.
ఈటీవీ పాడుతా తీయగా షోకు రేటింగ్స్ ఎందుకు రావడం లేదో అర్థం కాదు గానీ కొద్దిరోజులుగా బాగుంటోంది… మరీ 11, 12 తేదీల్లో మ్యాషప్ స్పెషల్ ఎపిసోడ్స్ బాగా రక్తికట్టాయి… స్వరవిన్యాసాలు, స్వరప్రవాహాలు…
మ్యాషప్ అంటే… ఓ ప్రయోగం… ఒక జానర్ నుంచి వేరే జానర్…. క్లాస్, మాస్, శాస్త్రీయం, జాజ్, వెస్టరన్… మిక్సింగు, బ్లెండింగ్… చాలా క్లిష్టమైన ప్రక్రియ… చాదస్తపు శ్రోతలకు కూడా నచ్చకపోవచ్చు… కానీ కంటెస్టెంట్లకు నిజమైన పరీక్ష… వాళ్ల సాధనకు, వాళ్ల ధారణకు, వాళ్ల ఫ్లోకు…!
Ads
డిఫరెంట్ స్కేల్స్… లేదా సేమ్ స్కేల్స్… స్మూత్‌గా ఒక ధోరణి నుంచి మరో ధోరణికి ట్రాన్సిషన్ జరిగిపోవాలి… అది ఒక చరణం నుంచి వేరే పల్లవిలోకి కావచ్చు… ఒక పల్లవి నుంచి వేరే చరణంలోకి కావచ్చు… ప్రస్తుతం షోలో మిగిలిన ఎనిమిది మందీ అదరగొట్టారు…
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది… ఆ ప్రయోగాలకు తగినట్టుగా వాయిద్య సహకారం… భలే కుదిరింది… ప్లస్ కోరస్… మిగతా కంటెస్టెంట్లే కోరస్ పాడుతున్నారు కాబట్టి… సాధన బాగా చేశారు కాబట్టి బాగా రక్తికట్టాయి పాటలు… ఒకరికొకరు భలే సప్లిమెంట్ చేసుకున్నారు… (ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఇది లోపించింది… కోరస్ వీక్… ప్లస్ ఇలాంటి మ్యాషప్ ప్రయోగాల్లేవు)…
నిజానికి గాయకులు బాగా మ్యాషప్ చేశారు, ఎటొచ్చీ జడ్జిలకే కష్టసాధ్యం అయిపోయింది జడ్జ్ చేయడం… చంద్రబోస్ అయితే మొదట్లో చేతులెత్తేసినట్టు అనిపించింది… సునీత ఏవో కవర్ చేసుకుంది గానీ, కీరవాణి సరిగ్గా పట్టుకున్నాడు…
రెట్రో స్పెషల్, కంపోజర్ స్పెషల్, సింగర్ స్పెషల్ అని రకరకాల ప్రయోగాలు చేయడం వేరు… ఈ మ్యాషప్ వేరు… ఇవి సంప్రదాయ ధోరణుల్లో ఇమడవు… అటూఇటూ జంప్ అవుతుంటాయి… ఎనిమిది మందిలో శ్రీలలిత టాప్ పర్‌ఫార్మర్…
ఇక్కడ మరో విషయం… చంద్రబోస్ ఏ వేదిక మీద ఏమాత్రం చాన్స్ దొరికినా, లేక దొరకబుచ్చుకుని మరీ తన ఆస్కార్ పాట నాటు నాటు గురించి ఏదో సుత్తి, సారీ స్తుతి వేస్తుంటాడు… ఇప్పుడూ అంతే… ఆ పాట ఓ మినీ సినిమాా అట… అందులో ప్రేమ, స్నేహం, అవమానం, త్యాగం, విజయం అన్నీ ఉన్నాయట… సోది… ఆ పాటకు అంత సీన్ లేదు గానీ కాస్త ఈ నాటు స్తుతి కాస్త ఆపండి మాస్టారూ…!!
Share this Article