ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ మీద చర్చ సాగుతోంది కదా… నిజానికి మీడియాలో వచ్చే చాలా వార్తల పట్ల ఆర్ఎస్ఎస్ సీరియస్‌గా రియాక్ట్ కాదు… కానీ పదకొండేళ్ల క్రితం కేరళలోని ఓ ప్రధాన పత్రిక మాతృభూమితో తనకు ఘర్షణ అనివార్యమైంది… అది సెకండ్ పాపులర్ డెయిలీ… అంటే మలయాళ మనోరమలో సగం సర్క్యులేషన్ ఉండేది… కరోనా తరువాత ఎంత పడిపోయిందో తెలియదు… విషయం ఏమిటంటే… అది తాజాగా ఆర్ఎస్ఎస్‌కు పత్రికలో క్షమాపణ చెప్పింది…
ఒక ప్రచారక్‌కో, ఒక బాధ్యుడికో గాకుండా… ఏకంగా సంస్థకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది..? అదీ పదకొండేళ్ల తరువాత…! ఈ పత్రిక యాంటీ ఆర్ఎస్ఎస్ ధోరణితో ఉంటుంది… భీకరత్తుడె వైరస్ శీర్షికతో (Virus of Terrorism) ఈ పత్రిక తన వీక్లీలో ఫిబ్రవరి 27, 2011 నుంచి మార్చి 2011 దాకా ‘ఆర్ఎస్ఎస్ టెర్రరిజం ఇండియాను మింగేస్తుందా..?’ అంటూ అయిదు ఆర్టికల్స్ వరుసగా పబ్లిష్ చేసింది… బద్రి రెయినా రచయిత… ఒకరకంగా ఆర్ఎస్ఎస్ మీద అక్షరదాడి…
ఈ పత్రికకు డెయిలీయే గాకుండా రకరకాల అంశాలమీద వీక్లీలు, మంత్లీలు, పోర్టల్స్ ఉన్నయ్… హెల్త్ మీద ఆరోగ్యమాసిక, పిల్లల కోసం బాలభూమి, కార్టూన్ ప్లస్, మహిళల కోసం గృహలక్ష్మి, మాతృభూమి అజతప్పతిప్పు పేరిట ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, స్పోర్ట్స్ మాసిక (మాసిక అంటే మంత్లీ), ట్రావెల్ మీద మాతృభూమి యాత్ర, మిన్నమిన్న మరీ నర్సరీ పిల్లల కోసం, స్టార్ అండ్ స్టయిల్… ఇలా బోలెడు… ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఆర్ఎస్ఎస్ మీద దాడి మొదలుపెట్టింది…
Ads
ఆర్ఎస్ఎస్ 2013లో కేసు పెట్టింది… పోలీసులు పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్లింది… అదీ పరువునష్టం కేసు… ఇప్పుడంటే క్రిమినల్ నేచర్ కూడా కలపొచ్చు, అప్పట్లో అదీ లేదు… Ernakulam Additional Chief Judicial Magistrate Court లో కేసు… అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మీద టెర్రరిస్ట్ గ్రూపు అని ముద్రవేసి, హిందూ టెర్రరిజం అనే పదాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది… హర్యానాలోని పంచకుల మేజిస్ట్రేట్ కోర్టులో నడిచిన స్వామి అసీమానంద కేసు అదే… తనతో కావాలని నిర్బంధంగా ఓ రాంగ్ రిపోర్ట్ మీద సంతకాలు చేయించుకున్నారని ఆరోపణ… ఆ రిపోర్టునే మాతృభూమి పబ్లిష్ చేసింది…
తరువాత అసీమానంద తప్పు ఏమీ లేదనీ, అది తప్పుడు కేసు అనీ కోర్టు తనను వదిలేసింది… ఎర్నాకులం మేజిస్ట్రేట్ కోర్టు ఈ పత్రికకు నోటీస్ పంపిస్తే… అబ్బే, మా రచయిత బోలెడంత అధ్యయనం చేసి, పక్కా పాత్రికేయ కోణంలో రాశాడని బొంకింది… అసలు ఈ కేసు వేయడానికి ఆర్ఎస్ఎస్ కార్యదర్శి ఎవరు..? తనకు లింకేమిటి..? లోకస్ స్టాండి ఏమిటి..? కేసు కొట్టేయండి అని హైకోర్టుకు వెళ్లింది ఈ మీడియా గ్రూపు… సంఘ్‌కు సంబంధించిన కేసు వేయడానికి సంఘ్ రాష్ట్ర కార్యదర్శికి లోకస్ స్టాండి లేదట… అలా నడిచింది మాతృభూమి దబాయింపు…
ఆర్ఎస్ఎస్‌లో ఎవరైనా ఈ కేసు వేయవచ్చు, ఇందులో లోకస్ స్టాండి ఇష్యూ లేదు అని హైకోర్టు సదరు పత్రిక పిటిషన్‌ను కొట్టేసింది… ఈ మీడియా గ్రూపు సుప్రీంకోర్టుకు వెళ్లింది… సుప్రీం కూడా తిరస్కరించేసి, లోకల్ కోర్టులో విచారణ జరగాలని సూచించింది… దాంతో విధిలేక ఇప్పుడు ఓ క్షమాపణ పబ్లిష్ చేసింది… అదీ సుప్రీంలో ఓడిపోయాక… ఎంత తెలివిగా అంటే… ఈ క్షమాపణ ఎవరికి వర్తిస్తే వారికి అంటూ…!!
Mathrubhumi, loses legal battle in SC, Apologises to #RSS for False story
The apology has been carried in Mathrubhumi weekly. It has carried the regret note in its issue dated October 9, 2022. pic.twitter.com/Wq1HxlPpDD
— VSK Foundation, Jaipur (@VSK_Foundation) October 7, 2022
ఏదో తూతూమంత్రం, తుమ్మకాయ మంత్రం క్షమాపణ చెబితే, పబ్లిష్ చేసిన రాతలన్నీ మాఫీ అన్నట్టు కాదు… సో, ఆర్ఎస్ఎస్ కేసు నడిపిస్తుందా..? రాజీపడి, పోనీలే అని వదిలేస్తుందా తెలియదు…!!
Share this Article