Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేరీ మూవీ… సింపుల్‌గా, అందరికీ అర్థమయ్యేలా… దర్శకుడు పాస్..!

December 13, 2024 by M S R

.
Movie : Mary……. OTT: Netflix

జీజస్ తల్లి మేరీ గురించి తీసిన సినిమా ఇది. మేరి పుట్టుక నుంచి.. బాల్యం, యవ్వనం, జోసెఫ్‌తో నిశ్చితార్థం, జీజస్ పుట్టుక.. చివరకు జీజస్‌ను దేవాలయానికి తీసుకెళ్లే వరకు ఉన్న కథను తీసుకొని తీసిన సినిమా. చాలా సింపుల్‌గా.. అందరికీ అర్థమయ్యేలా తీశారు. అందరికీ తెలిసిన కథే అయినా.. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు పాస్ అయ్యాడని చెప్పొచ్చు.

ఈ సినిమాలో మేరీని అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. మేరీ పాత్రను ‘నోవా కొయెన్’ వేసింది. నాకైతే ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండాలనిపించింది. ప్రతీ సీన్‌లో ఆమె నటన, అందం ఆకట్టుకుంటాయి. ఇక జోసెఫ్ పాత్ర వేసిన ‘ఇడో టాకో’ పరిధి మేరకు నటించాడు. సినిమా అంతా మేరీ పాత్రనే ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక హేరోదు మహారాజు పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. సినిమాటోగ్రఫి, బీజీఎం సినిమాను మరింత ఎలివేట్ చేశాయి.

Ads

మేరీ, జోసెఫ్ తొలిసారి చూసుకునే సీన్ చూస్తుంటే.. తెలుగు సినిమాలా అనిపించింది. సినిమాలో మేరీ పాత్ర వేసిన ‘నోవా కొయెన్’… కొన్ని సీన్లలో తమిళ నటి హర్ష బొల్లమ్మ లాగా అనిపించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌లో చూస్తేనే సినిమాను ఆస్వాదించగలం. తెలుగు, తమిళ్, హిందీలో కూడా అందుబాటులో ఉంది.

మేరీ.. వివాదం
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మేరీ సినిమా మీద వివాదం చెలరేగింది. సాంప్రదాయ క్రైస్తవులు, పాలస్తీనియన్లు ఈ సినిమాను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇజ్రాయేలీ నటులను పెట్టుకొని సినిమా తీయడంపై పాలస్తీనియన్లు, అరబ్‌లు మండిపడుతున్నారు. క్రీస్తు పుట్టుకలో అసలు పాలస్తీనియన్లు, అరబ్బుల పాత్రే లేనట్లుగా సినిమాలో చూపించారని ఒక వర్గం అంటుంటే.. బైబిల్‌ను వక్రీకరించి సినిమాను తీశారని క్రైస్తవులు అంటున్నారు.

బైబిల్ ప్రకారం మేరీ, జోసెఫ్‌ల మధ్య ముందుగా పరిచయం, ప్రేమ వంటివి ఉండవని.. వారిద్దరికీ నిశ్చితార్థం జరిగిన తర్వాతనే ప్రేమ మొదలైందని వాదిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం.. చాలా గ్రంథాల్లో మేరీ, జోసెఫ్ మధ్య ముందుగానే ప్రేమ ఉన్నట్లు రాశారని చెబుతున్నారు. వారి మధ్య గాఢమైన ప్రేమ ఉందని.. కానీ ఏనాడూ రొమాన్స్ చేయలేదని చెబుతున్నారు.

జీజస్‌కు జన్మనివ్వబోతున్నట్లు మేరీకి ముందుగానే తెలుసు.. అదే విధంగా జోసెఫ్‌కు కూడా ఆ విషయంపై అవగాహన ఉంది. ఇద్దరూ కూడా పరిశుద్ధాత్మ చేత దీవించబడ్డారు.. అందుకే రొమాన్స్ చేసుకోలేదు. కానీ ముందు నుంచే ప్రేమ ఉందని వాదిస్తున్నారు.

మరోవైపు సినిమాలో దురాత్మ లూసీఫర్‌ను తెల్లవాడిగా.. దేవదూత గాబ్రియేల్‌ను నల్లవాడిగా చూపించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. సినిమాలో మెయిన్ కాస్ట్ అంతా ఇజ్రాయేలీయులతో నింపేశారని.. ఇక మిగిలిన క్యారెక్టర్లలో బ్రిటిషర్లను పెట్టారని.. ఇది కావాలనే చేస్తున్నారని పాలస్తీనావాదులు విమర్శిస్తున్నారు.

సినిమా డైరెక్టర్ డీజే కరుసో మాత్రం ఈ విమర్శలు, ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. జీజస్ పుట్టింది ఇజ్రాయేల్‌లో కాబట్టే.. మేము ఆ దేశపు నటులను తీసుకున్నామని చెబుతున్నాడు. బైబిల్‌తో పాటు ఇతర గ్రంథాలను చదవి, అర్థం చేసుకున్న తర్వాతే ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశామని అంటున్నాడు. గతంలో ఈ డైరెక్టర్ యాక్షన్, హార్రర్ సిన్మాలు తీశాడు. ట్రిపుల్ ఎక్స్- ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్, ఇన్‌సైడ్, ఈగల్ ఐ వంటి సినిమాలకు ఈయనే దర్శకుడు.

ఎన్ని విమర్శలు ఉన్నా.. ఆరోపణలు ఉన్నా.. ఈ సినిమా మాత్రం నాకు నచ్చింది. ఆ మేరీ పాత్ర వేసిన అమ్మాయి కోసమైనా మళ్లీ చూడాలి… ( భాయ్‌జాన్ … కోరా జాన్ )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ఎన్టీయార్ ఫోటో వెనుక నేపథ్యం తెలుసా..? గతంలో చదివారా..?
  • KTR ప్రెస్ క్లబ్ డ్రామాకు రేవంత్ డిఫరెంట్ కౌంటర్… రక్తికట్టింది…
  • తన తొలి మూవీ ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత
  • కథ, నటుడు, పాట, సంగీతం… అన్నీ పర్‌ఫెక్ట్ అంచనా వేయగల దర్శకుడు…
  • నయనతారపై మరో పిటిషన్… మెడకు చుట్టుకున్న ఆ డాక్యుమెంటరీ…
  • భద్రాచలంపై చంద్రబాబు సర్కార్ వక్రదృష్టి… రేవంతే స్పందించాలి…
  • ఏమి సేతురా లింగా..! భారీ లాసుల్లోకి కన్నప్ప… నితిన్ తన తమ్ముడే…!!
  • ఏకకాలంలో కేంద్రంతో, ఏపీతో… మూడు పార్టీలతో రేవంత్ పోరాటం..!!
  • ఆ ఒక్క సీన్… సాగరసంగమం సినిమాను అమాంతం పైకి లేపింది…
  • ప్లీజ్… నెత్తురు అంటిన ఆనాటి నా టోపీ ఒకసారి ఇప్పించండి యువరానర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions