ఎస్… నిజమే… యూట్యూబ్ చానెళ్ల ఇంటర్వ్యూలు ఓ పెద్ద దరిద్రం… అవి పర్సులో యాలకులు బాపతు చెత్తా ప్రచారాలకు బెటర్… ఎవడికీ భాష రాదు.., ఏదో థంబ్ నెయిల్, ఏదో కంటెంటు… జర్నలిజం బేసిక్స్ తెలియవు, స్టాండర్డ్స్ ఉండవు… అన్నింటికీ మించి సంస్కారం, హుందాతనం వంటి పదాలు తెలుగులో ఉన్నాయనేదే వాళ్లకు తెలియదు… అఫ్‌కోర్స్ అవన్నీ పాటిస్తే వ్యూస్ ఉండవు, రెవిన్యూ ఉండదు…
ఈ దుర్గంధం నడుమ సీనియర్ యాంకర్ సుమ యశోద హీరోయిన్ సమంతతో చేసిన చిన్న ఇంటర్వ్యూ బాగనిపించింది… మెచ్చాలనిపించింది… పరిపక్వత, పరిణతి, హుందాతనం అంటే ఏమిటో ఇద్దరూ చూపించారు… వేరే ఇంటర్వ్యూయర్ అయితే సమంత వ్యాధి ప్రస్తావన రాగానే, ఆమె కళ్ల నీళ్లు పెట్టుకోగానే వెంటనే వెళ్లి వాాటేసుకుని, ఓదార్చి, ఓవరాక్షన్ చేసి, కంపు చేసేవాళ్లు… కానీ సుమ బ్యాలెన్స్ చాలాా బాగుంది…
తన వ్యాధి గురించి సమంత స్వయంగా పెట్టిన పోస్టు గురించిన ప్రస్తావన వచ్చింది… కావాలని తీసుకురాలేదు… సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ కాబట్టి, ఆ పరిమితులు దాటకుండానే, డబ్బింగ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ వ్యాధి గురించీ మాట్లాడాల్సి వచ్చింది… సమంత చాలా స్పష్టంగా చెప్పింది…
Ads
‘‘ఇంకో అడుగు వేస్తానా అనిపించేది ఒక దశలో… ఇన్నాళ్లూ అలాంటి దశల్ని దాటి ఇక్కడి వరకూ వచ్చానా అనిపిస్తోంది… నేను మరీ డిజిటల్ మీడియా రాసేసినట్టు చావబోవడం లేదు… నేనిప్పుడున్న స్థితి కోలుకునే స్థితి… నో, నేనింకా చావలేదు… అప్పుడే పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టకండి ప్లీజ్… చావబోవడం లేదు కూడా…’’ అన్నది…
వాట్ ఏ గ్రేస్… ఈ మాటలు చెప్పేటప్పుడు కోపం లేదు ఆమె మొహంలో… జస్ట్, కాజువల్‌గా చెప్పింది… జస్ట్, తన మాట వినకుండా, ఆగలేని కన్నీటిచుక్కను మాత్రం తుడుచుకుంది ఓసారి… సుమ తన కుర్చీ నుంచి లేవలేదు… సమంత వైపు జాలిగా చూడలేదు… వ్యాధి గురించి ఇంకా తవ్వి తవ్వి ఆ కంపును వ్యాప్తిచేయలేదు…
నీ ఫైటింగ్ స్పిరిట్ సూపర్బ్, సమంతా, నువ్వు సెలబ్రిటీవి, నీ పోస్టులోని ప్రతి అక్షరం మీద ఓ కథ రాయగలరు… వస్తూనే ఉంటాయి… ఓసారి ఏదో కారణంతో నా గొంతు పోయింది, నాకు గొంతు లేక ప్రాణం లేదు… ఇంకేముంది..? సుమకు గొంతు కేన్సర్ అని రాసిపారేశారు, ఇక రేపోమాపో అన్నట్టు చిత్రీకరించారు… లైట్ తీసుకోవడమే… అని చెప్పుకొచ్చింది…
కరెక్టు, సమంత ఇప్పుడున్న స్థితిలో ఆమెకు జాలి, ఓదార్పు కాదు కావల్సింది… నీ సెల్ఫ్ మోటివేషన్, నీ ఫైటింగ్ నిన్ను గట్టెక్కిస్తాయనే నాలుగు ధీమా మాటలు… సుమ చెప్పింది అదే… వాస్తవానికి సుమ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు సూపర్ డప్పులు… ఈ ఇంటర్వ్యూ కూడా 80 శాతం అదే… కానీ చికాకు పెట్టి, చిల్లరతనాన్ని పోగుచేసి, వ్యూస్ పట్టుకునే వెధవాయిత్వానికి ఆమె చాయిస్ ఇవ్వలేదు…
సమంత కూడా గొంతు బలహీనంగా ఉంది, తను నీరసంగా ఉంది తప్పితే ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుతోంది… అవును, ఆమె ఫైటర్… మిగతా చాలా విషయాల్లో ఆమె మీద చాలామందికి విమర్శలు ఉండవచ్చుగాక… ఆమే చెప్పినట్టు ఆమె ఫైటర్… సమంతగా ఆమె చావలేదు… చావట్లేదు…!! ఆమె మధ్యలో ఓ మాటన్నది… ‘‘ఎన్నో సమస్యల మీద ఎందరో పోరాడుతున్నారు కదా… వారిలో నేనూ ఒకదాన్ని, అంతే…’’ దటీజ్ స్పిరిట్… త్వరగా కోలుకో సమంతా…
Share this Article