Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మూడు కాలాల్లో ‘మూడు ముళ్లు’… మన పెళ్లిళ్ల పరిణామ క్రమం ఈ మూడూ…

April 3, 2024 by M S R

Subramanyam Dogiparthi……..    మూడు తరాల్లో మళ్ళీ పెళ్లి టైటిల్ తో మూడు సినిమాలు వచ్చాయి . మొదటిది 1939 లో , రెండవది 1970 లో , మూడవది 2023 లో . పెళ్లి గురించి ఆయా కాలాల్లో ఎలాంటి భావన ఉందో ఈ సినిమాలలో ప్రస్ఫుటమవుతుంది .

1939 లో వచ్చిన సినిమాలో వై వి రావు , కాంచనమాల హీరోహీరోయిన్లు . కాంచనమాల బాలవితంతువు . పేరంటానికి పిలవటానికి వచ్చిన ఆడవారు తెలియక నుదుట బొట్టు పెడతారు . వాళ్ళింట్లో ఉండే ఓ స్వామీజీ నానా యాగీ చేస్తాడు ధర్మం నశిస్తుందని . హీరో వై వి రావు సంఘసంస్కర్త . రాజా రామ మోహన రాయ్ , కందుకూరి వీరేశలింగం పంతుళ్ల చేత ఉత్తేజుడు . హీరోయిన్ని ఒప్పించి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు . ఇది 1939 కధ .

రెండవది 1970 లోనిది . హీరోయిన్ విజయనిర్మల హీరో కృష్ణని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది . భర్త ఇంటికి వెళ్ళాక మరదలు పేరుతో వచ్చిన ప్రేమలేఖలను చదివి , అనుమానంతో హీరోయిన్ కి విడాకులు ఇస్తాడు హీరో . విడాకులు ఇచ్చాక కూడా , మాంగల్యాన్ని తీయకుండా , మరలా భర్తను చేరుతుంది . విడాకులు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవలసి వచ్చింది . ఇది 1970 కధ

Ads

మూడవది 2023 లోనిది . మనందరికీ సినిమా కధా , అసలు కధా రెండు ఫ్రెష్ గానే గుర్తున్నాయి . హీరోహీరోయిన్లకు సంసారాలు ఉండగానే ప్రేమ సంబంధం పెట్టుకుని , ఆ సంబంధాన్ని కొనసాగించి , అందరి గోల పడలేక , యాగీ పడి మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు . చేసుకున్నారు . ఇది 2023 కధ .

ఈ మూడు సినిమాలు చూస్తే భారతీయ సమాజంలో పెళ్ళి విషయంలో మన భావనలలో వచ్చిన మార్పులు చక్కగా అర్థం అవుతాయి . ఛాందస సామాజిక కట్టుబాట్ల వలయంలోనుంచి , విశృంఖల వ్యక్తిగత కోరికలకు , తిక్కలకు అనుకూలంగా మార్పు పొందింది . ఆసక్తికరమైన పరిణామం .

1970 లో వచ్చిన సినిమాలో కృష్ణ , విజయనిర్మల , కృష్ణంరాజు , అనిత , నాగయ్య , హేమలత , నిర్మలమ్మ , మిక్కిలినేని , రాజబాబు , ప్రభాకరరెడ్డి ప్రభృతులు నటించారు . 2023 సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు . 1970 సినిమాకు సి యస్ రావు దర్శకుడు , కె వి మహదేవన్ సంగీత దర్శకుడు . అయినా పాటలు ఎందుకనో హిట్ కాలేదు .

సినిమా కూడా ఏవరేజ్ గా మాత్రమే ఆడింది . మూడు సినిమాలూ యూట్యూబులో ఉన్నాయి . వాచ్ లిస్టులో పెట్టుకుని మూడూ చూడండి . తులనాత్మక పరిశీలన చేయండి . రాచిరంపాన పెట్టబడిన సమాజం శృంఖలాల నుండి భారతీయ మహిళ ఎలా విముక్తురాలయిందో తెలుస్తుంది . ముఖ్యంగా 1939 సినిమా మాత్రం మిస్ కాకండి . ఆడవాళ్లు తప్పక చూడాలి . ఎంత మంది సంఘసంస్కర్తలు నారీ విముక్తి కొరకు కష్టపడ్డారో తెలుస్తుంది . చరిత్రను తెలుసుకోవాలి . తెలుసుకోకపోతే సామాజిక చరిత్రను కూడా తిరగ వ్రాయించే రోజులు వచ్చాయి .

ఇప్పటికే రాజా రామమోహన్ రాయ్ ని , కందుకూరిని దూషించే నయా సంస్కర్తలు వచ్చారు . ఇలాంటి వారి వలన భారతీయ సాంప్రదాయాలకు గండి పడిందని భావించే నయా సంస్కర్తలు వాట్సప్ యూనివర్సిటీల ద్వారా కధల్ని నేసి వదులుతున్నారు . ఎవరికి వారుగా అధ్యయనం చేసి , తీర్మానాలకు రావాలి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ పోరాటాలు కొత్త పుంతలు కాదు… విచిత్ర పుంతలు ఫాఫం..!!
  • ‘‘చోడో కల్‌ కీ బాతే, కల్‌ కీ బాత్‌ పురానీ– నయే దౌర్‌ మే లిఖేంగే నయీ కహానీ!’’
  • క్షమించండి… యాదాద్రి కాదు… ఒడిశాలోని తారాతరిణి శక్తిపీఠం ఇది…
  • నాలుగు మెట్రో కథలు… కొత్తతరం నగర జీవితాలు… మెట్రో ఇన్ దినో…
  • అందరికీ సన్నబియ్యం… ఆచరణలో కష్టమైనా సర్కారు సక్సెస్..!
  • దలై లామా..! స్వధర్మం, స్వయంపాలన, స్వజనం కోసం అదే నిబద్ధత..!!
  • తండ్రి సమస్యను పరిష్కరించి… ఏటా 40 వేల కోట్ల మేరకు ఫాయిదా…
  • మీడియా సమస్యా..? కాదు, రాబోయే రాజకీయ సమీకరణాల సంకేతాలు..!!
  • మరి అమరావతి అంటే ఆమాత్రం ఉండాలి… మొక్కలనూ వదలరు…
  • No more ‘BARC’racy… టీవీ రేటింగుల లెక్కలే పూర్తిగా మారబోతున్నయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions