రావుగోపాలరావు చాలా గొప్ప కేరక్టర్ ఆర్టిస్టు… నో డౌట్… ఎవ్వడూ వంక పెట్టలేడు… విలనీ దగ్గర నుంచి కామెడీ, ఎమోషన్ అన్నీ తనకు కొట్టిన పిండి… తన వారసుడిగా తెరపైకి చాలా లేటుగా వచ్చిన ఆయన కొడుకు రావు రమేష్… నిజానికి రావుగోపాలరావును మించిన నటుడు… ప్రత్యేకించి ఎమోషన్స్ బాగా పలికించగలడు…
కానీ ఎక్కడో భారీగా తేడా కొడుతోంది… తన వ్యవహార ధోరణితో నిర్మాతలకు సరిపడటం లేదా..? తనకు వచ్చే పాత్రల పట్ల అతనే తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా..? తెలియదు… కానీ తెలుగు ఇండస్ట్రీలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యం ఏమీ దక్కడం లేదు… నిజానికి ఎక్కడి నుంచో వచ్చి, నానా రకాల ఆంక్షలు, కమర్షియల్ షరతులతో వ్యవహరించే ఒకరిద్దరు హిందీ కేరక్టర్ ఆర్టిస్టులతో పోలిస్తే రావు రమేష్ చాలా నయం… కానీ..?
సరే, అదంతా వదిలేద్దాం… ఏదో మంచి కేరక్టర్, ఫుల్ లెంత్ కేరక్డర్ వచ్చింది ఇప్పుడు… అదేనండీ, దర్శకుడు సుకుమార్ భార్య సమర్పించిన సినిమా… అంతటి అల్లు అర్జునుడు ప్రిరిలీజ్‌కు వచ్చిన సినిమా… అఫ్‌కోర్స్, అతిరథులు ఆహా అన్నంతమాత్రాన పెద్ద సినిమా అయిపోదు… ఇది చాలా చిన్న సినిమా… ఇదే కథతో, ఇంకెవరైనా సినిమా తీసి ఉంటే… అన్- పాపులర్ నటులతో గనుక సినిమా తీసి ఉన్నట్టయితే ఎవడూ పట్టించుకునేవాడు కాదేమో…
Ads
ప్రిరిలీజుకు ముందే సినిమాను థియేటర్లు, బయ్యర్లు, మీడియా గట్రా గుర్తించడానికి ఓ లెక్క ఉంటుంది అనిపిస్తోంది… సరే, దాన్నీ వదిలేస్తే… అసలు ఏముంది ఈ సినిమాలో… అదేనండీ… మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో… టైటిల్ ఆప్ట్‌గా లేదు… దీనికి ప్రధాన కథానాయకుడు రావు రమేష్… కానీ కేరక్టరైజేషన్‌లో, ప్రజెంటేషన్‌లో అనేకానేక లోపాలు, తప్పులు…
ఎటెటో తీసుకుపోయారు సినిమాను… ఫస్టాఫ్ ఆల్ ఇలాంటి కథలు, సినిమాలు ఓటీటీకి ఆప్ట్… ఇప్పుడు థియేటర్‌కు సుకుమార్ భార్య తీసిందని, అల్లు అర్జున్ ప్రమోట్ చేశాడని… పర్సును థియేటర్ దోపిడీకి ఎవడూ అప్పగించడు… పైగా తనకు స్లో మోషన్స్ మన్నూమశానం… దీనికితోడు ప్రధాన కథానాయకుడికి ఓ కొడుకు, వాడికో లవ్ స్టోరీ… దాంతో సినిమా కథ అడ్డదిడ్డంగా కొట్టుకుపోయింది…
దీనికితోడు లాజిక్స్ లేని సీన్లు… సింపుల్ ఫ్లా చెప్పుకుందాం… వాడొక నిరుద్యోగి, ప్రభుత్వ ఉద్యోగమొస్తేనే చేస్తాడట, దానికి ఏదో జ్యోతిష్కుడి మాట నమ్మకమట… సరే, ప్రభుత్వ ఉద్యోగమున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు… ఆమె తన తల్లి మరణానంతర బీమా సొమ్ము వస్తే, వీడి ఖాతాలో వేస్తుంది… ఇల్లు కట్టుకోవడానికి… వేసే ముందు ఆమె చెప్పదా..? పైగా ఓ క్రెడిబులిటీ ఏమాత్రం లేని వాడి ఖాతాలో ఎందుకు వేస్తుంది..? పైగా ఇప్పుడన్నీ ఆన్ లైన్ క్యాష్ ట్రాన్స్‌ఫర్లు, ఎవరు పంపించారో బ్యాంకు రెగ్యులర్ స్టేట్‌మెంట్లలో, యాప్‌లో ఇట్టే తెలిసిపోతుంది కూడా…
వాడు అట్టహాసంగా ఖర్చులు చేస్తాడు… సంపాదన లేని కొడుక్కి ఓ ప్రేమ కథ… అసలు తండ్రికే తాడూబొంగరం లేదు… వాళ్లిద్దరి యవ్వారాలు చిరాకు పుట్టిస్తాయి… ఇంద్రజకు ఆ మాస్ డాన్స్ అవసరమా..? ఉన్నదే కాస్త రోల్… ఎవరో రమ్య అట… తన రీల్స్, షార్ట్స్‌కు తగ్గని రోల్… కామెడీ వర్కవుట్ అయ్యిందా కాలేదు… పోనీ, చివరిదాకా అదే థ్రిల్ కంటిన్యూ చేశారా..? లేదు… నిజానికి రావు రమేష్ ఎమోషన్స్ పండించడంలో… టాప్… ఎవడెవడో ఇతర భాషల ‘హైలీ పెయిడ్’ కేరక్టర్లకన్నా తను చాలా చాలా నయం…
మరి ఎమోషన్స్ ఉన్నాయా ఇందులో..? అదీ లేదు… సో, ఫెయిల్యూర్ దర్శకుడి దగ్గర ఉంది… నిర్మాత దగ్గర ఉంది… ఈమాత్రం దానికి అల్లు అర్జున్ వచ్చి డప్పు కొట్టినా… సుకుమార్ వచ్చి కీర్తించినా… వచ్చేదేమీ లేదు… నిజం ఇలాగే నిష్ఠురంగా ఉంటుంది కనుక..!!
Share this Article