.
చాలా చిన్న ఆర్డర్… ఒక సెట్ దోశ, ఒక ఆనియన్ ఊతప్పం… ఓ మామూలు ఉడిపి హోటల్ వెళ్లినా 150 నుంచి 200 అవుతుంది బిల్లు… పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే డబుల్ వాచిపోతుంది, ఇంకా ఎక్కువే… కానీ జొమాటో వాడు 108 రూపాయలకు పంపించాడు…
అదీ ప్లాట్‌ఫామ్ ఫీజు, జీఎస్టీ కలిపి… పైగా 8 కిలోమీటర్ల దూరం ఉన్న హోటల్ నుంచి..! క్వాంటిటీ, క్వాలిటీ సేమ్… నో ట్రాన్స్‌పోర్ట్ చార్జ్… కానీ ఎలా..? అర్థమైంది ఏమిటంటే..? స్విగ్గీని ఇంకా దెబ్బ కొట్టి, మార్కెట్‌లో ఎక్కువ స్పేస్, వాటా కొట్టేయాలని ప్లాన్…
Ads
అందుకే నో కుక్ నవంబర్ అని ఓ స్కీమ్ పెట్టాడు… అనేక ఆఫర్లు… ఓసారి మీ జొమాటో ఖాతాకు వెళ్లి కూపన్లు, ఆఫర్లు చెక్ చేయండి, బోలెడు… మూడు రోటీలు, ఒక మెథీ చమన్ కర్రీ నిన్న 185 రూపాయల బిల్లు… ఇదే ఆర్డర్ మొన్న మేడ్చల్ కృతుంగ రెస్టారెంటులో ఇస్తే 370 రూపాయల బిల్లు అయ్యింది… ఈ నెలాఖరు వరకూ స్కీమ్… (హైదరాబాద్‌లోనే ఉందా, ఇతర చోట్ల కూడా ఉందా తెలియదు…)
సరే, మరో విషయం… ర్యాపిడోను ఇంకాస్త బలంగా దెబ్బకొట్టాలని ఊబర్ వాడు ఫిక్సయినట్టున్నాడు… గతంలో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని ఓ మెట్రో స్టేషన్ వెళ్తే 55- 60 రూపాయలు తీసుకునేవాడు… ఇప్పుడు 3 కిలోమీటర్ల లోపు దూరానికి జస్ట్ 25 చాలు అంటున్నాడు.,. అలాగే తీసుకుంటున్నాడు… గౌతమ్ గంభీర్‌తో ఈమేరకు బోలెడు యాడ్స్ గుప్పిస్తున్నాడు కూడా… ర్యాపిడో కూడా ఫుడ్ డెలివరీకి… టూవీలర్ మాత్రమే కాదు, ఆటోలు, కార్లనూ మొదలుపెట్టి చాన్నాళ్లయింది… అందుకే ఊబర్ దెబ్బలు మొదలుపెట్టినట్టుంది…
ఈ రెండు ఇష్యూస్‌లో… జొమాటో, ఊబర్ స్కీమ్స్ విషయంలో… హోటల్ రేట్లు, గిగ్ వర్కర్ (సప్లయ్ నెట్‌వర్క్) ఛార్జీలు ప్లస్ తన ప్లాట్‌ఫారమ్ కమీషన్ ఎలా వర్కవుట్ అవుతున్నాయో తెలియదు, బహుశా ఎక్కువ మంది కస్టమర్లను తన ఫోల్డ్‌లోకి తెచ్చుకోవడం, ప్రత్యర్థిని దెబ్బతీయడం కోసం కొంత నష్టాన్ని భరిస్తున్నదేమో… కొన్ని హోటళ్లు కూడా హోమ్ డెలివరీ చేస్తున్నాయి కానీ వాళ్లకూ ఈ రిబేట్లు ఏమాత్రం వర్కవుట్ కావు…
సేమ్, ఊబర్ కూడా… 25 రూపాయల ఛార్జీలో… వెహికిల్ డ్రైవర్‌కు ఎంత ఇస్తున్నాడు, తన ప్లాట్ ఫారమ్ ఫీజు ఎలా వర్కవుట్ అవుతున్నాయో అర్థం కాదు… నాణేనికి మరోవైపు చూద్దాం… హైదరాబాద్ మార్కెట్‌లో ఓలా లెక్కలోనికే రాదు… ర్యాపిడో పార్శిల్ డెలివరీ రేట్లు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయి…
ఆన్‌లైన్ గ్రాసరీ ఎట్సెట్రా సప్లయ్ చేసే ప్లాట్‌ఫారాలు చాలా ఉన్నాయి తెలుసు కదా… జియో మార్ట్, బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టో తదితరాలు… గతంలో జియో మార్ట్ వంటివి ఎంత చిన్న ఆర్డర్ అయినా సరే, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీ వేసేవి కావు… (కస్టమర్లకు అలవాటు చేసేదాకా చేసి, తరువాత బాదడం అంబానీ ప్రతి సంస్థ వ్యాపార ధోరణి, కానీ ఈ ఆన్‌లైన్ మార్కెట్‌లో తనను మించిన బోలెడు యాప్స్ వచ్చేశాయి…)
ఇప్పుడు బిగ్‌బాస్కెట్ సహా దాదాపు ప్రతి యాప్ మినిమం 200 ఆర్డర్ లేకపోతే దూరాన్ని బట్టి రవాణా చార్జ్ వసూలు చేస్తున్నాయి… బిగ్‌బాస్కెట్ ఓ బ్యాగులో పెట్టి పంపిస్తాడు, కొన్ని యాప్స్ సరుకులు, పార్శిళ్లు తీసుకొచ్చి అలాగే అప్పగిస్తాయి… కాకపోతే పళ్లు, కూరగాయలు ఆన్‌లైన్‌లో తెప్పించకపోవడమే బెటర్… కుళ్లిపోయినవి వస్తే, ఫిర్యాదు చేయడానికి కూడా చాన్స్ ఉండదు, ఎవడూ పట్టించుకోడు, ముందే డబ్బులు కడతాం, పే ఆన్ డెలివరీ ఉండదు… రిస్క్… అదీ సంగతి…
చివరగా… ఆమెజాన్ ప్రైమ్ సభ్యత్వం లేకపోతే… చాలా లేట్ డెలివరీ ఇస్తున్నాడు… రోజుల తరబడీ… పైగా ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు… పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ కాస్త నయం…!! ఇలా ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల ఇష్యూస్ తవ్వేకొద్దీ బోలెడు… నగర జీవితాలకు తప్పని అవసరం- అవగాహన..!! (అర్బన్ కంపెనీ, విజయ్ హోమ్స్ కథాకమామిషు తరువాత చెప్పుకుందాం)
Share this Article