రీల్స్, షార్ట్స్… ఎవరు దేన్ని ఎందుకు ఇష్టపడతారో ఓ పట్టాన సమజ్ కాదు… జనం పిచ్చిపట్టినట్టే చూస్తుంటారు కొందరి వీడియోలను… కోట్ల వ్యూస్, లక్షల లైక్స్, కామెంట్స్… విపరీతంగా వైరల్, ట్రెండింగ్… ఇదీ అదే…
మారీ చుగురోవా అని ఓ రష్యన్ లేడీ… ఇండియాలో ఫుడ్, టెంపుల్స్, ఆటోలు, ట్రెయిన్లు, కల్చర్, డ్రెస్సెస్, టురిస్ట్ ప్లేసెస్… ఒకటేమిటి, అన్నీ… సమయానికి ఏది తోస్తే అది పోస్ట్ చేస్తుంటుంది… జనానికి విపరీతంగా నచ్చేస్తున్నాయి… 3.5 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నట్టున్నారు ఆమె ఖాతాలో…
సరే, మామూలుగా మనం నగరాల్లో చాలాచోట్ల సైకిళ్ల మీద, మోపెడ్ల మీద టిఫిన్లు, మీల్స్ తీసుకొచ్చి అమ్ముతుంటారు తెలుసు కదా… చాలామందికి వాటి మీద ఓ తృణీకార భావన… హైజీన్, టేస్ట్, రేట్ ఎట్సెట్రా… మరీ రోడ్డు పక్కన తినడం నామోషీ… అదే ఫుడ్ మూణ్నాలుగు రెట్ల ఎక్కువ రేటుకు ఏదో ఓ హోటల్‌లో తింటే తృప్తి వాళ్లకు…
Ads
మరీ కుమారి ఆంటీలా అందరూ సంపాదించలేరు గానీ… హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో ఈ టిఫినీ సైకిళ్లతో వేలాది మంది చొప్పున ఉపాధి పొందుతుంటారు… వాళ్లకదే జీవనాధారం… ఇడ్లీ, దోస, వడ, బోండా జస్ట్ 20 రూపాయలు… 40, 50 రూపాయలకు మీల్స్… పేదవాడికి చౌకగా కడుపు నింపే అన్నపూర్ణలు ఇవి…
మామూలుగా విదేశీయులకే కాదు, ఇండియన్లలోనూ చాలామందికి ఇడ్లీ అంటే ఉప్మా తిన్నంత చిరాకు… కొన్ని ప్రాంతాల్లోనేమో సాంబారు లేకపోతే ఇడ్లీ ముక్క కూడా నోట్లో పెట్టరు… చట్నీలు పన్నెండు రకాలు పెట్టినా డోన్ట్ కేర్… కాస్తో కూస్తో సౌత్ ఇండియాలో ఇడ్లీలు బాగుంటాయి… ముంబై వంటి చోట్ల పావ్ బాజీలు, వడ పావ్‌లు తప్ప ఇడ్లీలు కనిపించడమే అరుదు…
అదుగో సుధ అని ఓ శ్రామిక మహిళ తన సైకిల్ మీద దోసలు, వడలు, ఇడ్లీలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటుంది… అక్కడి ఈ రష్యన్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ చుగురోవా వెళ్లింది… ఇడ్లీ రుచి చూసింది… రాసుకొచ్చింది… వీడియో పోస్ట్ చేసింది…
చాలామంది నాకు ఇడ్లీ గురించి నెగెటివ్‌గా చెప్పారు… స్వయంగా టేస్ట్ చేద్దామని వచ్చా… నేను విన్న అభిప్రాయాలు తప్పని అర్థమైంది… ఈ రుచి అమోఘం… ఒకరకంగా నాకూ ఇది ఓ మేలుకొలుపు… నిజంగా రోజూ ఇడ్లీలు తింటే బాగుండు అన్నంత బాగుంది… అని సర్టిఫికెట్ ఇచ్చేసింది… వారం పది రోజులైంది ఆ వీడియో పెట్టి… ఆశ్చర్యం ఏమిటంటే..?
ఆ వీడియో వైరల్… ట్రెండింగ్… 1.7 మిలియన్ వ్యూస్… లక్ష దాకా లైకులు… బోలెడు కామెంట్లు… ఏముందీ ఇందులో అనడక్కండి… సోషల్ మీడియా ట్రెండింగ్ వీడియోలు అంటే అంతే… ఏది ఎందుకు వైరల్ అవుతుందో చెప్పడం కష్టమని ముందే చెప్పుకున్నాం కదా… ఇదీ ఓ ఉదాహరణ…
Share this Article