Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో బాగా నీరసపడిపోయి… కమెడియన్ హీరోలా చెలరేగిన గ‘మ్మత్తు’వదలరా…!!

September 13, 2024 by M S R

మొన్నామధ్య ఏదో సినిమా వచ్చింది కదా… హీరో నాని సినిమా… సరిపోదా శనివారం… ఇందులో హీరో నానిని విలన్ ఎస్ జే సూర్యా ఫుల్ డామినేట్ చేశాడు… కొత్త సినిమా మత్తువదలరా సీక్వెన్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది…

హీరో కీరవాణి కొడుకు శ్రీసింహా… ఫస్ట్ పార్ట్‌లో పాపం బాగానే ఇంపార్టెన్స్ ఉంది తన పాత్రకు… ఈ సీక్వెల్ వచ్చేసరికి తను నీరసపడిపోయి, తెరను పూర్తిగా కమెడియన్ సత్యకు అప్పగించేశాడు… అప్పగించేయాల్సి వచ్చింది… కథ, కేరక్టరైజేషన్లు అలా ఉన్నాయి మరి… దర్శకుడికి హీరో మెరిట్ మీద ఏదో సందేహం వచ్చి, ఇలా సెకండ్ హీరో పాత్రను ఫుల్ ఫోకస్ చేశాడు… మరి అలాంటప్పుడు హీరోను మార్చుకోవచ్చు కదా అంటారా..? కొన్ని అంతే…

ఈ సినిమా కథలాగే… స్టోరీ పాయింట్ బాగానే ఉంటుంది… కిడ్నాపులు చేధించే ఓ టీం (?? షి టీమ్ లాగా హి టీమ్ అట..) డబ్బు కక్కుర్తితో ఓ కిడ్నాప్ కేసు బ్రేక్ చేయబోతారు… కిడ్నాప్‌కు గురైన వ్యక్తి వీళ్ల కారులోనే శవమవుతుంది… పక్కాగా వీళ్లను ఫ్రేమ్ చేస్తారు ఎవరో..? ఎవరు..? ఎందుకు..? చెబితే స్పాయిలర్… వాళ్లను కనిపెట్టి నానా పాట్లూ పడి బయటపడటమే సినిమా కథ… స్టోరీ బాగానే ఉంది… కానీ ఫస్ట్ పార్టుతో పోల్చి చూసుకోవద్దు…

Ads

తెలుగు సినిమా కామెడీ కదా… అస్సలు లాజిక్కులు ఆలోచించకూడదు… పైగా మెగా సినిమాల రెఫరెన్సులు అక్కడక్కడా… పూర్తిగా కామెడీ, ఫన్ మీదే ఆధారపడ్డాడు దర్శకుడు ఫస్టాఫ్… సెకండాఫ్ వచ్చేసరికి కథకు న్యాయం చేయాలి కదా అని గుర్తొచ్చి ఎలాగోలా క్లైమాక్సుకు తీసుకొచ్చి మమ అనిపించేశాడు…

ఎస్, శ్రీసింహను సత్య పూర్తిగా డామినేట్ చేశాడు… సినిమా మొత్తం తనే మోశాడు… మెరిట్, మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాడే కాబట్టి అలవోకగా చేసుకుంటూ పోయాడు… ఫరియా పర్లేదు… రోహిణి కూడా పర్లేదు… కానీ సునీల్ వంటి కామెడీ స్టార్‌ను పెట్టుకున్నప్పుడు తనను వాడుకునే సీన్లు రాసుకోవాలి కదా… లోపించింది… వెన్నెల కిషోర పాత్రకూ పెద్ద ప్రయారిటీ ఏమీ లేదు…

సత్యస్వామ్యం… సత్య కోసమే తీయబడిన సినిమా అన్నట్టుగా సాగింది… ఫాఫం శ్రీసింహా కక్కలేక మింగలేక… నిజానికి ఇలా పాత్రను ఖూనీ చేస్తుంటే ఎందుకు అంగీకరించాడో తెలియదు… ఇది త్యాగం కాదు, నిర్లక్ష్యం… కాలభైరవ నేపథ్య సంగీతం పర్లేదు, పాటల్లో పసలేదు… ఓటీటీలో వస్తుంది కదా, మత్తు వదలొద్దు… చూడండి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !
  • దేవుడు ఆ రహస్యాన్ని చాన్నాళ్లు దాచాడు – కానీ ఇక దాగలేదు !!
  • స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions