాయి, పోయాయి… దీనికి ముందు అభిలాష , ఛాలెంజ్ , రాక్షసుడు , దొంగమొగుడు సినిమాలు వచ్చాయి … అప్పట్లో యండమూరి, చిరంజీవి కాంబో హిట్… దానికి బ్రేక్ పడింది ఈ మరణమృదంగంతోనే…
యండమూరి కలం నుండి వచ్చిన ఈ కధ చాలా వరకు రొటీన్ ఏక్షన్ , క్రైం , రొమాన్స్ , రివెంజ్ , దుష్టశిక్షణ , అమాయకుల రక్షణ ఫార్ములా అయినా కోదండరామిరెడ్డి డిఫరెంటుగా ఆవిష్కరించారు .
నటీనటుల ఎంపిక . ప్రముఖ బాలీవుడ్ నటుడు సురేష్ ఓబెరాయిని మెయిన్ విలనుగా ప్రెజెంట్ చేసారు . ఈయన వివేక్ ఓబెరాయ్ తండ్రి . మెయిన్ విలనుకు రైట్ హేండుగా రంజిత్ ఎంపిక . లోకల్ టచ్ కోసం గొల్లపూడి , సుధాకర్ , ప్రదీప్ శక్తి ఉన్నారు . సపోర్టింగ్ పాత్రలు సత్యనారాయణ , రంగనాధ్ , బ్రహ్మానందం , గుమ్మడి , ప్రసాద్ బాబు , సాక్షి రంగారావు , అనిత నటించారు .
చిరంజీవి , నాగబాబు కలిసి సరదా సరదాగా నటించిన సినిమా ఇది . కలిసి నటించిన రెండో సినిమా . చిరంజీవికి తోడుగా ఉండే పాత్రను లక్ష్మణుడిలాగానే నటించాడు . ఈ ఇద్దరి పాత్రలు కాస్త anochronistic గా ఉంటాయి . వాళ్ళు నడిపే కేసినో , వాళ్ళ దుస్తులు కౌబాయ్స్ లాగా ఉంటాయి . డైరెక్టర్ అలా ఎందుకు ప్లాన్ చేసాడో !!
ఇలాంటి ఢిష్యూం ఢిష్యూం 1+2 పాత్రలు వేయటంలో చిరంజీవి పండిపోయాడు . వెడం చేత్తో చేసేయగలడు . ఇంక రాధ , సుహాసినిలు . వాళ్ళకూ అంతే . రాధ పొగరుబోతు ఆడపిల్లలా , మొండిదానిగా నటిస్తే , సుహాసిని ఛాదస్తురాలిగా , భయస్తురాలిగా , మధ్య తరగతి కుచేల కుటుంబాన్ని లాక్కొచ్చే వనితగా ఇద్దరూ బాగా నటించారు .
ఈ సినిమా అంటే ఫైట్లతో పాటు పాటలు , డాన్సులు . ఫైట్లను రాజు కంపోజ్ చేస్తే డాన్సుల్ని తార కంపోజ్ చేసింది . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు పర్లేదు, హిట్టే. ముఖ్యంగా కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా పాట హిట్టయింది . చిరంజీవి , సుహాసిని మీద చిత్రీకరించబడింది .
అలాగే వాళ్ళిద్దరి మీదే మరో డ్యూయెట్ గొడవ గొడవ పాట . ఈ పాటకు ముందు ఓ పెగ్గేసి చిరంజీవిని గురూ అనటం , ఒరే అనటం వెరైటీగా , ముద్దుగా ఉంటుంది . సాధారణంగా అలాంటి పాత్రలు , డైలాగులు సుహాసినికి ఉండవు కదా !
చిరంజీవి , రాధ మీద కూడా రెండు డ్యూయెట్లు . సరిగమపదనిస , కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి అంటూ వ్రాసారు వేటూరి . టార్జాన్ లాగా దుస్తులు లేకుండా చిరంజీవి రాధను టీజ్ చేసే పాట . చిరంజీవి అభిమానులకు సరదాగా ఉంటుంది ఆ పాటలో చిరంజీవి అల్లరి నటన .
యండమూరి కధలంటే IQ టెస్టులు , క్విజ్ పరీక్షలు ప్రేయసీ ప్రియుల మధ్య మస్తుగా ఉంటాయి . నాకు తెలిసి ప్రేయసీప్రియుల మధ్య సరసం ఆడుకోవటానికి , గిల్లికజ్జాలు పెట్టుకోవటానికే టైం సరిపోదు . ఈ తెలివి పరీక్షల ఆలోచన యండమూరికి ఎక్కడ నుండి వచ్చిందో ! వెన్నెల్లో ఆడపిల్ల దగ్గర నుంచీ ఆయన కధల్లో ఎక్కడో చోట ఈ IQ టెస్టులు ఉంటాయి .
ఈ సినిమాలో కూడా ఉంటాయి . వాటన్నింటికీ అనుగుణంగా సాయినాథ్ డైలాగులను వ్రాసారు . పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . వీరందరికీ రధసారధి కోదండరామిరెడ్డి సినిమాను బిర్రుగానే నడిపించాడు .
సినిమా యూట్యూబులో ఉంది . చాలామంది చాలాసార్లు చూసే ఉంటారు . చూడనివారు ఎవరయినా ఉంటే చూసేయవచ్చు . It’s a 100% Chiranjeevi & Kodandarami Reddy-mark entertainer . నేను పరిచయం చేస్తున్న 1179 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article