పర్ సపోజ్…. జగన్ గనుక అవే వ్యాఖ్యలు చేసి ఉంటే… ఈ సాయంత్రంలోపు చేస్తే… ఇదే నిమ్మగడ్డ… ఈ ముఖ్యమంత్రిని 21వ తేదీ వరకు హౌజ్ అరెస్టు చేయండి, మీడియాకు దూరంగా ఉంచండి… అంటూ డీజీపికి ఆదేశాలు జారీ చేస్తాడా..? చేస్తాడు… ఖచ్చితంగా చేస్తాడు… ఇప్పటివరకూ నిమ్మగడ్డను సరిగ్గా టాకిల్ చేయలేక చేతులెత్తేస్తున్న జగన్‌కు… పరిస్థితి ఇలాగే ఉంటే, అదీ తప్పకపోవచ్చు………. అవును, తెలంగాణలో ఓ పదముంది… సెలుపుడు… అంటే కెలుకుతూనే ఉండటం… ఆ పనే నిమ్మగడ్డ చేస్తున్నాడు… తనకు పోయేదేమీ లేదు ఇప్పుడు… ఈ జాస్తి చలమేశ్వర్‌లు, తన సలహాదారులు నయాపైసాకు ఉపయోగపడటం లేదు… నిమ్మగడ్డ ఏ శాఖ పరిధిలోకి వస్తాడో, అదే శాఖ మంత్రి పెద్దిరెడ్డిని 21 వరకూ ఇంటి నుంచి బయటికి రానివ్వవద్దని నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలు తాజా ట్విస్టు… వావ్… కథ పాకాన పడుతోంది… జగన్ యంత్రాంగం ఒక్కడిని కౌంటర్ చేయలేక దిక్కులు చూస్తోంది…
Ads
పెద్దిరెడ్డి చేసిన తప్పేమిటయ్యా అంటే… ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎవరైనా రిటర్నింగ్ ఆఫీసర్లు వ్యవహరిస్తే బ్లాక్ లిస్టు చేస్తామని ప్రకటించడం… మరి సర్వ ఆమోదనీయమైన ఏకగ్రీవాల్ని వ్యతిరేకిస్తూ సాక్షాత్తూ ఎన్నికల కమిషనరే వ్యవహరిస్తుంటే… ఏం చేయాలి..? ఒకసారి సుప్రీం ఎన్నికల సంఘమే ఫైనల్ అని చెబితే అది అల్టిమేటా..? మరెందుకు ఎప్పటికప్పుడు సుప్రీంలో రిట్లు వేయడం లేదెందుకు..? అసలు నిమ్మగడ్డకు కౌంటర్ అని భావించే ప్రివిలేజ్ కమిటీ తనకు నోటీసులు జారీ చేయడం లేదెందుకు..? భయపడుతున్నాడా జగన్..? అదుపు తప్పితే, మోడీ తన కుర్చీ గల్లంతు చేస్తాడని వణుకుతున్నాడా..? నిమ్మగడ్డపై ఔట్ రైట్‌గా వెళ్లే సాహసం లేదెందుకు..? ఇది సగటు వైసీపీ ఫ్యాన్ సందేహమే… ఒక వ్యక్తి రాగద్వేషాలు సిస్టంను అతలాకుతలం చేసేంత డొల్ల నియమావళా మనది..?
రేషన్ తీసుకెళ్లే వాహనాలు రంగులు మార్చండి అని ఆదేశించాడు నిమ్మగడ్డ… సమస్య సివిల్ సర్వీసు అధికారులకు ట్రెయినింగు ఇచ్చే ముస్సోరీ ట్రెయినింగ్ సంస్థది… లేకపోతే ఏమిటిది..? ప్రజలు అంత పిచ్చోళ్లా..? ప్రజల్ని అవమానిస్తున్నారా..? ఒక వ్యక్తి ఆలోచనాలోపాలు సిస్టంకు శాపాలు కావాలా..? రేషన్ వెహికిల్ రంగులు చూసి జనం తమ ఓట్లను నిర్ణయించుకుంటారా..? ప్రజలకు విజ్ఞత లేదా..? పక్కాగా ఇది వోటర్లను అవమానిస్తున్నట్టే లెక్క… పైగా రంగులకు పార్టీల పేటెంట్లు ఉంటాయా..? మరి మూడు రంగుల జెండా ఎగరేస్తే, అది కాంగ్రెస్‌కు అనుకూలం కాదా..? ఐనా పంచాయతీ ఎన్నికలే పార్టీ రహితం అన్నప్పుడు, ఇక పార్టీ రంగులతో, రేషన్ వెహికిల్స్‌తో లింకేముంది..? అసలు వీటన్నింటికన్నా తాత్కాలికంగా జగన్ ప్రభుత్వాన్ని అభయెన్స్‌లో పెట్టేయడం చాలా బెటర్ కదా మరి…!!
Share this Article