Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంచి సందేశం ఒక్కటే సరిపోదు… అది ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కించాలి…

April 7, 2024 by M S R

Subramanyam Dogiparthi…..  మరో ప్రపంచం . ఈ మాట వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీశ్రీ గారే . ఆయన మహా ప్రస్థానం . బహుశా అక్కినేని , ఆదుర్తి ద్వయానికి శ్రీశ్రీ గారి పదమే స్ఫూర్తి అయిందేమో 1970 లో వచ్చిన ఈ సినిమా తీయటానికి . స్ఫూర్తి ఏదయినా , ఈ ద్వయం ప్రయత్నాన్ని మాత్రం శ్లాఘించాల్సిందే .

ఈ ద్వయం సందేశాత్మక చిత్రాలను తీయాలనే అభిలాషతో చక్రవర్తి చిత్ర అనే సంస్థను నెలకొల్పి మొదటి ప్రయత్నంగా సుడిగుండాలు తీసారు . రెండవది ఈ మరో ప్రపంచం సినిమా . నక్సలైట్ల మరో ప్రపంచం లాగానే ఈ మరో ప్రపంచం కూడా ఓ ఊహాజనిత , అసాధ్య ప్రపంచమే . అలాంటి ప్రపంచం వస్తే , ఉంటే అద్భుతం . కానీ , సాధ్యమా !!!

మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాలలో పెద్దపెద్దోళ్ళు ఆడుతున్న అబధ్ధాలకు విసుగెత్తిన కొందరు యువతీయువకులు దేశంలో పిల్లల్ని ఎత్తుకుపోయి కుళ్ళు , కుతంత్రం , కులం , మతం , ప్రాంతం వంటి సంకుచిత భావాలు లేని మరో ప్రపంచంలో పెంచుతారు . పిల్లల కిడ్నాపుల సంచలనం నేపధ్యంలో ప్రభుత్వం ఒక సి బి ఐ ఆఫీసర్ని నియమిస్తుంది . ఆ సి బి ఐ ఆఫీసర్ ఆ ప్రపంచాన్ని చూసి వారిలో ఒకరయిపోతారు . చివరకు కోర్టు , ప్రభుత్వం ఆ మరో ప్రపంచం సృష్టిని సమర్ధించలేవు .

Ads

సినిమా భావనకు మెప్పు వచ్చింది కానీ , జనానికి నచ్చలేదు ఆరోజుల్లో కూడా . కమర్షియల్ గా సక్సెస్ కాలేదు . నాకు గుర్తుండి ఈ ద్వయం మూడో సినిమా తీయలేదు . వాళ్ళ ప్రయత్నం కొనసాగించి ఉంటే బాగుండేది . సందేశాలను ఇవ్వటానికి సినిమాలను డ్రైగా తీయనక్కరలేదు . గొప్ప ఉదాహరణ బాపు గారి బుధ్ధిమంతుడు , విశ్వనాధ్ గారి సప్తపది సినిమాలే . నవరస భరితంగా కూడా తీయబడిన సినిమాలు ఇలా కోకొల్లలు .

ANR , గుమ్మడి , సావిత్రి , జమున , అనిత , విజయచందర్ సాక్షి రంగారావు , సూరేకాంతం , రాధాకుమారి , మీనాకుమారి , మాడా ప్రభృతులు నటించారు . ఆదుర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు కె వి మహదేవన్ . రెండు పాటలే ఉన్నాయి . ఒకటి విజయచందర్ , అనితల మీద తీసిన బుర్ర కధ . మరొకటి మహాత్ముడే కలల గన్న మరో ప్రపంచం , గాంధీ మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం పాట .

ఆరోజుల్లో కధలకు , సినిమాలకు , సందేశాలకు , స్ఫూర్తిని ఇచ్చేందుకు గాంధీ తత్వాన్నే ప్రస్తావించేవారు . గాంధీ బొమ్మ సినిమాలో కానీ , న్యూస్ రీల్సులో కానీ కనిపిస్తే ఈలలతో , చప్పట్లతో థియేటర్లు మారుమోగిపోయేవి . చాప కింద నీళ్ళలాగా గాడ్సే భక్తులు గాంధీ మీద , ఆయన తత్వం మీద అవాస్తవాలు , ద్వేషం , శీల హననం వండి వార్చి జనం బుర్రల్ని కలుషితం చేసారు . ఇదంతా మరో గోల . నేను వయసులో ఉన్నప్పుడు ఈ గాడ్సే సైన్యం దుర్మార్గం తెలిసి ఉంటే , ఓ పెద్ద ఉద్యమాన్నే నడిపి ఉండేవాడిని . ఇప్పుడు వయసూ లేదు , ఓపికా లేదు , డబ్బులూ లేవు . అయినా , చేస్తాను . చేస్తున్నాను .

మళ్ళా సినిమాలోకి వస్తే , మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . నాకయితే నచ్చింది . నేను ఎమోషనల్ ఫెలోని కదా ! దురదృష్టవశాత్తు యూట్యూబులో కూడా లేదు . టి విలో కూడా ఎప్పుడూ వచ్చినట్లు లేదు . Bharadwaja Rangavajhala వంటి సినిమా జర్నలిస్టులు ఈ సినిమాని యూట్యూబులోకి తెస్తే బాగుంటుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సో వాట్..? ఈ కెప్టెన్ కూడా ఆటలో పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది..!
  • ఎవల్యూషన్, ట్రాన్స్‌ఫార్మేషన్… ఓ psychological angle లో చూద్దాం…
  • లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటరా..? యాక్టరా..? ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ..!!
  • క్రికెట్‌లోకి ఈ ఆల్‌రౌండర్ ఎంట్రీకి దారివేసింది ఓ పర్‌ఫెక్ట్ థ్రో..!!
  • భారతీయ సివంగులు గెలిచాయి… తొలిసారి ప్రపంచకప్‌ ముద్దాడాయి….
  • మొన్న పచ్చళ్ల రమ్య… నేడు దివ్వెల మాధురి… బిగ్‌బాస్ స్క్రిప్టు అట్టర్ ఫ్లాప్…
  • కేసీయార్ చేసిన ఆర్మీ ద్రోహ వ్యాఖ్యలు గుర్తులేవా కేటీయార్..?!
  • సీన్ రివర్స్..! ’ఆడబిడ్డ’ అస్త్రం కేటీయార్ మీదే ఉల్టా ఉరుముతోంది..!!
  • రాజకీయ ఎదుగుదలకు ప్రేయసినే తార్చటానికి సిద్ధపడిన ఓ నాయకుడు..!!
  • నేములోనేముంది అనకండి..! ఇప్పుడు నామకరణమూ వ్యాపారమే..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions